Pimple care : మొటిమలు పోవాలంటే ప్రతిఒక్కరూ ఈ క్రింద తెలిపిన పద్ధతుల్లో మీకు నచ్చిన విధానాన్ని పాటించండి. ఎలాంటి క్రీములతో పని లేకుండా స్కిన్‌కు ఎఫెక్ట్ కాకుండా ఇంటిలోనే ఈ చిట్కాలు ఉపయోగించవచ్చు.
Pimple care : ప్రతిఒక్కరూ యౌవ్వన దశలోకి వచ్చిన తర్వాత ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి. అవి ముఖంపై కొందరికి ఇబ్బంది కలిగించడంతో పాటు అందహీనంగా కనిపించేలా చేస్తాయి. వాటి బాధ తట్టుకోలేక కొంతమంది వాటిని అద్దం ముందు నుంచొని నొక్కుతుంటారు. ఇలా చేయడం వల్ల మొటిమలు ఇంకా ఎక్కువ అవుతాయి. అయితే ఈ మొటిమలు పోవడానికి మన ఇంట్లోనే సహజమైన చిట్కాలు పాటిస్తే చాలు. కొన్ని వారాలపాటు అలా చేస్తే మొటిమల సమస్య తగ్గిపోతుంది.
దాల్చిన(Cinnamon ) చెక్క పొడితో..
దాల్చిన చెక్క పొడితో మొటిమలను దూరం చేసుకోవచ్చని డెర్మిటాలజిస్టు(dermatologist)లు సూచిస్తున్నారు. కొద్దిగా దాల్చిన చెక్క పొడిని తీసుకుని అందులో సరిపడ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మొటిమలు, నల్లమచ్చలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. ఇలా క్రమంగా చేయడం వల్ల నల్లమచ్చలు తగ్గుముఖం పడతాయి. నిమ్మరసం ఉపయోగించడం ఇబ్బంది అనుకుంటే, దానికి బదులుగా తేనెను కూడా ఉపయోగించవచ్చు. చెంచా దాల్చిన చెక్క పొడిని మూడు చెంచాల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, మచ్చలు ఉన్న చోట రాసుకోవాలి. అలా రాత్రంతా ఉంచి పొద్దున్న లేవగానే శుభ్రం చేసుకోవచ్చు. ఒక వేళ అలా ఇబ్బంది అనుకున్న వారు రాసుకున్న 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా వారానికోసారి చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.


మొటిమలు మచ్చలుగా మారితే..
- మొటిమలు పగిలి నల్లమచ్చలుగా ముఖంపై ఉండిపోతాయి. వాటిని ఎలా నివారించుకోవాలి అని ప్రతి ఒక్కరినీ బాధించే సమస్య. దానికి చక్కని పరిష్కారం ఉంది. ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు మెడికల్ సబ్బులను ఉపయోగించి మొఖాన్ని కడుక్కోవాలి. తర్వాత దూదితో రెగ్యలర్ క్రీమును అప్లై చేసుకోవాలి.
- వేపాకులను(Neem leaves) నీటిలో వేసి చిన్న మంట మీద వేడిచేయాలి. చల్లారిన తర్వాత దీనిని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ప్రతిరోజూ ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేసుకోవాలి. వేప యాంటిసెప్టిక్‌గా పనిచేయడం వల్ల మొటిమలే కాక ఎలాంటి మచ్చలు ఉండవు.
- కొద్దిగా దాల్చిన చెక్క పొడి, కొన్ని చుక్కల నిమ్మరసం, తేనెను కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలపై మాత్రమే రాయాలి. రెండు గంటలు ఉంచుకుని కడిగేసుకోవాలి.
- ముల్తానీ మట్టి(multani mitti)కి రోజ్‌వాటర్, నిమ్మరసం కలిపి పేస్టులా చేయాలి. దీనిని వారానికి రెండు, మూడు సార్లు ముఖానికి రాసుకోవాలి. మొటిమలు పగలడం వల్ల వచ్చే ద్రవాన్ని చేతితో తీయకుండా కూరగాయల తొక్కలు, లేదా పండ్ల తొక్కలను ఉపయోగించాలి. దీని వల్ల ముఖంపై వేరే ప్రదేశంలో ద్రవం అంటకుండా ఉంటుంది. ఇలా జాగ్రత్తలు పాటిస్తూనే ఆహారంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. తాజా పండ్లు, మొలకెత్తిన గింజలు, సలాడ్లు, పెరుగు మీ రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. రోజుకు 8 గ్లాసుల మంచినీరు తప్పనిసరిగా తాగాలి. ఒక గ్లాసు మంచినీటిలో నిమ్మరసాన్ని పిండుకొని పొద్దునే తాగితే శరీరానికి ఏంతో మేలు చేస్తుంది.


