Interest Rates : అధిక వడ్డీతో మోసం..ఎస్పీని ఆశ్రయించిన బాధితులు!
Interest Rates : అనంతపురం : సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలా ఉన్న ఆశ అత్యాశకు దారితీయడంతో ఇప్పుడు లబోదిబో మనే పరిస్థితి తలెత్తింది. ఎక్కడైనా రూ.లక్షకు రూ.30 వేలు వడ్డీ ఇవ్వడం చూశారా? కానీ ఆ అతి ఆశే వారిని లక్షలు, కోట్లు కట్టించేలా చేసింది. చివరకు కట్టించుకున్న వ్యక్తులు పత్తా లేకుండా పోయారు. దీంతో మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన మోసం ఇది.
రూ.లక్ష కు రూ.30 వేలు వడ్డీ(Interest Rates) నెలకు ఇస్తానని కొందరు వ్యక్తులు నమ్మబలికారు. నమ్మకం కుదిరే వరకు కొందరికి వడ్డీ(Interest Rates)గా రూ.30 వేలు నెలకు ఇచ్చాడు. ఇది చూసిన కొందరు అత్యాశకు పోయి అప్పులు చేసి మరీ రూ.లక్షలు, కోట్ల రూపాయలు ఆ వ్యక్తుల వద్ద పెట్టుబడి పెట్టారు. సుమారు రూ.300 కోట్లకు పైగా డిపాజిట్లు స్వీకరించిన సదరు వ్యక్తులు కనిపించకుండా పోయారు.
సుమారు 100 మందికి పైగా బాధితులు బుధవారం ధర్మవరం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. 50 మంది బాధితులతో ఎస్పీ సత్య ఏసుబాబు మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అయితే నగరంలోని ఓ కానిస్టేబుల్, మరో ఎస్సై కూడా ఏజెంట్లు తరహాలో ఉండి నగదు కట్టించుకున్నట్టు సమాచారం.


ఈబీఐడీడీ ఫైనాన్స్ సర్వీసు పేరుతో లావాదేవీలు సాగించారు. చెల్లించిన సొమ్ముకు కొందరికీ రశీదులు ఇచ్చారు. ఈ సంస్థ మేనేజర్‌గా కడియాల సునీల్ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన సహాయకు లుగా మహేంద్రచౌదరి, సుధాకర్, మాధవి వ్యవహరించారు. వీరి కింద 100 మంది ఏజెంట్లు కూడా పనిచేస్తున్నట్టు బాధితులు పేర్కొన్నారు.
పెద్ద మొత్తాలు చెల్లించిన తర్వాత ఏజెంట్లకు ఫోనులు పనిచేయలేదు. ఇలా రెండు, మూడు నెలలుగా వడ్డీలు చెల్లించలేదు. అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వసంతపురానికి చెందిన బాబుల్ రెడ్డి ఫిర్యాదు మేరకు ధర్మవరం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక వడ్డీల పేరుతో జరిగిన మోసం వెలుగులోకి రావడంతో మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court