Viral Video: Hyderabad: దేశంలో రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు (petrol, diesel price) అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్య జనంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కొంత మంది వాహన దారులు పెట్రోల్, డీజిల్ ధరలకు భయపడి సొంత వాహనాలను, అద్దెకు తిప్పుకునే వాహనాలను సైతం బయటకు తీయడం లేదు. రోజు వారీ ద్విచక్ర వాహనాలపై వెళ్లే ఉద్యోగులు, కార్మికులు సైతం బస్సులను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సోమవారం వరకు (హైదరాబాద్లో) పెట్రోల్ ధర రూ.97.79 వద్ద, డీజిల్ ధర రూ.88.86 వద్ద నిలిచిపోయాయి.
ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే కొనసాగుతుంది. పెట్రోల్ ధర రూ.97.38 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. డీజిల్ ధర రూ.90.90 పైసలు ఉంది. విజయవాడలోని పెట్రోల్ ధర రూ.96.95 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ధర 90.50 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర రూ.91. 17 వద్ద, డీజిల్ ధర రూ.81.47 వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో ధరలు చూస్తే పెట్రోల్ ధర రూ.97.57 , డీజిల్ ధర రూ.88.60 వద్ద నిలకడగా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.17 శాతం పెరుగుదలతో పాటు 69.33 డాలర్లకు పెరిగింది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 0.21 శాతం పెరుగుదలతో 65,74 డాలర్లకు చేరింది.
బంకుపై దాడి చేసిన అడవి పంది (wild pig Viral Video)
క్రింద చూసే వీడియో పాతదే అయినా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అనుసరిస్తూ ఆ వీడియోను నెటిజన్లు తయారు చేశారు. ఒక అడవి పంది(wild pig) పెట్రోల్ బంక్పైన, సిబ్బందిపైనా దాడి చేయడాన్ని చూపిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్లే అడవి జంతువులు సైతం దాడికి దిగుతున్నాయని నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ధరలు తగ్గించాలని జంతువులు కూడా దాడి చేస్తున్నాయని వినూత్నంగా వీడియోను సోషల్ మీడియా గ్రూప్ల్లో షేర్ చేస్తున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!