Pesara Pindi for skin | ఇప్పుడు చాలా మంది సమస్య ముఖంపై Tan లేదా నలుపు పేరుకుపోవడం. దీనికి ఇంట్లో దొరికే పెసరపిండితోనే పరిష్కారం ప్రయత్నించొచ్చు. ముఖంపై పేరుకున్న నలుపుదనం పోవాలంటే మూడు చెంచాల పెసరపిండి తీసుకోవాలి. దీనిలో అరకప్పు Gulabi నీరు, మూడు చెంచాల రోజ్ ఆయిల్, చెంచా పంచదార కలిపి పేస్టులా చేసుకోవాలి. అవసరాన్ని బట్టి కాస్త పాలు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.
పావు గంటయ్యాక నీళ్లతో చేతులు తడుపుకుంటూ మృదువుగా రుద్దాలి. ఇలా కనీసం వారంలో ఒకటి రెండు సార్లు చేస్తే మీ సమస్య దూరమవుతుంది. కొందరి ముఖం ఇట్టే జిడ్డు కారుతుంది. ఇలాంటి వారు పెసరపిండి, తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తుంటే సమస్య అదుపులోకి వస్తుంది. చర్మంపై నలుపుదనం క్రమంగా తగ్గుతుంది.
Pesara Pindi for skin: నాలుగు చెంచాల పెసరపిండి(Pesara Pindi) గుప్పెడు గులాబీ రేకులు, కొద్దిగా పాలు వేసి పేస్టులా చేసుకోవాలి. దీనికి కాస్త బాత్ సాల్ట్ చేర్చుకుని ఒంటికి రుద్దుకోవడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి, దుమ్ము, ధూలి మృతకణాలు తొలిగిపోతాయి. చర్మం నునుపుగా మారుతుంది. చర్మంపై నల్లని మచ్చలు సూర్య కాంతికి, కాలుష్యానికి రసాయనాలకు ఎక్కువగా బహిర్గతం అవడం వల్ల కలుగుతాయి. నిమ్మరసాన్ని పిండి, చిన్న కాటన్ బాల్ సహాయంతో నేరుగా నల్లటి వలయాలపై అద్దాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరుచూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.