municipal commissioner:నూతన కమిషనర్ కు అభినందనలు-ఎఐటియుసి మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర సమితి

Spread the love

municipal commissioner ఫీర్జాదిగూడ: ‘ఇంకెంత కాలం కాలయాపన చేస్తారు.. కార్మికులకు జీతాలు పెంచకుండా..’ మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు పెంచి చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఫీర్జాదిగూడ కార్పొరేషన్ కి కొద్ది రోజులక్రితం నూతనంగా భాద్యతలు చేపట్టిన కమీషనర్ డా.రామకృష్ణారావు కు శాలువా కప్పి పూల మొక్క అందజేసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా మేయర్ జక్కా వెంకటరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి అనంతరం మందా వెంకటేశ్వర్లు, ఎఐటియుసి మున్సిపల్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముడి మార్టిన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జి.వో.అమలు విషయంలో జాప్యం చేయడం సమంజసం(municipal commissioner) కాదన్నారు.

వెంటనే కార్మికులకు జి.వో ప్రకారం జీతాలు కేటగిరీల వారిగా పెంచి జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కార్పొరేషన్ నందు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాల్లోంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా పి.ఎఫ్. ఇయస్.ఐ కార్మికుల వాట సోమ్ము మినహాయింపులు జరుగుతున్నాయి కానీ కార్మికులకు ఇయస్.ఐ కార్డులు అందజేయడం పోవడంతో రోగాల బారినపడిన కార్మిక కుటుంబాలు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం పొందాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే కార్మికులకు ఇయస్.ఐ కార్డులు అందించాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన క్యాజువల్ లీవులు కార్మికులకు వర్తించే దు సంవత్సరానికి 12సెవవులతో పాటు అదనంగా 3 సెలవులు మొత్తం 15 సెలవులు కార్మికులకు వర్తింపజేయాలని కార్మికులు కోరిన రోజు సెలవు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు బిక్షపతి,బాలు, రుకేష్,లక్ష్మమ్మ,జి.పాపాపమ్మ, ఆర్.ఎల్లమ్మ,కంసమ్మ, సావిత్రి,శ్రావణి, మమతా,శివమ్మ తదితరులు పాల్గొన్నారు.

Provident Fund : పుట్టిన తేదీకి కార్మికుల PF కు లింక్ పెడ‌తారా?

Provident Fund : పుట్టిన తేదీకి కార్మికుల PF కు లింక్ పెడ‌తారా? ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు : మున్సిప‌ల్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి Read more

AITUC Trade Union : రూ.10 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

అవ‌స‌రం తీరాక కార్మికుల‌ను తొల‌గిస్తారా?అక్ర‌మంగా తొల‌గించిన వారిని విధుల్లోకి తీసుకోవాలిరాష్ట్ర అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు యేసుర‌త్నం, మందా వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్ AITUC Trade Union : Hyderabad: మున్సిప‌ల్ Read more

TRS Plenary Meeting: ప‌ద‌వులు రాగానే గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు

TRS Plenary Meeting: హైద‌రాబాద్ : 'ఇవాళ కొంత మంది ఎగిరెగిరి ప‌డుతున‌నారు.. టి- కాంగ్రెస్‌, టి- బిజెపి..కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు ప‌ద‌వులు వ‌చ్చాయంటే Read more

Sama Venkat Reddy: టిఆర్ఎస్‌కు ఝ‌ల‌క్‌..కాంగ్రెస్‌లోకి సామ వెంక‌ట‌రెడ్డి?

Sama Venkat Reddy: ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర క‌నీస వేత‌నాల స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ సామ వెంక‌ట‌రెడ్డి, స‌హా మండ‌లి కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులంద‌రూ టిఆర్ఎస్‌కు ఝ‌ల‌క్ Read more

Leave a Comment

Your email address will not be published.