Penugranchiprolu | కొద్ది రోజుల కిందట APలో తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి మర్మాంగాలను బ్లేడుతో కోసి కూతురు ఘటన మరువక ముందే తాజాగా NTR జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో అదే తరహా ఘటన వెలుగు చూసింది. Penugranchiprolu మండల కేంద్రంలో గత రాత్రి సమయంలో అక్రమ సంబంధం నేపథ్యంలో తన తల్లి కోసం ఇంటికి వచ్చిన వ్యక్తిపై కుమారుడు కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసు వారికి సమాచారం అందించారు.
కత్తిపోట్లకు గురైన వ్యక్తిని 108 అంబులెన్స్‌లో Jaggayyapeta ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సుమారు 20 కత్తి గాట్లు నేపథ్యంలో అక్కడ నుండి విజయవాడ ఆసుపత్రికి తరలించారు. కత్తితో దాడి చేసిన వ్యక్తి అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Nandigamaలో మృతదేహం కలకలం!


NTR జిల్లాలోని నందిగామ పట్టణంలో పాత బైపాస్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయం వెనుక ఖాళీ స్థలంలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి పట్టణంలో యాదవ్ బజార్‌కు చెందిన మేకపోతుల శివ కుమార్‌గా సమాచారం. హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. రాత్రి 9 గంటల సమయంలో ఎవరో ఫోన్ చేస్తే శివకుమార్ బయటకు వెళ్లారని బంధువులు పేర్కొన్నారు. ఆ తర్వాత నుండి ఫోన్ స్విచాఫ్ అయినట్టుగా తెలుస్తోంది. బండరాళ్ళతో, మద్యం సీసాలతో పొడిచినట్టుగా ఆనవాళ్లు గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలాన్ని ఏసిపి నాగేశ్వరరెడ్డి పరిశీలించారు.