Pilla jalla Intikada Yetla Undro | కరోనా వైరస్ మన జీవితాల్లో గత రెండు సంవత్సరాలుగా అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్నో కుటుంబాలు అయిన వారిని పోగుటుకున్న గుర్తులు ఇంకా గుండెల్లో మెదిలాడుతూనే ఉంటాయి. ఎందరో కన్నీళ్లు గార్చి నేల తడిసి పోయిన గుర్తులు అలానే ఉన్నాయి. వలస కూలీల బతుకులు రోడ్డున పడిన పాద ముద్రలు రోడ్లపై కనిపిస్తూనే ఉంటాయి. కరోనా కన్నీటిని మిగిల్చింది. యావత్తు ప్రపంచం అంతా చిగురుటాకులా వణికిపోయింది. ఇక భారతదేశం అయితే మన కళ్ల ముందు జరిగిన ఘటనలు ఇంకా మదిలో మెదులాడుతూనే ఉంటాయి. కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ పెద్ద, చిన్న, ధనిక, పేద, మధ్య తరగతి కుటుంబాల బతుకులను విచ్చిన్నం చేసింది.
ఈ వైరస్‌పై తెలుగులో వచ్చిన ఒక్క పాట యావత్తు ప్రపంచం అంతా కరోనా(corona)తో అల్లాడుతున్న క్షణాలను కళ్లముందు చూపించి కన్నీళ్లు తెప్పించింది. అదే Adesh Ravi రాసిన పిల్లజెల్లా ఇంటికాడా ఎట్ల ఉండ్రో..సాంగ్. ఇది విన్న వాళ్లంతా కఠిన మైన గుండెలు కూడా కరిగిపోయి కన్నీళ్లు పెంటుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ పాట వలస కూలీలు కరోనా వచ్చిన సమయంలో వారు పడిన బాధలను కళ్లకు కట్టినట్టు చూపించింది. ఈ పాటలో ఉన్న వేదన కన్నీరు తెప్పించింది. బ్రతకడం కష్టంగా మారిన క్షణాలను కళ్ల ముందు చూపించింది. అయిన వారు వద్దకు, పుట్టిన వూరు గడప తొక్కటానికి వలస కూలీల కుటుంబాలు పడిన వేదన, రోదన ఈ పాట వింటే తెలుస్తుంది. ఆ సమయంలో కాలి నడకనే ఆసరాగా చేసుకుని గుండెల్లో వేదన నింపుకొని వేల మైళ్ల దూరాన్ని పిల్లపాపలతో ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా పిల్లల్ని చంకపెట్టుకుని నడిచిన వారి ధీన పరిస్థితి చూస్తే ప్రపంచం ఇంతటితో అంతం అవుతుందా అనేంతలా వైరస్ ప్రభావం కనిపించింది.
ఈ పాటలో పొట్టచేత పట్టుకుని ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వచ్చి జీవనోపాధి కోసం బ్రతుకీడుస్తున్న ప్రతి ఒక్క మనిషి జీవితంలో కన్నీరును చూపించింది. ఎంతలా అంటే వారి వేదన, రోదన సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరూ, ప్రత్యక్షంగా చూసిన ప్రతి ఒక్కరూ కంట కన్నీరు పెట్టుకునేంతలా పరిస్థితులు చవిచూడాల్సి వచ్చింది. కరోనా మన జీవితాల్లో ఎంత ప్రభావం చూపించిందనేదుకు నిదర్శనం ఈ ఒక్క తెలుగు పాట చాలు. నిజంగా Adesh Ravi ఎంతలా బాధ పడి రాసిండో ఆ పదాలను చదివితే దుఃఖం ఉబికి వస్తుంది. ఈ పాట ఎప్పటికీ కరోనాతో మనం ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను కళ్లముందు చూపిస్తూనే ఉంటుంది. ఇప్పటి…ఎప్పటికీ..!
Pilla jalla Intikada Yetla Undro lyrics
పిల్లజెల్లా ఇంటికాడా ఎట్ల ఉండ్రో
నా ముసలి తల్లీ ఏమి బెట్టీ సాదుతుందో
పూటపూటా చేసుకోని బతికేటోళ్లం
పూట గడవా ఇంత దూరం వచ్చినోళం
దేశమేమో గొప్పదాయె
మా బతుకులేమో సిన్నవాయె
మాయదారి రోగమొచ్చి
మా బతుకు మీదా మన్నబోసి
ఏమి బతుకూ చెడ్డ బతుకూ
చెడ్డ బతుకూ..చెడ్డ బతుకూ చెడ్డ బతుకూ
పేద రోగం కంటె పెద్దా రోగముందా?
ఐనవాళ్ల కంటే పెద్దా అండ ఉందా?
కష్టకాలం ఇంటికాడా ఉంట సారూ
కలిసిమెలిసి కలో గంజో తాగేటోళ్లం
పిల్లగాళ్లు కన్నులళ్ల విడువకుండా మెదలబట్టే
ఇంటి దాని దుఃఖమేమో ఆగకుండా తరమబట్టే
ఏమి జేతూ ఏమి జేతూ ఏమి జేతూ ఏమి జేతూ ఏమి జేతూ
బస్సలొద్దూ బండ్లు వద్దూ అయ్య సారూ
ఇడిసి పెడితే నడిసి నేనూ పోత సారూ
బస్సలొద్దూ బండ్లు వద్దూ అయ్య సారూ
ఇడిసి పెడితే నడిసి నేనూ పోత సారూ
పిల్లజెల్లా ఇంటికాడా ఎట్ల ఉండ్రో
నా ముసలి తల్లీ ఏమి బెట్టీ సాదుతుందో
పిల్లజెల్లా ఇంటికాడా ఎట్ల ఉండ్రో
నా ముసలి తల్లీ ఏమి బెట్టీ సాదుతుందో
ఇడిసి పెడితే నడిసి నేనూ పోత సారూ
Lyrics & Singer: Adesh Ravi
Dop: Madhu Kotwal
Editing: Uday Kumbham
Gfx: Mittu Aretty
Correspondent: Ajay
Co Producer: Damu Reddy
Execution: Satish Manjeera
Producer: Appi Reddy
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!