Petrol diesel prices today | ఇప్పటికే పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బండి బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు సామాన్య ప్రజలు. అయితే ఆయిల్ కంపెనీలు కొన ఊపిరిని కూడా తీసే బ్యాడ్ న్యూస్ చెబుతున్నాయి. ఈ మూడు నాలుగు నెలలో ఏ కారణం అయినప్పటికీ పెద్దగా మార్పు ఏమీ లేదు. అలా అని సంతోష పడే లోపే పిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో(Petrol diesel prices today) పెరగనున్నాయట.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలకు అంతకంతకు గరిష్ట స్థాయికి చేరడంతో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయనేది ప్రభుత్వం రంగ ఆయిల్ సంస్థలు చెబుతున్నాయి. దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలు సోమవారంతో ముగ్గుస్తున్నాయి. దీంతో తర్వాత రోజు నుండే పెట్రోల్, డీజిల్ ధరలు సవరిం చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.12 పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ధరల పెంపు దశల వారీగా ఉండాలని ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు సూచించినట్టుగా సమాచారం.
ధరల పెరుగుదలపై అనేక సాకులు, కారణాలు చెప్పుకొస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడుల వల్ల చమురు నిల్వల కొరత ఏర్పడటంతో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూపీ, పంజాబ్ వంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అంతర్జాతీయ ధరలకు అనుగుణగా ధరలు సవరించే వీలున్నప్పటికీ చమురు సంస్థలు ఆ పని చేయలేదు. మార్చి 7న చివరి విడత పోలింగ్, 10వ తేదీన ఫలితాలు వెలువడ నున్నాయి. ఆ తర్వాత ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