patanjali coconut oil: మనం తలకు కొబ్బరి నూనె రాయడం పూర్వ కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. తలకు మాత్రమే కాకుండా కూరల్లో వాడుకోవడం కేరళ సాంప్రదాయం. కొబ్బరి నూనె వల్ల ఉపయోగాలు తప్ప నష్టాలు ఏమీ ఉండవు. కాకపోతే కాస్త జిడ్డుగా ఉంటుందని నిరుత్సాహం కనబడుతుంది. తల వెంట్రుకలకు కొబ్బరి నూనెకు మించిన ఆయిల్ మరేదీ ఉండదేమో. ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువ అయి కొబ్బరి నూనె బదులు హెయిర్ జెల్, ఇతర కెమికల్ ఆయిల్స్ వచ్చాయి. వాటి వాసనకు, రంగుకు మంత్రముగ్ధులమై వాటిని వాడుతున్నాం.
patanjali coconut oil: పతంజలి కొబ్బరి నూనె
నిజానికి కొబ్బరి నూనె తప్ప మరేది వెంట్రులకు వాడినా దాని ప్రభావం రానున్న రోజుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు కొబ్బరి నూనెను వివిధ రకాలుగా పలు కంపెనీలు తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బాబా రామ్‌దేవ్ కంపెనీ Patanjali నుండి మార్కెట్‌లో లభ్యమవుతున్న పతంజలి కొబ్బరి నూనె గురించి వివరాలు తెలుసుకుందాం.
ఈ patanjali coconut oil 100 % శాతం స్వచ్ఛమైన మంచి కొబ్బరి నూనె అని పతంజలి కంపెనీ పేర్కొంటొంది. ఈ ఆయిల్ ను ఎండిన కొబ్బరి కాయల నుండి తయారు చేయబడిందట. దీనిని పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేశారని అంటున్నారు.ఇందులో చర్మానికి గానీ, వెంట్రుకలకు గానీ హాని తలపెట్టే రసాయనాలను , సువాసనల రంగులను కలపలేదని పతంజలి కంపెనీ పేర్కొంటుంది. ఈ కొబ్బరి నూనె FSSAI వారిచే నాణ్యమైనదిగా, భద్రత కలిగినదిగా ఆమోదించబడిందట.
ఈ పతంజలి కొబ్బరి నూనె వాడటం వల్ల పొడి చర్మం మృదువుగా మారుతుందట. స్కిన్ చాలా సాఫ్ట్‌గా ఉంటుందట. ఇది వంటకు కూడా ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతుంది. అదే విధంగా జుట్టు బలంగా ఉండేందుకు మంచి పోషణను అందిస్తుంట. జుట్టు నల్లగా నిగనిగలాడటానికి, మరియు పెరుగుదలకు దోహదపడుతుంట.
ఈ patanjali coconut oil ఆయిల్‌ను వంట కోసం ఉపయోగించవచ్చట. మరియు తడి, పొడి జుట్టుకు Scalp Treatment కోసం కూడా ఈ నూనెను వాడి మసాజ్ చేస్తే చాలా హాయిగా ఉంటుందట. అదే విధంగా పగిలిన చర్మంకు తేమ ఉంచేందుకు, పొడి చర్మం మృదువుగా మారేందుకు కూడా ఈ నూనెను వేసి రుద్ద వచ్చని పతంజలి చెబుతుంది.
ఈ పతంజలి కొబ్బరి నూనె ఆ కంపెనీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి 200 ఎంఎల్ క్వానిటీపై రూ.85 ధర ఉన్నది కేవలం రూ.80 లకు మాత్రమే అందజేయడం జరుగుతుంది. ఒక వేళ మీరు ఈ నూనెను కొనుగోలుపై రూ.1000 వరకు ఉంటే ఫ్రీగా డెలివరీ చేస్తారంట. ఈ ఆయిల్ కాల వ్యవధి వచ్చి సుమారు 15 నెలల వరకు నిల్వ వుంటుందని తయారీ దారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ పతంజలి కొబ్బరి నూనెపై సదరు కంపెనీ వెబ్‌సైట్‌లో ఎలాంటి రివ్యూలు, రేటింగ్‌లు లేవు. కావున మీరు పతంజలి ప్రొడక్ట్స్ అమ్మే అమ్మకం దారుల వద్ద దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఈ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయగలరు.