piercing tips: ముక్కు, క‌న్ను, నాభి ప్రాంతాల్లో రింగులు కుట్టించుకుంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి.

piercing tips పూర్వం ఆభ‌ర‌ణాలు పెట్టుకోవాలంటే చెవి, ముక్కు భాగాల్లో మాత్ర‌మే కుట్టించుకోవ‌డం జ‌రిగేది. కానీ ఇప్పుడు శ‌రీరంలోని చాలా చోట్ల రింగులు త‌గిలించేస్తున్నారు. సంప్ర‌దాయానికి పెద్ద పీట వేస్తూనే ఆధునికంగా క‌నిపించాల‌న్న త‌హ‌త‌హ న‌గ‌ర యువ‌తుల‌పై ఎక్క‌వై పోయింది. పియ‌ర్సింగ్ గా పిలిచే రింగుల‌ను పెట్టుకోవ‌డం ఇటీవ‌ల కాలంలో ఎక్కువుగా క‌నిపిస్తున్న ఫ్యాష‌న్‌. కాని నేటి ట్రెండ్ ఏంటంటే ముక్కు, క‌న్ను భాగం, నాలుక‌, నాభి ప్రాంతాల్లో రింగులు కుట్టించుకోవ‌డం చేస్తున్నారు. అందం మాటెలా న్నా కొన్నిసార్లు వీటి కార‌ణంగానే ఇన్ఫెక్ష‌న్లు వ‌చ్చి ప్రాణాంత‌కం అయ్యే ప్ర‌మాద‌ముంది. కాబ‌ట్టి కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఈ ఇన్ఫెక్ష‌న్ల భారి నుండి త‌ప్పించుకోవ‌చ్చు. అవేమిటో తెలుసుకుందాం.

పియ‌ర్సింగ్ (piercing tips)వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాలంటే?

-సున్నిత‌మైన శ‌రీర భాగాల్లో రక‌ర‌కాల లోహాల‌తో చేసిన ఈ రింగులు కుట్ట‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్లు(piercing infection) సోకి త‌రుచూ దుర‌ద పెట్ట‌డం, పుండుగా మార‌డం జ‌రుగుతుంది. అందుకే పియ‌ర్సింగ్ చేయించాక డెటాల్‌తో శుభ్రం చేసుకోవాలి. వాపు త‌గ్గేందుకు నియోస్పోరిన్ అనే యాంటీ బ‌యాటిక్ క్రీమ్ వాడాలి.

-నోట్లో కుట్టించుకున్న‌ప్పుడు ఇలాంటివి కుద‌ర‌దు పియర్సింగ్ చేయించుకున్న రెండు రోజుల్లో గాయం మానిపోవాలి. అలా జ‌ర‌గ‌క‌పోతే అనుభ‌వజ్ఞులైన డాక్ట‌ర్ల ద‌గ్గ‌ర చూపించుకోవాలి.

-అనుభ‌వం, నైపుణ్యం లేని వారి వ‌ద్ద పియ‌ర్సింగ్ కుట్టించుకోకూడ‌దు. ఇంకా స‌మ‌స్య‌లు ఎదురైతే సెలైన్ ద్రావ‌ణంతో శుభ్ర‌ప‌ర‌చాలి.

-ఒక మ‌గ్గు వేడినీళ్ల‌లో పావు వంతు ఉప్పు క‌లిపితే సెలైన్ ద్రావ‌ణం త‌యార‌వుతుంది. దీంతో ఆయా భాగాల‌ను శుభ్ర‌ప‌రిస్తే ఇన్‌ఫెక్ష‌న్ల భారి నుండి కాపాడుకోవ‌చ్చు.

-బంగారం కాకుండా ఇత‌రాత్ర పియ‌ర్సింగ్‌లు వాడితే కొంద‌రి చెవులు పుండ్లు పడ‌తాయి. ఇలాంటి వారు గాయ‌ల‌ను శుభ్ర‌ప‌రిచేందుకు వాడే హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌లో దూదిని ముంచి చెవి రెండు వైపులా శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఇలా రెండు సార్లు చేస్తే ఇన్ఫెక్ష‌న్లు రావు.

-నాలుక‌పై కుట్టించుకుంటే బ్యాక్టీరియాను నాశ‌నం చేసే నాన్ ఆల్క‌హాలిక్ మౌత్‌వాష్‌తో పుక్క‌లించిన త‌ర్వాతే ఆహారం తీసుకోవాలి. ఒక‌సారి పుండు పడితే పూర్తిగా న‌యం అయ్యే వ‌ర‌కు ఆభ‌ర‌ణాల‌ను పెట్ట‌కూడదు. స‌మతుల ఆహారం తీసుకుంటే గుల్ల‌లు, గాయాలు త్వ‌ర‌గా మాన‌తాయి.

-విట‌మిన్లు, మిన‌రల్స్ ఎక్కువుగా ల‌భించే ఆహార ప‌దార్థాలు తీసుకోవాలి. కారం, మ‌సాలాలు అధికంగా ద‌ట్టించే తినుబండారాలకు దూరండా ఉండాలి. కెఫిన్, ఆల్క‌హాలుకు దూరంగా ఉండాలి.

పియ‌ర్సింగ్ అనేది మ‌న భార‌త‌దేశంలో త‌క్కువుగానే ఉంటుంది. కానీ ప్ర‌స్తుతం పెరుగుతున్న ఆధునీక‌ర‌ణ కార‌ణంగా యువ‌త దీని మోజులో ప‌డుతున్నారు. పైన తెలిపిన విధంగా ప‌ద్ధ‌తులు పాటిస్తూ కుట్టించుకోవ‌డం చాలా ఉత్త‌మం.

Share link

Leave a Comment