ఇంటి వైద్యంతో చెక్
పొద్దున్నే ముఖాన్ని అద్దంలో చూసుకుంటే రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన మొటిమ వెక్కిరించిందనుకోండి. చాలా కోపం వస్తుంది. ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తే ముఖం నిండా మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సమస్యను పోగొట్టుకునేందుకు ఇలాంటి గృహ చిట్కాలు పాటిస్తే మేలు.
వేప ఆకు : ముదురు వేపాకులు, తులసి ఆకులను మరిగే నీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి. నీళ్లు తక్కువుగా ఉండేలా చూసుకుంటే మంచింది. బాగా ఉడికిన తర్వాత ఆ నీటిని చల్లార్చి దాంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు పెరగవు. ముఖంపై కూడా ఎలాంటి అలర్జీలు రావు.
తులసి(Tulsi): పచ్చటి తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి గట్టిగా నలిపి పిండితే రసం వస్తుంది. ఆ రసానికి రెండు మూడు చుక్కల నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని మొటిమల మీద రాస్తే మటుమాయం అవుతాయి. ముఖం తేజోవంతంగా ఉంటుంది.
ఐస్ ముక్కలు : శుభ్రమైన పొడి గుడ్డను తీసుకుని అందులో ఐస్ ముక్కల్ని వేయాలి. మడత పెటి్ట దానిని మొటిమలపై కాసేపు ఉంచాలి. కొంచెం విరామం తర్వాత మళ్లీ అలానే చేయాలి. రాత్రి పడుకునే ముందు కాటన్‌ను నిమ్మరసంలో తడిపి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి గృహ చిట్కాలు పాటిస్తేనే పైసా ఖర్చు లేకుండా మొటిమలను దూరం చేసుకుని ముఖాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చు.
మొటిమలకు టోమాటో మేలు!
- ముఖంలో కొందరికి చర్మగ్రంథులు పెద్దగా అవుతాయి. ఈ సమస్యకు టొమాటో మంచి పరిష్కారం. రెండు చెంచాల టొమాటో రసంలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి ముఖమంతా రాసుకోవాలి. పదిహేను నిమిషాలయ్యాక గోరు వెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.
- ఎండ కారణంగా చర్మం కమిలిపోయినట్టు అయిపోతుందా? అయితే రెండు చెంచాల టొమాటో రసంలో నాలుగు చెంచాల మజ్జిగ కలపాలి. దీన్ని ముఖానికి రాసి, మృదువుగా మర్దన చేయాలి. ఇది పూర్తిగా ఆరిపోయాక కడిగేయాలి. ఇలా తరుచూ చేస్తుంటే సమస్య అదుపులోకి వస్తుంది. అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది.


- ఓ టొమాటో(tomato)ను తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగేసి వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. టొమాటోలో ఉంటే కూలింగ్, యాస్ట్రింజెంట్ గుణాలు చర్మానికి స్వాంతన అందించి, అధిక జిడ్డును పీల్చుకుంటాయి. అలా మొటిమలు తగ్గుతాయి.
- ముఖం నిర్జీవంగా ఉన్నప్పుడు రెండు చెంచాల పెరుగులో సగం టొమాటో రసం కలిపి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడిగేయాలి. పెరుగులోని పోషకాలు చర్మాన్ని బిగుతుగా మార్చి, మెరిసేలా చేస్తే, టొమాటో ఉపశమనం అందించి, తాజాగా మారుస్తుంది.
- చర్మం నిగారింపును సంతరించుకోవాలంటే రెండు మూడు చెంచాల టొమాటో గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి, మర్ధన చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
అమ్మాయిల ముఖసౌందర్య కోసం..
ప్రస్తుతం జనరేషన్లో యువత ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య మొటిమలు. ఈ మొటిమలు వచ్చినప్పుడు భరించలేని నొప్పితో బాధపడటమే కాకుండా ముఖసౌందర్యం అందవిహీనంగా తయారవుతుంది. ముఖ్యంగా అమ్మాయిల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఆ మొటిమలు వచ్చినప్పుడు ఇంట్లో నుంచి బయటకు ఎక్కువ రాకుండా, వాటి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల తంటాలు పడుతుంటారు. అంతేకాదు.. ఈ మొటిమలు తగ్గిన చోట వాటి మచ్చలు అలాగే ఉండిపోతాయి. అలాంటప్పుడు వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఆ చిట్కాలు ఏమిటంటే…
- ఒక పాత్రలో కొద్దిగా శనగపిండి తీసుకుని, అందులో కాస్త పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పేస్టులా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలపాటు అలాగే ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే.. మొటిమలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.


- ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఉల్లిరసం వేసి, అనంతరం దాంట్లో కొంచెం తేనె వేసి కలపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు, వాటి మచ్చలపై రాసి కొద్దిసేపు మర్థన చేసుకోవాలి. గంట సేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది. ఇవే కాకుండా, గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని అర్థ గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారినికి రెండు సార్లు చేస్తే మొటిమల బాధ నుంచి కొంత మేరకు ఉపశమనం పొంద వచ్చని బ్యూటీషియన్లు అభిప్రాయపడుతున్నారు.
- ఒక స్పూన్ మెంతులపొడి, ఒక స్పూన్ పసుపుపొడి, దోసకాయగుజ్జు, ఒక స్పూన్ టమాటా రసం, కొబ్బరినీళ్లు..ఒక పాత్రలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
- మెంతికూర, వేపాకు చిగుళ్లు, పసుపు కలిపి నూరాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేక మూడు సార్లు చేస్తే మొటిమలు, మచ్చలు మాయమవుతాయని వారు చెబుతున్నారు.
బ్లాక్ హెడ్స్ తొలగించే నిమ్మ
నిమ్మరసంలో చర్మఛాయను మెరుగుపరిచే బ్లీచింగ్ గుణాలు అధికం. అర చెక్క నిమ్మరసానికి కొద్ధిగా నీళ్లు, అరచెంచా తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. రెండు చెంచాల నిమ్మరసానికి చెంచా తేనే, చెంచా బాదం నూనె కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీనిని ముఖానికి, మెడకీ పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీని వల్ల తేమతో పాటు ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. మృతకణాలు తొలగించడానకి నిమ్మరసం ఎంతో ఉపయోగపడుతుంది. సగానికి కోసిన నిమ్మచెక్కను పంచదారలో అద్ది, దాంతో ముఖాన్ని సున్నితగా రుద్దుకుంటే మృతకణాలు తొలిగిపోతాయి. బ్లాక్ హెడ్స్ ఎక్కువుగా ఉండే ప్రాంతంలో సన్నగా తరిగిన నిమ్మచెక్కతో కానీ, నిమ్మరసంలో ముంచిన దూదితో కానీ రుద్ధితే ఫలితం ఉంటుంది. ముఖంపై పేరుకున్న బ్యాక్టీరియా తొలగి, యాక్నే వంటి సమస్యలు పోతాయి. ముఖ చర్మమూ మృదువుగా మారుతుంది.


Beauty Tips: మొటిమల నివారణకు..
మనం సాధారణంగా ఎదుర్కొనే చర్మ సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి మొటిమలు. టీనేజ్‌లోకి ప్రవేశిస్తున్న వారిలో ఈ సమస్య ఎక్కువుగా ఉంటుంది. మరి ఈ సమస్యను ఎదుర్కోవడం ఎలా? ఈ క్రింద చెప్పినవి పాటిస్తే మీ మొటిమల సమస్య పరిష్కారం అయినట్టే..
- రోజుకు రెండు సార్లు సబ్బుతో ముఖం కడుక్కోవాలి. మరో మూడు, నాలుగు సార్లు చల్లటి నీళ్ళు ముఖం మీద చిలకరించుకోండి. చుండ్రు ఉన్నట్లయితే వెంటనే జాగ్రత్తలు తీసుకోండి. మీరు ముందుగా మీ టెన్షన్, ఒత్తిడి తగ్గించుకోవాలి.
- మేకప్ ఎక్కువుగా చేసుకోవద్దు. దీని వల్ల చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. ఒక వేళ మేకప్ చేసుకోవడం తప్పదనుకుంటే రాత్రి పడుకునేప్పుడు మేకప్ శుభ్రంగా తుడిచేసి మాయిశ్చరైజర్ రాసుకోండి.
- రోజు ఒక 10 నిమిషాల పాటు నీరెండలో నిలబడండి. పళ్ళు, పళ్ళరసాలు తీసుకోండి. ఆకుకూరలు బాగా తినాలి. సలాడ్లు తీసుకోవాలి. కూరలలో కొత్తమీర ఎక్కువగా వాడాలి. అతిగా తినడం తగ్గించాలి. కూరలు ఫ్రై చేసే బదులు ఉడికించుకుని తినండి.
- మార్కెట్లో దొరికే క్రిములన్నీ కొన్ని ప్రయోగాలు చెయ్యొద్దు. స్కిన్ స్పెషలిస్టును కలిసి మొటిమలు తీవ్రతను బట్టి మందులు వాడండి. మొటిమలు చిదమడం, సూదులతో గుచ్చడం వంటివి చెయ్యొద్దు. పుదీనా, తులసి ఆకులు మెత్తగా నూరి రాస్తే మొటిమలు తగ్గుతాయి. తులసి ఆకులు నూరి పెరుగులో కలిపి రాసినా ఫలితం ఉంటుంది.
- టమాటా పండ్ల రసం తీసి మొటిమల మీద ఓ గంట తర్వాత ముఖం కడిగేయండి. ఇలా రోజుకు మూడు సార్లు చేస్తే మొటిమలు తగ్గుతాయి. యాపిల్ గుజ్జు ముఖానికి రాసి అరగంట తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడగండి. మొటిమలు తగ్గి ముఖం కాంతివంతం అవుతుంది.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!