Piles Fisssure & Fistula Homeopathic | సమస్య ఏదైనా వైద్యులకు చూపించి చికిత్స తీసుకుంటే ఉపశ మనం కలుగుతుంది. కానీ కొన్ని రకాల సమస్యలను వైద్యులకు చెప్పుకోవడానికి మనసొప్పదు. చాలా సార్లు సమస్య అంతా అక్కడే మొదల వుతుంది. వాటిలో ముఖ్యంగా ఫిస్టులా, పైల్స్, ఫిషర్. ఇవి గుప్త భాగాల్లో వచ్చే సమ స్యలు కావడం వల్ల వీటి గురించి బహిరంగంగా చెప్పుకునే వారు చాలా తక్కువ. అయితే ఈ సమస్యలు మల విసర్జన సమయంలో నరకాన్ని చూపిస్తాయి.
Piles Fisssure & Fistula Homeopathic
విపరీతమైన రక్తస్రావం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయి శరీరం రోగాలకు నిలయంగా మార్చే ప్రమాదం ఉంది. అందుకే వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే హోమియో డాక్టర్‌ను సంప్రదించడం ఎంతో ముఖ్యం. ఈ సమస్యలకు హోమియేలో అద్భుతమైన మందులు ఉన్నాయని డాక్టర్లు అంటు న్నారు. ఫిస్టులా, ఫైల్స్, ఫిషర్ సమస్యలతో బాధపడే వారి సంఖ్య తక్కవేమీ కాదు. కాకపోతే, సమస్య మరీ తీవ్రమైన భరించలేని స్థితికి వస్తే కానీ, చాలా మంది డాక్టర్‌ను సంప్రదించరు. మహిళలు ఈ విషయాల్ని మరింత గుప్తంగా ఉంచుతారు. అందువల్ల తీవ్ర మైన రక్తస్రావానికి గురై రక్తహీనత సమస్యను కొని తెచ్చు కుంటారు. రక్త హీనత కారణంగా వ్యాధి నిరోధక వక్తి తగ్గిపోయి శరీరం రోగాల నిలయమవుతుంది.
ఈ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువ మంది శస్త్ర చికిత్సలకు వెళతారు. నిజానికి శస్త్ర చికిత్సల వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప అది సమస్యను సంపూర్ణంగా తొలగించదు. వ్యాధి మూలాలను సమూలంగా తొలగిస్తే గానీ ఈ సమస్యలు పూర్తిగా కనుమరుగైపోవు. అలాంటి మూల వైద్యం చేయడంలో హోమియో వైద్యులు ఎంతో సిద్ధహస్తులు.
యానల్ ఫిస్టులా(భగంద్రం)
ఏ రెండు అవయవాల మధ్యగానీ, రెండు నాళాల మధ్య గానీ ఒక సొరంగం లాంటిది ఏర్పడటాన్ని ఫిస్టులా అంటారు. ఏదైనా వ్యాధి మొదలైనప్పుడే ఈ స్థితి ఏర్పడుతుంది. మలద్వారానికీ, ఆ భాగంలో ఉండే గ్రంధులకు మధ్య ఏర్పడే ఈ మార్గాన్ని యానల్ ఫిస్టులా అంటారు. ఆ గ్రంథులకు అడ్డంకి ఏర్పడి గడ్డలా తయారు కాగానే అది ఫిస్టులాగా మారుతుంది.
లక్షణాలేమిటి?
ఫిస్టులా రోగికి ప్రాణాంతకమేమీ కాకపోయినా, అది కలిగించే బాధ వర్ణనాతీతం. ఆ బాధల్లో ముఖ్యంగా చీము, రక్తం కలగలిసిన ద్రవం పిరుదులు, మలద్వారం వద్ద నుంచి తరుచూ రావడం, భరించలేని నొప్పితో పాటు జ్వరంగా కూడా ఉంటుంది. కొన్ని సార్లు చలిజ్వరం కూడా రావచ్చు. కొందరికి మలంతో పాటే రక్తమూ రావచ్చు. సాధారణ లక్షణాలు కొన్ని కనిపించగానే యానస్కోపి, సిగ్మాయిడో స్కోపి, ఫిస్టిలోగ్రాం, ఫిస్టులా ప్రోబ్ వంటి పరికరాలతో సమస్యను గుర్తించ వచ్చు.
