perfect resume builder రెజ్యూమ్..అవకాశాల కల్పనలో ఇది తొలి కమ్యూనికేటర్. అర్హతలకూ, ప్రతిభకూ ఉన్న డిమాండే దీనికి వుంది. ఆయా సంస్థలు, కంపెనీలు అభ్యర్థుల రెజ్యూమ్‌ను బట్టి సానుకూలంగానో, ప్రతికూలం గానో స్పందిస్తుంటాయి. అంటే అది పూర్తి చేసిన తీరును చూసి, అభ్యర్థి వ్యక్తిత్వాన్నీ, ఆసక్తినీ పసిగట్టేస్తాయన్నమాట. కాబట్టి అదంత ముఖ్యం కాదన్న టేకిట్ ఈజీ ధోరణి తగదు. అది నింపే విధానం కూడా మీ దృక్పథానికి అద్దం పడుతుంది. రెజ్యూమ్‌ను కరిక్యులమ్ విటే (సివి) అని కూడా అంటారు. ఇది అభ్యర్థికి ఉన్న విద్యార్హతనూ, ఉద్యోగానుభవాన్నీ సమగ్రంగా తెలియజేసే ఒక బయోడేటా. కోరుకున్న అవకాశానికి ముందు ఇంటర్వ్యూ(interview) కోసం పెట్టుకునే దరఖాస్తు. కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.

ఉపాధి కల్పనలో, ఉద్యోగ అవకాశాల్లో చదువులూ నైపుణ్యాలే కాదు. రెజ్యూమ్(perfect resume builder) కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొందరు దీని విషయంలో పెద్దగా ఆసక్తి చూపరు. అది అంత ముఖ్యమైంది కాదన్న ఆలోచనవల్ల, దాని ప్రాధాన్యత తెలియక పోవడం వల్ల ఇలా చేస్తుంటారు. దానిని పూర్తి చేసే విషయంలో కూడా చివరి వరకూ వాయిదా వేస్తుంటారు. ఆఖరి నిమిషంలో హడావిడిగా పనికానిస్తారు. ఇంకొందరు తెలిసిందే కదా అన్న తేలిక భావంతో ఉంటారు. దాన్నొక సాధారణ ప్రక్రియగా పరిగణిస్తుంటారు. ఇలాంటి వారికి చివరికి నిరాశ ఎదురైనా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎందుకంటే రెజ్యూమ్ అనేది ఏ ఒక్కరో ఇవ్వరు కదా! ఒక్కో అవకాశానికి కొన్ని వేల సంఖ్యలో వచ్చిపడుతుంటాయి.
అవన్నీ చూడాలంటే ఇంటర్వ్యూయర్లకూ, నిర్వహకులకూ, రెజ్యూమ్ అబ్జర్వర్లకూ శ్రమతో కూడుకున్న పనే.ఇక్కడ సమయం. రెజ్యూమ్ కవర్ ఆకట్టుకునే తీరు కూడా ప్రముఖంగా ఉంటుంది. అలా ఉంటేనే ఎవరైనా ఆసక్తిగా చూస్తారు. ఏదో పిచ్చిగీతలు గీసినట్లుగానో, అర్థం కాని చేతిరాతతోనో ఉంటే చదవకుండా బుట్టదాఖలు చేసినా చేయొచ్చు. కనుక రెజ్యూమ్ విషయంలో ఉద్యోగార్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేలాది మందిలో తాము ప్రత్యేకంగా నిలవాలంటే చక్కటి రెజ్యూమ్ ఇవ్వాలి. కవరింగ్ లెటర్(covering letter) కూడా చూడగానే ఆకర్షించేలా ఉండాలి. కంటెంట్(covering letter)లో, ప్రజెంటేషన్(presentation)లో ప్రత్యేకత కనబర్చాలి.

చెప్పే తీరు…
మీ గురించి తెలియజేసే మొట్టమొదటి కమ్యూనికేషన్ రెజ్యూమే. ఇది వ్యక్తిగత అడ్వర్జయిజ్మెంట్ (advertisement)గా పనిచేస్తుంది కాబట్టి, ఆకర్షణీయంగా, సంక్షిప్త సమాచార యుక్తంగా రూపొందించాలి. ఇలా ఉంటేనే స్వీట్ అండ్ షార్ట్ అన్న విధంగా భాగా ఆకట్టుకుంటుంది. అసలే పోటీతత్వం నెలకొన్న పరిస్థితుల్లో ఇంటర్వ్యూకు పిలుపొచ్చే అతికొద్ది మంది జాబితాలో మీ పేరూ ఉండాలంటే రెజ్యూమ్‌లో వైవిధ్యం కనబర్చాలి. చెప్పే తీరు ఆసక్తిగా ఉండాలి. విషయం ఆకట్టుకోవాలి.
