Personal loan settlement: ఒక వ్యక్తి బ్యాక్ లోను నుండి సుమారు రూ.10,00,000 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతనుకు ఉన్న జాబ్ కొన్ని కారణాల వల్ల పోయింది. అతడు ప్రతి నెలా ఈ.ఎం.ఐ కట్టలేకపోతున్నాడు. అయితే అంతకుముందే ఒక రూ.5,00,000 లక్షలు కట్టాడు. ఇంకా రూ.5,00,000 లక్షలు బ్యాంకుకు అప్పు ఉన్నాడు.
ఇటు చూస్తే జాబ్ పోయింది… అటు చూస్తే బ్యాంకు నుండి తీసుకున్న లోను అప్పు పెరిగిపోతుంది. అతని వల్ల కావడం లేదు. చాలా మదన పడుతున్నాడు. ఇక చేసేది ఏమీ లేక బ్యాంక్ వద్దకు వెళ్లాడు ఆ వ్యక్తి. సార్.. నాకు కరోనా వల్ల జాబ్ పోయింది.


ఎటునుండి ఒక్క రూపాయి నాకు రావడం లేదు. నేను మీ దగ్గర తీసుకున్న అప్పు కట్టలేకపోతున్నాను. దయచేసి నేను ఈ పరిస్థితుల్లో మీకు రూ.5,00,000 లక్షలు కట్టలేను. ఎలాగోలా రూ.2,00,000 లక్షలు మాత్రం కడతాను. నా మనవి ఆలకించండి అంటూ బ్యాంకు అధికారి వద్ద మొర పెట్టుకున్నాడు.
లోకం పరిస్థితిని చూసిన ఆ బ్యాంకు అధికారి ఆ వ్యక్తి అభ్యర్థనను ఆలకించాడు. సరే .. నాయనా.. నువ్వు రూ.5,00,000 లక్షలు కట్టలేనంటువు కదా! మరీ రూ.2,00,000 లక్షలు కట్టు అని శుభవార్త చెప్పాడు. ఇది విన్న సదరు వ్యక్తికి ప్రాణం లేచి వచ్చింది. ఎలాగోలా ఈ లోన్ బాధ నుండి విముక్తి పొందాలని ఒకేసారి రూ.2,00,000 లక్షలు తీసుకొచ్చి లోన్ సెటిల్మెంట్ (Personal loan settlement)చేసుకున్నాడు.
అయితే ఇక నుండి అతనికి లోను ఉందని, డబ్బులు కట్టాలని అప్పటి నుండి ఎటువంటి ఫోన్లు, మెస్సేజ్‌లు రావడం బంద్ అయ్యాయి. ఇది ఎలా సాధ్యమైంది? అంటే మనము మన పరిస్థితిని బట్టి, బ్యాంకు నిబంధనలు బట్టి సెటిల్ మెంట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మొత్తంగా లోన్ మాఫీ చేయమంటే మాత్రం ప్రపంచంలో ఏ బ్యాంకూ సరే నాయనా! అని అనదు. ఎంతో కొంత మాత్రం వెసులు బాటు కలిగిస్తోంది.


అయితే ఆ వ్యక్తికి భవిష్యుత్తులో మాత్రం ఒక ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉంది. అది ఏమిటంటే అతని క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడం. సదరు బ్యాంకు ఏం చేస్తుందంటే పలానా వ్యక్తి మా వద్ద తీసుకున్న లోను తాలూకా మొత్తం డబ్బులు చెల్లించలేదు. కేవలం సెటిల్మెంట్ మాత్రమే చేశాడు. అని క్రెడిట్ వారికి రిపోర్టు చేస్తుంది.
ఎప్పుడైనా భవిష్యత్తులో ఇక బ్యాంకు నుండి లోన్ తీసుకోవాలంటే ఆ వ్యక్తికి 90 శాతం ఇవ్వరు. ఆ వ్యక్తి డేటాను పరిశీలించిన ఏ బ్యాంకు అయినా అతను పాత లోనే పూర్తిగా కట్టలేదు. అతనికి మన బ్యాంకు నుండి లోన్ ఇవ్వకూడదని ఖరాకండిగా సమాధానం చెబుతుంది.
మరో అవకాశం ఉంది ఇలా!


ఒక వేళ భవిష్యత్తులో మంచిగా సంపాదించి నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి. నేరుగా మీరు లోన్ తీసుకున్న బ్యాంక్ వద్ద గతంలో సెటిల్మెంట్ చేసుకున్నారుగా అక్కడికి వెళ్లండి. బ్యాంక్ అధికారులకు నేను మీ వద్ద సెటిల్మెంట్ చేసుకొని కొంత డబ్బు మాత్రమే కట్టాను. మిగిలిన డబ్బు ఇప్పుడు కడతాను. నా పై ఉన్న నెగిటివ్ రిపోర్ట్‌ను తొలగించండి అని అడగవచ్చు. అందుకు బ్యాంకు అధికారులు కూడా ఒప్పుకొని మీ లోను తాలూకా మిగిలిన బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించుకుంటారు. ఆ తర్వాత మీపై సిబిల్ స్కోర్‌లో ఉన్న రెడ్ మార్క్‌ను తొలగిస్తారు. ఆ తర్వాత మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. తర్వాత ఎక్కడైనా భవిష్యత్తులో లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?