Pav Bhaji Recipe : హాయ్ నోరూరూంచే పావ్ భాజీని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేయడం నేర్చుకోండి. ఇది తయారు చేయడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లోనే వడ్డిండి మీ కుటుంబ సభ్యులకు తినిపించవచ్చు.
Pav Bhaji Recipe : కావాల్సిన పదార్థాలు
బంగాల దుంపలు – 3 (మీడియం సైజువి)
బటర్ – 2 టీ స్పూన్లు
క్యాప్సికమ్ – ఒక కప్పు
ఫ్రోజన్ బఠానీ – ఒక పావు కప్పు
టమాటా – అర కప్పు
కారం – టీ స్పూన్
సాల్ట్ – రుచికి తగినంత
పావ్ బాజీ మసాలా – ఒక టీ స్పూను
పసుపు – పావు టీ స్పూను
కొత్తిమీర – తగినంత
పచ్చిమిర్చి – ఒక రెండు
ఉల్లిగడ్డ – ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీస్పూను
ధనియాల పొడి – అర టీ స్పూను
గరం మసాలా – అర టీ స్పూను
పాప్ భాజీని తయారు చేయు విధానం
ముందుగా పాప్ భాజీని తయారు చేయడానికి బంగాళ దుంపలను ఉడికించాలి. ఉడికించే ముందు ఆ బంగాళ దుంపలను రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను వేడిచేసే పాత్ర (కుక్కర్) లో ఒక అరకప్పు వరకు నీళ్లను పోయాలి. ఇప్పుడు ఆ కుక్కర్‌ను మూడు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకబెట్టాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్‌ను దించి ఒక ప్లేట్‌లోకి ఉడికిన బంగాళ దుంపలను తీసుకోవాలి.
తర్వాత బంగాళ దుంపలపైన ఉన్న పొట్టును తీసి మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టౌవ్ ఆన్ చేసి ఒక డిష్‌లోని బటర్ ను వేయాలి. అది కరిగిన తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలను వేయాలి. అందులోనే పావు కప్పు ఫ్రోజన్ బఠానీ గింజలను వేయాలి. ఇలా వీటిని స్టౌవ్‌పైన రెండు, మూడు నిమిషాలు ఎక్కువ మంటపైన ఉడకనిస్తూ ఉండాలి. ఇలా రెండు నిమిషాలు తర్వాత ఫ్రై అయినంక అందులో సన్నగా తరిగిన అరకప్పు టమాటా ముక్కలను వేయాలి.
తర్వాత వాటిన్నంటిని కలిపి స్టౌవ్ పైన ఒక 4-5 నిమిషాలు మీడియం హీట్‌లో ఉడికించాలి. ఇలా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో ముక్కలను తిప్పుతుండాలి. 5 నిమిషాల తర్వాత అది చక్కగా ఉడికిపోతుంది. అలా ఉడికిన దానిని Masher (ఒత్తే గంటె) తో మెల్లగా ఒత్తాలి. ఒక వేళ మీ దగ్గర Masher లేకపోతే మీ ఇంటిలో స్టీల్ బాక్సుతోనైనా ఒత్తితే సరిపోతుంది. ఒక వేళ ఇలా చేసేటప్పుడు అది సరిగా ఉడకలేదని మీకు అనిపిస్తే మళ్లీ స్టౌవ్ మీద 2 నిమిషాలు ఉడకబెట్టవచ్చు. ఆ తర్వాత గుజ్జుగా వచ్చేందుకు ఒత్తాలి.
అలా గుజ్జుగా ఒత్తిన తర్వాత దానిలోని ఉడికించి గుజ్జుగా చేసిన బంగాళ దుంపలను కలపాలి. అదే సమయంలో ఒక టీస్పూన్ కారం, కాస్త ఉప్పు వేయాలి. అందులోనే పాప్ బాజీ మసాలా ఒక టీస్పూను వేయాలి. ఒక వేళ మీ దగ్గర ఈ పావ్ బాజీ మసాలా లేకపోతే మీ దగ్గర ఉన్న ఒక టీ స్పూను ధనియాల పొడిని, వేయించిన జీలకర్ర పొడిని టీస్పూను వేయాలి. అందులోనే పావు టీస్పూను పసుపు, తగినంత కొత్తిమీర వేయాలి.
ఇలా వీటన్నింటిని బాగా కలిపాక మళ్లీ మాషర్ తో (లేదా స్టీల్ బాక్సు) గుజ్జుగా ఒత్తాలి. పావ్ జాజీ స్టైల్ (Pav Bhaji Recipe) లో రావాలంటే ఇలా కొద్దిసేపు మెత్తగా ఒత్తుతుండాలి. ఇలా చేస్తున్నప్పుడు స్టౌవ్ మీద మంటను తక్కువలో పెట్టి ఒత్తుతుండాలి. అలా చేస్తున్నప్పుడు మీకు ఒక వేళ గట్టిగా అనిపిస్తే కొంచెం నీరును వేసి కూడా ఒత్త వచ్చు. అలా పూర్తిగా అయిన తర్వాత దానిని పక్కన పెట్టాలి.
ఇప్పుడు మళ్లీ స్టౌ వెలిగించి ఒక డిష్‌లో బటర్‌ను 2 టేబుల్ స్పూన్లు వేయాలి. బటర్ అంతా కరిగిపోయిన తర్వాత అందులో పచ్చి మిర్చి ముక్కలు సన్నగా తరిగి దానిలో వేయాలి. అందులోనే ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి. అలా ఫ్రై అవుతుండగా అందులో అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. అందులోనే మరలా అరటీ స్పూను కారం , తగినంత ఉప్పు వేసి కలపాలి. అలాగే అర టీ స్పూను ధనియాల పొడిని, అర టీ స్పూను గరం మసాలా పౌడర్‌ను వేయాలి. ఒక టేబుల్ స్పూను కొత్తిమీర ఆకులను వేసి తక్కువ మంట మీద ఉడికించాలి.
ఇలా బాగా కలిపిన తర్వాత అందులోకి ఇంతకు ముందు చేసిన గుజ్జును అందులో వేయాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా ఉడుకుతుండగానే అందులోకి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మిక్స్ చేస్తుండాలి. మరీ నీరు ఎక్కువగానూ పోయకూడదు. కాస్త జిగురుగా వచ్చే కర్రీలాగా చేసుకోవడానికి మాత్రమే నీరు పోయాలి.
ఇందులోకి మీకు ఇష్టమైతే అదనంగా రెడ్ ఫుడ్ కలర్‌ను ఒక అర టీ స్పూను వేసుకోవచ్చు. తర్వాత మొత్తంగా కలిపి వేడి చేస్తూ ఉండాలి. చివరగా అందులో కొద్దిగా కొత్తిమీర, రెండు టీ స్పూను నిమ్మరసం వేసి స్టౌవ్ ఆఫ్ చేయాలి. కొద్ది నిమిషాల తర్వాత పావ్ బాజీ (Pav Bhaji Recipe) కర్రీ వేడివేడిగా రెడీ అవుతుంది.