పాజిటివ్ అంశాలతో పాటు కొన్ని నెగిటివ్ అంశాలూ ఉండవచ్చు. నెగిటివ్ అంశాల్ని ప్రస్తావించకపోతే అబద్దాన్ని కప్పిపుచ్చడమే కదా అనుకోకండి. సందర్భంగా వచ్చినప్పుడు అవసరమైతే అవకాశం సొంతమైన తర్వాత చెప్పొచ్చు లేకపోతే స్వయంగా దానిని అధిగమించవచ్చు. మీ ఫోన్/ మొబైల్(phone/mobile) నెంబర్‌తో సహా అవసరమైన సమాచారాన్ని జత చేయాలి. వీలైనంత సంక్షిప్తంగా రెజ్యూమ్ ఉండేలా చూసుకోవాలి. సంక్షిప్తంలోనే సమాచారమంతా నిక్షిప్తమై ఉండేలా చూసుకోవాలి. సంక్షిప్తమై ఉండేలా చూసుకోవాలి. కోరుకున్న అవకాశం, అనుభవం, ప్రతిభ కనబర్చిన తీరు పేర్కొనాలి. వ్యాకరణ దోషాలు, అచ్చు తప్పులు లేకుండా చూసుకోవాలి. ఉద్యోగ ప్రకటన(job notification)కు స్పందించి మిమ్మల్ని సంప్రదించే సమయంగానీ, వెసులుబాటు గానీ యాజమాన్యానికి ఉండకపోవచ్చు. వేలాదిగా వచ్చిన కరిక్యూలమ్స్లల్లో మీద వాళ్ల దృష్టికి రావాలంటే ప్రత్యేకత ఉండేలా చూసుకోవాల్సిన మీపైనే ఉంటుంది.
అవసరమైన సమాచారం…
రెజ్యూమ్‌లో తప్పనిసరి చెప్పాల్సిన అంశాలూ కొన్నుంటాయి. అవి మీరు కోరుకున్న ఉద్యోగానికీ, అవకాశానికీ సంబంధించనవి అయి ఉండాలి. మిగతా విషయాలకు అంత ప్రాధాన్యత ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచకొని ఏది ప్రస్తావించాలో, ఏది కూడదో నిర్ణయించుకోవాలి. వ్యక్తిగత సమాచారం(పేరు, డేటాఫ్‌బర్త్(date of birth), వివాహితులు/కఆదు, తెలిసిన బాషలు, చిరునామా, ఫోన్‌నెంబర్) విద్యా నేపథ్యం (విద్యాభ్యాసం చేసిన సంస్థలు, సంవత్సరాలు, మార్కులు, అర్హతలు, ఇతర అచీవ్మెంట్లు, కంప్యూటర్ పరిజ్ఞానం-computer skills) తదితర విషయాలు చెప్పొచ్చు. ఏదైనా కోర్సు కోసం దరఖాస్తు చేస్తే దాని గురించిన అవగాహన, ఇంతకు ముందు చదివిన సంస్థ, మీ అనుభవం చెప్పొచ్చు.

ఉద్యోగం కోసం అయితే అనుభవం ఇంతకు ముందు పనిచేసిన సంస్థ నిర్వహించిన బాధ్యత, సాధించిన ప్రగతి, హాజరైన శిక్షణా కార్యక్రమాలు, పొందిన గుర్తింపు, చేసిన పార్ట్‌టైమ్ ఉద్యోగాలు(part time job) తదితర సమాచారం తెలియ జేయవచ్చు. కరిక్యులమ్(curriculum) నింపడంలో చాలా జాగ్రత్త అవసరం బయోడేటా అనే పదానికి కాలం చెల్లిపోయింది. కరిక్యులమ్ విటె(సివి)కి స్థానభ్రంశం కలిగించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని రెజ్యూమ్ పూర్తి చేయాలి. ఇంటర్వ్యూయర్‌కు రెజ్యూమ్(resume) చూడగానే ఏ లోటూ కనిపించకుండా జాగ్రత్త పడాలి. సంక్షిప్తంగానే కావాల్సిన విషయాలన్నింటినీ ప్రస్తావించండి.
ఆకట్టుకోవాలి…
రెజ్యూమ్ చూడగానే ఆకట్టుకోవాలి. అంటే చక్కటి ప్రజెంటేషన్ ఉండాలి. కవరింగ్ లెటర్ కూడా బాగుండాలి. అలాగని కళ్లు చెదిరే డిజైన్ల కవర్లు వాడకండి. రెజ్యూమ్ కవర్ కూడా లైట్ ప్లేన్ కలర్ కలిగి ఆఫీషియల్‌గా ఉండాలి. అక్షర దోషాలు లేకుండా చూసుకోవలి. నాణ్యమైన పేపర్ వాడాలి. వైటనింగ్ ప్లూయిడ్తోనో, చేతిరాతతోనో, సరిచేసిన అక్షర దోషాలతోనో పంపకూడదు. తగిన విధంగా మార్జిన్లు(margin) ఉండేలా చూసుకోవాలి. జిరాక్స్ కాపీలకు బదులు లేజర్ ప్రింటన్లే(laser printer) పంపాలి.
విద్యార్హతల విషయంలో…
విజువల్ రిలీఫ్ కోసం, కొన్ని అంశాలను ప్రముఖంగా చూపడం కోసం క్యాపిటల్ లెటర్లు, ఇటాలిక్స్, బోల్డ్టైప్, అండర్ లైనింగ్, ఫాంట్ సైజులు మార్చడం చేయవచ్చు. వీటిలో వేటికైనా సంయుక్తంగా ఉపయోగించవచ్చు. ఫ్యాన్సీటైప్ ఫాంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి. దీనివల్ల మీ రెజ్యూమ్ స్పష్టత కోల్పోతుంది. రెజ్యూమ్‌లో గ్యాప్(gape)లు వదల కూడదు. మీ విద్యార్హతలకు సంబంధించి ఉదాహరణకు ఇంటర్మీడియట్‌కు, డిగ్రీకి మధ్య గానీ, డిగ్రీ పూర్తయిన తర్వాత రెండు మూడేళ్లు విరామం గానీ వచ్చిందనుకోండి. ఎందుకొచ్చిందో వివరించండి. మొత్తానికి మీ రెజ్యూమ్ ప్రజెంటేషన్‌లో జాగ్రత్త పాటించాలి.

ఏదైనా అడగవచ్చు…
కోరుకున్న అవకాశమే దక్కాలంటే వీలైనన్ని ఎక్కువ సంస్థల్లో ఇంటర్వ్యూను ఎదుర్కోవడానికి సిద్ధపడక తప్పదు. అయితే ఎక్కడికెళ్లినా రెజ్యూమ్ ప్రాధాన్యతను మర్చిపోకూడదు. కేవలం ఇంటర్య్యూయరే చిన్న చిన్న ప్రశ్నలు అడిగే రోజులు ఎప్పుడో వెళ్లిపోయాయి. నేడు మీతో పాటు పనిచేసే ఉద్యోగులతోనే ఇంటర్య్యూ ఎదుర్కోవాలి.ఒక ఇంటర్వ్యూ యర్ మీకో పేపర్ షీటు ఇచ్చి, ఆ ఉద్యోగం మీకే ఎందుకివ్వాలో కారణాలు రాయాలని అడగవచ్చు. లేకపోతే మీ గురించి మిమ్మల్నే రాయాలని అడగవచ్చు. ఇతర దరఖాస్తు దారులతో కలిసి ఒక సమస్య పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలని కోరవచ్చు.
ఫార్మాట్ ఏదైనా కావచ్చు. టీమ్ ఇంటర్వ్యూలు(team interview) చాలెంజింగ్‌గా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంటర్వ్యూ టీమ్‌తో చేసుకునే పరిచయ వాక్యాలు చాలా క్లిష్టతరమైనవేగాక, నిర్ణయాత్మకమైనవి కూడా. కాబట్టి ఈ సందర్భంలో సమయ స్పూర్తిగా వ్యవహరించగలిగితేనే ఫలితం ఉంటుంది. ఏదేమైనా నేడు అవకాశాల కల్పనలో రెజ్యూమ్ పాత్ర కీలకంగా ఉంటోంది. దానిని బట్టే ఆయా సంస్థలు వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నాయి. కాబట్టి దానిని ప్రజెంట్ చేయడంలో తగిన జాగ్రత్తలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి