Peas: పచ్చి బఠాణీల రుచే వేరు. వెజ్ బిర్యానీ, ప్రైడ్ రైస్, గ్రేవీలు ఏవైనా చేసినప్పుడు అవి తప్పక ఉండి తీరాల్సిందే. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు బఠాణీల సొంతం. వీటిలో న్యూట్రియంట్లూ, విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా లభిస్తాయి.
బీన్స్‌తో పోలిస్తే కెలొరీలు చాలా స్వల్పం. వంద గ్రాముల బఠాణీ (Peas) ల్లో కేవలం 81 కెలోరీలు ఉంటాయి. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తరుచూ తింటే మంచిది. ఫోలిక్ యాసిడ్, బీకాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉండే వీటిని గర్భిణులూ, బాలింతలూ తింటే మంచిది. వీటిల్లో లభించే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది.
పచ్చి బఠాణీ (Green Peas) లు రోగ నిరోధక శక్తి పెరిగి తినడం వల్ల ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. బఠాణీల్లో లభించే Vitamin K గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టడానికి దోహదం చేస్తుంది. ఎముకల సాంద్రతను పెంచుతుంది. మతి మరపు సమస్యను దూరం చేస్తుంది.
వీటిలో లభించే ఫ్లవనాయిడ్లూ, విటమిన్ ఎ కంటికి మేలు చేస్తాయి. దృష్టి లోపాలు రాకుండా కాపాడతాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. అందుకే వీటిని తరుచూ ఆహారంలో తీసుకోవడం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు. చిన్నారులు వీటిని తినడానికి ఇష్టపడకపోతే, వాటితో రకరకాల చిరుతిళ్లు చేసి తినిపించొచ్చు.
Peas: ఊపిరితిత్తుల ఉబ్బరం అంటే ఏమిటి?
40 ఏళ్లు దాటిన కొందరికి ఆయాసం వస్తుంది. దానికి పల్మనరీ ఎంఫిసిమా లేక ఊపిరిత్తుల ఉబ్బరం కారణం కావచ్చు. ఊపిరితిత్తు (Lungs) లలో గాలి ఎక్కువనిండి ఈ ఉబ్బరం ఏర్పడుతుంది. మనం లోపలికి గాలిపీల్చినప్పుడెల్లా ఊపిరి తిత్తులలోని చిన్న చిన్నతిత్తులలో గాలి నిండుతుంది. ఈ గాలి త్వరగా బయటికి రాదు. కొంచెం ప్రయాస అవసరం.


ఇంకొక విధంగా చెప్పాలంటే లోనికి పీల్చటం తేలిక, బయటికి వదలడం కష్టం. ఎంఫిసిమా ఉన్నవారికి తెల్లవార్లు, కొంచెం దగ్గు, కఫం, పిల్లి కూతలు, అలసట, బరువు తగ్గటం, మడమలు వాయిడం,ఈ బాధలు ఉండొచ్చు. డాక్టర్లు రొమ్ముని పరీక్షించి X-ray లు తీసి రోగనిర్ణయం చేస్తారు.
దానికి చికిత్స ఏమీ అంటూ పెద్దగా ఉండదు. మెల్లగా నడవడం, నెమ్మదిగా మాట్లాడటం. ఎక్కువ సార్లు తక్కువ తినటం మంచిది. ధూమపానం, పొగ, దుమ్ము ఉన్న చోట్ల ఉండటం ఈ పరిస్థితిని తీవ్ర చేస్తాయి.