అర్శ మొలలు(ఫైల్స్)
మల ద్వారం పక్కనే ఉండే దమనులు ఉబ్బిపోవాడాన్నే అర్శమొలలు అంటారు.
ఎక్స్టర్నల్ పైల్స్: మొదట్లో మలవిసర్జనకు వెళ్లినప్పడు మాత్రమే నొప్పి వస్తుంది. ఆ తరువాత దశలో వెళ్లి వచ ్చిన మూడు, నాలుగు గంటల దాకా నొప్పి ఉంటుంది. చేతితో తాకితే గడ్డల్లా అనిపిస్తాయి. దుర దగా కూడా ఉంటుంది. అర్థరాత్రి వేళ ఈ దురద ఎక్కువగా అనిపిస్తుంది.
ఇంటర్నల్ ఫైల్స్: ఈ సమస్య ఉన్నవారిలో రక్తం ధారగా కారుతూ ఉంటుంది. కొన్నిసార్లు మలంతో పాటే కలిసి వస్తుంది. కొంత మందిలో మల విసర్జన తరువాత చుక్కలు చుక్కలుగా రక్తం పడుతూ ఉం టుంది. కొన్నిసార్లు రక్తం మలంతో కలిసి వస్తుంది. గర్భిణీ స్త్రీలలో కూడా ఫైల్స్ సమస్యకు గురయ్యే వారు ఎక్కువే. కాకపోతే ప్రసవం తరువాత చాలా మందిలో తగ్గిపోతాయి. కొందరిలో అప్పటికి తగ్గినా తరువాత మళ్లీ రావచ్చు. కొన్నిసార్లు మలద్వారం నుంచి జిగటగా పడుతూ ఉంటుంది. కాకపోతే, ఇంటర్నల్ పైల్స్‌ను గుర్తు పట్టడానికి మలద్వారం వద్ద ఏ లక్షణమూ కనిపించదు.
యానల్ ఫిషర్
కొన్నిసార్లు మలద్వారం వద్ద చర్మం చిట్లిపోయి రక్తస్రావం అవుతూ ఉంటుంది. మలద్వారం వద్ద వచ్చే ప్రతి సమస్యనూ చాలా మంది పైల్స్గానే భావిస్తారు. దానికి కారణం పైల్స్, ఫిశ్మర్ లక్షణాల మధ్య ఉండే తేడా తెలియకపోవడమే. మల విసర్జన సమయంలో, విసర్జన తరువాత కూడా మంటగా ఉండటం. కొంద రిలో విసర్జనకు ముందుగానే రక్తం పడుతుంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారితీసి ఈ కారణంగా మరికొన్ని ఇతర వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. వైద్య చికిత్సలకు వెళ్లడంలో ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అల్సర్లు తయారై ఏళ్ల పర్యంతం వేధించే ప్రమాదం ఉంది.
హోమియో వైద్యం
పైల్స్‌కు సంబందించిన వైద్యంలో హోమియోలో ఒక విలక్షణమైన విదానం ఉంది. ప్రత్యేకించి దెబ్బ తిని వాచిపోయిన దమనులను తిరిగి పూర్వస్థితికి తెచ్చే సామర్థ్యం హోమియో మందులకు ఉంది. అందుకే ఇక్కడ ఫైల్స్ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. ఫిస్టులాలోనూ ఆ మార్గాన్ని మూసివేయడమే కాకుండా, హోమియో మందులు సమస్య మరోసారి రాకుండా కూడా చేయగలవు. అందుకే రోగికి అతి త్వరితంగా ఉపశమనం లభి స్తుంది. ఈ సమస్యలకు ఎవరైనా శస్త్ర చికిత్స చేయించుకున్నా ఈ సమస్యలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి.
పైగా ఒక్కోసారి సర్జరీ కారణంగా మల విసర్జన మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే, అలాంటి ఏ దుష్ప్రభావాలూ లేకుండా ఫిస్టులా, పైల్స్, ఫిషర్ ఈ మూడు సమస్యలనూ సమూలంగా తొలగించే సామర్థ్యం హోమియోకి ఉంది. అందుకే నిర్లక్ష్యంగా ఉండకుండా కొన్ని లక్షణాలు కనిపించిన వెంటనే హోమియో డాక్టర్‌ను సంప్రదించడం ఎంతో శ్రేయస్కరం.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!