Vasthavai Mandal

Vasthavai Mandal : అభిమాని కోరిక తీర్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ | Lingala Village

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన జ‌న‌సైనికులు

Vasthavai Mandal : ‘ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూడాలి. త‌న చిర‌కాల కోరిక‌గా మిగిలి ఉంది.’ అని ఓ అభిమాని తెల‌ప‌డంతో స్పందించిన జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా వ‌చ్చి ఆ అభిమాని చిర‌కాల కోరిక‌ను నెర‌వేర్చారు. కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం వ‌త్స‌వాయి మండ‌లం లింగాల గ్రామంలో ప‌సుపుల భార్గ‌వ్ అనే 19 ఏళ్ల కుర్రాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అభిమాని. ఇటీవ‌ల భార్గ‌వ్ బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాడు. ఎలాగైనా తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూడాల‌ని త‌న చిర‌కాల కోరిక అని తెలియ‌జేశాడు. విష‌యం తెలుసుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్గ‌వ్ కోరిక‌ను నెర‌వేర్చారు. లింగాల గ్రామంలో ఉంటున్న భార్గ‌వ్ ఇంటికి వెళ్లి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా క‌లిశారు. భార్గ‌వ్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. వెండి వినాయ‌క స్వామి వారి విగ్ర‌హాన్ని బ‌హుమ‌తిగా ఇచ్చారు. అదే విధంగా జ‌న‌సేన పార్టీ త‌ర‌పున రూ.5 ల‌క్ష‌లు మ‌రియు జ‌న‌సేన ఎన్ఆర్ఐ టీం త‌ర‌పున చికిత్స కోసం ప్ర‌త్యేక వైద్యుల‌ను కేటాయిస్తామ‌ని తెలిపారు. జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌సేన పార్టీ త‌రుపున రూ.30 వేలు భార్గ‌వ్ కుటుంబానికి అందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో కూడా కొంత మంది అభిమానుల‌ను స్వ‌యంగా వెళ్లి క‌లిసి వారిలో ఆత్మ‌స్థైర్యాన్ని నింపారు. అందులో ముఖ్యంగా ఖ‌మ్మంకు చెందిన ఓ అమ్మాయి కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూడాల‌ని కోర‌డంతో స్వ‌యంగా అప్ప‌ట్లో ఆ పాప‌ను ప‌ల‌క‌రించేందుకు ఖ‌మ్మంలో ఓ ఆస్ప‌త్రికి వెళ్లారు. ప్ర‌స్తుతం ఆ పాప కోలుకున్న‌ది కూడా!.

లింగాల గ్రామంలో భార్గ‌వ ను ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

భారీగా త‌ర‌లివ‌చ్చిన అభిమానులు, జ‌న‌సైనికులు!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గ్గ‌య్య‌పేట ప్రాంతానికి వ‌స్తున్నాడ‌ని విష‌యం తెలుసుకున్న అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటు ఆంధ్రా రాష్ట్రం నుంచి వేలాదిగా త‌ర‌లివ‌చ్చారు. విజ‌య‌వాడ నుంచి కారులో త‌మ అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ వ‌స్తున్నాడ‌నే విష‌యం తెలుసుకొని చిల్ల‌క‌ల్లు ఫ్లైఓవ‌ర్ వ‌ద్ద భారీ ఎత్తున ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సిఎం ప‌వ‌న్‌..సిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల నినాదాల‌తో చిల్ల‌క‌ల్లు బ్రిడ్జి మారుమ్రోగింది. పెద్ద ఎత్తున అభిమానులు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లిరావ‌డంతో వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. చిల్ల‌క‌ల్లు పోలీసు స్టేష‌న్ ఎస్ఐ వాసం వెంక‌టేశ్వ‌ర్లు ఆధ్వ‌ర్యంలో సిబ్బంది ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాహ‌నాల‌ను లింగాల గ్రామానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.

భార్గ‌వ ఆరోగ్యం గురించి డాక్ట‌ర్ల‌తో మాట్లాడుతున్న‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *