Petrol Price|కోవిడ్ వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల: ధర్మేంద్ర ప్రధాన్
New Delhi: పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడతాయని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. గత కొద్ది రోజులుగా ఇంధనం ధరలు పెరుగుతూ పోతుండటంతో వినియోగదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో వినయోగదారుల ధరలు (పెట్రోల్, డీజిల్) కూడా పెరుగుతూ వస్తున్నాయని మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. కోవిడ్ కారణంగా గ్లోబల్ సరఫరా కూడా తగ్గిందని, ఆ ప్రభావం చమురు ఉత్పత్తిపై కూడా పడిందని చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని తాము జీఎస్టీ కౌన్సిల్ కు తరుచూ విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తెస్తే ప్రజలకు మేలు చేకూరుతుందని అన్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.
ఇది చదవండి:ఖాకీ మాటున మానవత్వాన్ని చూపిన ప్రతి పోలీసుకు సెల్యూట్: డీజీపీ
ఇది చదవండి:మళ్లీ పంజా విప్పుతోన్న కరోనా
ఇది చదవండి: ‘ఉద్దానం’పై ఏం ఆలోచిస్తున్నారు: హైకోర్టు