Peda Purugu అంటే వినడానికి, ఆలోచించడానికి కాస్త వెగటుగా ఉన్నా, దాని ఫవర్ తెలిస్తే అవునా?, నిజమా? అంటారు. పేడ పురుగు గురించి తెలుసుకోవడానికి అంతగా ఆసక్తి ఎవరికీ ఉండదు. కానీ పేడను ఉండలుగా చేసుకొని తీసుకెళ్లే సందర్భం గురించి కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.
ఈ లోకంలో ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. అదే క్రమంలో Peda Purugu కూడాను. పేడ పురుగు అనగానే ముక్కు చిట్లించుకునే మనం ప్రకృతిలో దానికి ఒక విలువ ఉందండోయ్. పేడ పురుగులను నిజంగా మనిషి మెచ్చుకోవాలి. మనిషికి ఆ పురుగులు చేస్తున్న సహాయం అంతా ఇంతా కాదు. ప్రకృతిలో ఎన్నో జీవరాశులు మనిషి మనుగడకు పరితపిస్తుంటాయి తప్ప. మనిషి వాటి మనుగడను మాత్రం లేకుండా చేయాలనే చూస్తుంటాడు. మట్టిలో ఉండే పేడ పురుగులు మనిషికి సహాయం చేసే జీవులుగా చెప్పవచ్చు.
Peda Purugu: పేడను ఏం చేస్తుంది?
అందమైన ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, మట్టి పరిమళ సువాసన ఇవి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కానీ నేటి కాలంలో ప్రకృతి వికృతిగా మారింది. పచ్చదనం పలచబడుతోంది. మనిషి జీవిత కాలం తగ్గిపోతుంది. ఇలా ఇంకా చాలా చెప్పవచ్చు కానీ, పేడ పురుగు స్టోరీ ప్రక్కకు పోయే అవకాశం ఉంది. ఈ పేడ పురుగులను ఇంగ్లీష్‌లో Dung Beetle అని అంటారు. ప్రకృతిలో ఇవి నశించినట్టయితే ఇక మట్టి ఆరోగ్యం కూడా నశించి నట్టే. ప్రస్తుతం ఆధునిక కాలంలో రసాయనాలు వాడకం బాగా పెరిగింది. ఇవి భూమిలోకి పోయి కలుషితం చేస్తున్నాయి. దీనివల్ల మొట్టమొదటిగా చనిపోయే పురుగులు ఇవే. ఇంకా వానపాములు, ఇతర పురుగులు కూడా నశించిపోతాయి. అలా నశిస్తే ముందుకు మనకే నష్టం.
పేడ పురుగులు Scarabaeidae కుటుంబానికి చెందినవి. ఈ Peda Purugu లను పురాతనంలో ఉన్న ఈజిప్ట్ ప్రజలు గౌరవంతో, భయంతో ఆరాధించేవారు. అది పేడ ఉండని ముద్దగా దొర్లిస్తుందిగా, అయితే దానిని ఈజిప్ట్ ప్రజలు మాత్రం సూర్యుడు భూమిని దొర్లించుకుంటూ పోవడంలా ఊహించుకుంటారు. Scarab తలతో Khepri అనే దేవుడుని వీరు పూజించేవారు. కాబట్టి ఆ కథను గుర్తొచ్చే విధంగా అప్పటి శాస్త్ర నిపుణులు జంతు శాస్త్ర తరగతికి Scarab అనే పేరు పెట్టారు. ఆ పురుగులకు ఆ పేడతో ఏం పని అనేది మన అసలైన ప్రశ్న. దాని గురించి తెలుసుకుందాం!.
ఈ Peda Purugu లు మూడు రకాలు ఉన్నాయి అందులో
1.దొర్లించే రకం
2.తవ్వే రకం
3.పేడలో నివాసం ఉండే రకం
దొర్లించే రకం (rollers) పురుగులు పేడను సేకరిస్తుంటాయి. అక్కడ నుండి వాటికి అనుకూలమైన ప్రదేశానికి తీసుకువెళుతుంటాయి. ఆ పేడలో ఉన్న ద్రవరూప వృక్ష సంబంధ పోషకాలని ఆరగిస్తుంటాయి. ఈ పేడ ఉండలలోనే గుడ్లను పెడుతుంటాయి. అందులో ఏర్పడ్డ లార్వాలను ఘన రూపంలో మార్చి ఆహారంగా ఆరగిస్తుంటాయి. కాబట్టి ఆహారం, సంతానోత్పత్తి ఇలా రెండు విధాలుగా ఈ పేడ ఉండలను వాడుకుంటాయి.
ఇక బొరియలు తవ్వే రకం (tunnelers) రెండోవి. ఈ Peda Purugu లు పేడ ఉన్న చోట భూమిలోకి రంధ్రాలు తవ్వుతాయి. ఈ పేడను చిన్నగా అందులోకి లాక్కెళ్లత్తాయి. సంతానోత్పత్తికి, ఆహారం కోసం వాడుకుంటాయి. ఇలా చేయడం వల్ల ఈ భూమి గుల్ల భారడంతో పాటు మొక్కలకు కావాల్సిన పేడ ఎరువుగా అందటం, పేడలో జీర్ణం కాకుండి మిగిలిన విత్తనాలు భూమి మీద పడి విత్తన వ్యాప్తి జరగటం ఈ పేడ పురుగుల వల్లే జరుగుతుంది. ఇక మూడో రకం పేడ పురుగులు (dwellers) పేడలోనివాసం ఉంటాయి. పేడ కుప్పల్లోనే నివాసం ఉండి అందులోనే పిల్లలని కని పెంచుతాయి.

ఈ Peda Purugu లు ఎక్కువుగా ఆవు, గేదె, ఏనుగు, జింకలు వ్యర్థాల మీద ఆధార పడి జీవిస్తుంటాయి. పేడలో పెట్టే కొన్ని ఈగలు, దోమలు గుడ్లను, లార్వాలను ధ్వంసం చేయడంలో ఈ పేడ పురుగులు పాత్రపోషిస్తుంటాయి. అదే విధంగా పేడను ఎరువును చేయడంలో వీటి పాత్ర అధికం. భూమిని సారవంతం చేయడానికి భూమిలోకి నీరు, గాలి పోయేందుకు రంధ్రాలు చేస్తాయి. విత్తన అభివృద్ధికి కావాల్సిన ఎరువులు అందేందుకు భూమికి తోడుగా నిలుస్తుంది ఈ పేడ పురుగు. ఇప్పుడు చెప్పండి పేడ పురుగు నిజంగా గ్రేట్ అని!.