Pawan Kalyan janasena హైదరాబాద్: కుటుంబ సభ్యులను కించపరచటం తగదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయని పవన్ తెలిపారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఇవేమీ పట్టనట్టు ఉన్నారని పవన్ విమర్శించారు. పైగా ఆమోదయోగ్యం కాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం (Pawan Kalyan janasena)దురదృష్టకరమన్నారు.
తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం బాధాకరమని పవన్ కళ్యాన్ అన్నారు. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉందన్నారు. ఈ మధ్యకాలంలో సభలు సమావేశాలు, చివరికి టివి చర్చలలో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోందని పవన్ మండిపడ్డారు.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?