PDSU Khammam ఖమ్మం: సంవత్సర కాలంగా వందలాది మంది రైతుల బలిదానాలు, కుటుంబాలను వదిలిపెట్టి రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దుకు అకుంఠితదీక్షతో దేశవ్యాప్తంగా రైతులను, ప్రజలను, ప్రజా సంఘాలను, పార్టీలను ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వం నడ్డి విరిచిన రైతు ఉద్యమానికి జేజేలు అని పిడిఎస్ యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యం వి వెంకటేష్ అన్నారు. శనివారం పిడిఎస్యు ఆధ్వర్యంలో మహిళా కాలేజీ నుండి రైతు ఉద్యమ వీరులకు నివాళులు అర్పిస్తూ, విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం (PDSU Khammam)జరిగింది.


మోడీ ప్రభుత్వం రైతుల నడ్డివిరిచే విధంగా తీసుకువచ్చిన కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అవిశ్రాంతంగా ఉద్యమం చేయడం చారిత్రాత్మక ఉద్యమంగా మారిం దన్నారు. రైతు ఉద్యమ ప్రేరణతో ఇంకా అనేక ఉద్యమాలు వస్తాయన్నారు. విద్యార్థులు సైతం మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యార్థి వ్యతిరేక నూతన విద్యా విధానం 2021ను వ్యతిరేకంగా ఉద్యమిస్తా మన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమాలకు సన్నద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు మస్తాన్, డివిజన్ అధ్యక్షురాలు నవ్య, డివిజన్ నాయకులు గణేష్, సాయి, ఉష ,ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!