pay premium

pay premium: బీమా ప్రీమియం ముందే చెల్లించ వ‌చ్చా? పాల‌సీదారులు తెలుసుకోవాల్సిన అంశం!

Spread the love

pay premium బీమా పాల‌సీ ఏదైనా స‌రే స‌కాలంలో ప్రీమియం చెల్లించాలి. ముందు చెల్లించినా ఇబ్బంది ఉండ‌దు. కానీ, చాలా మంది గ‌డువు తేదీ దాకా ప్రీమియం చెల్లించేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ముందు చెల్లించ‌డం అన‌వ‌స‌రం. దీని వ‌ల్ల ఏ ప్ర‌యోజ‌న‌మూ ఉండ‌దు అనే భావ‌న ఇందుకు కార‌ణం. అయితే చివ‌రి నిమిషం వ‌ర‌కూ వేచి చూడ‌కుండా బీమా ప్రీమియాన్ని కాస్త ముందే చెల్లిస్తే కొన్ని ప్ర‌యోజ‌నాలూ (pay premium)ఉన్నాయి.

ఈ రోజు చేతిలో డ‌బ్బు ఉండొచ్చు.. ఏదైనా అత్య‌వ‌స‌రం వ‌చ్చి దాన్ని వాడేసుకుంటే తీరా బీమా ప్రీమియం చెల్లించే నాటికి ఆ మొత్తం అందుబాటులో లేక‌పోతే, పాల‌సీ ర‌ద‌య్యే ప్ర‌మాదం ఉంది. అందుకే, పాల‌సీకి సంబంధించిన ప్రీమియాన్ని ముందుగానే చెల్లించ‌డం కొన్ని సంద‌ర్భాల్లో మేలే చేస్తుంది. ఇలా ముందుగానే బీమా చెల్లించాలు కుంటున్న పాల‌సీ దారుల‌కు లాభం చేకూర్చేందుకు బీమా నియంత్ర‌ణ‌, అభివృద్ధి ప్రాధికార సంస్త‌(ఐఆర్‌డీఏఐ) సైతం కొన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. ముందుగానే ప్రీమియం చెల్లించిన వారికి కొంత రాయితీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించాల‌ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించింది. దీని వ‌ల్ల పాల‌సీదారుల‌కు ప్రీమియంలో రాయితీ ల‌భించ‌డంతో పాటు, పాల‌సీ ర‌ద్దు కాకుండా చూసుకునేందుకు ఉప‌యోప‌డుతుంది. ఇప్ప‌టికే కొన్ని బీమా సంస్థ‌లు ఈ విష‌యాన్ని అమ‌లు చేస్తున్నాయి. ముందుగానే పున‌రుద్ధ‌ర‌ణ ప్రీమియం చెల్లించిన పాల‌సీదారుల‌కు డిస్కౌంటుల‌ను అందిస్తున్నాయి.

అడ్డంకులు లేకుండా..

గ‌డువు తేదీకి ముందుగానే పున‌రుద్ధ‌ర‌ణ ప్రీమియం చెల్లించ‌డం వ‌ల్ల పాల‌సీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన‌సాగుతుంది. స‌మ‌యానికి డ‌బ్బు లేక‌పోతే, పాల‌సీ ర‌ద్దువుతుంద‌నే ఆందోళ‌న ఉండ‌దు. పాల‌సీ ప్రీమియాన్ని ఏడాదిలో ఎప్పుడైనా చెల్లించ‌డం ద్వారా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఇలా ముందుగానే ప్రీమియం చెల్లించిన‌ప్పుడు బీమా సంస్థ‌లు అందించే రాయితీ వ‌ల్ల భారం త‌గ్గుతుంది.

ర‌క్ష‌ణ కొన‌సాగేలా..

జీవిత బీమా ఒక దీర్ఘ‌కాలిక ఒప్పందం. పాల‌సీ వ్య‌వ‌ధి మొత్తం ప్రీమియం చెల్లించిన‌ప్పుడే దీని ప్ర‌యోజ‌నాలు పూర్తిగా అందుతాయి. ముంద‌స్తు ప్రీమియం చెల్లింపు వ‌ల్ల పాల‌సీదారులు త‌మ బ‌డ్జెట్‌ను అందుకు అనుగుణంగా సిద్ధం చేసుకునేందుకు వీల‌వుతుంది. ఏదైనా అనుకోని ఆదాయం, బోన‌స్‌లాంటివి వ‌చ్చిన‌ప్పుడు ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల సాధ‌న‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. పాల‌సీదారులు ముంద‌స్తు ప్రీమియం చెల్లింపును ప‌న్ను మిన‌హాయింపు కోస‌మూ క్లెయిం చేసుకోవ‌చ్చు. అయితే, ఆర్థిక సంవ‌త్స‌రంలో సెక్ష‌న్ 80సీ ప‌రిమితికి లోబ‌డి ఇది ఉంటుంద‌న్న‌ది గుర్తుంచుకోవాలి.

bima policy: బీమా పాల‌సీ తీసుకుంటున్నారా? ముందుగా ఇవి తెలుసుకోండి!

bima policy: జీవిత బీమా అనేది ఈ రోజుల్లో త‌ప్ప‌నిస‌రిగా మారిపోయింది. బీమా ర‌క్ష‌ణ ఉండ‌టం వ‌ల్ల మీ ఉనికి లేని సంద‌ర్భంలో మీపై ఆధార‌ప‌డిన కుటుంబ Read more

Best car Insurance: Which Insurance is best for Cars?

Which Insurance is best for Cars: Car Insurance helps you get mitigate financial obligations that may arise due to an Read more

National Savings Monthly Income Account(MIS): పోస్ట్ ఆఫీసు మంత్లీ ఇన్‌కం స్కీం గురించి తెలుసుకోండి!

National Savings Monthly Income Account(MIS): చేతిలో డ‌బ్బు ఉందా? దానిని ఎక్క‌డైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాల‌నుకుంటున్నారా? అయితే ద‌గ్గ‌ర‌లో ఉన్న మీ గ్రామంలోనో, మీ మండ‌లంలోనూ పోస్టు Read more

LIC of India : ఎల్ఐసీ కొత్త రికార్డు – కోట్ల‌కుపైగా ప్రీమియం రాబ‌డి

LIC of India : ఎల్ఐసీ కొత్త రికార్డు - కోట్ల‌కుపైగా ప్రీమియం రాబ‌డి Mumbai: ప్ర‌భుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ Read more

Leave a Comment

Your email address will not be published.