Penuganchiprolu Tirunala 2022 | ఏపీలో కృష్ణా జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన్న తిరునాళ్లు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 5.59 ని.లకు అఖండ జ్యోతి స్థాపన జరిగింది. మార్చి 19వ తేదీన శనివారం సాయత్రం 6.06 ని.లకు అనిగండ్లపాడు నుండి కొల్లవారి పుట్టింటి పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పిస్తారు. మార్చి 20వ తేదీన ఆదివారం సాయంత్రం 6.16 గంటలకు రథోత్సవ కార్యక్రమం(Penuganchiprolu Tirunala 2022) ఉంటుంది.
మార్చి 21వ తేదీన సోమవారం రాత్రి 8.45 ని.లకు దివ్య ప్రభోత్సవము, మార్చి 22వ తేదీన మంగళవారం ఉదయం 5.30 ని.లకు భక్తుల బోనాల సమర్పణ కార్యక్రమం జరుగును. ఆలయ ఛైర్మన్ చెన్నకేశ్వరరావు, ఈవో శోభారాణి ప్రత్యేక పూజలతో అఖండ దీపాన్ని వెలిగించారు. తిరునాళ్ల ను అధికారికంగా ప్రారంభించారు. ఏడాదికి ఒక సారి అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వస్తున్నారు.

దేవాలయం వద్ద వసతి, తాగునీరు, పారిశుధ్యం వంటి సౌకర్యాలు ప్రత్యేకంగా కల్పించారు. భక్తుల రవాణా కోసం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ఆధ్వర్యంలో 200 బస్సులు ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరునాళ్ల (Penuganchiprolu)తొలిరోజు భక్తులు వేలాదిగా ఆలయానికి తరలి వచ్చి తిరుపతమ్మకు బోనాలు సమర్పించారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!