Parliament meetings 2022 ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమయ్యింది. కరోనా మూడో దశ సాగుతున్న సమయంలో సభ ఎలా నిర్వహంచాలని సందిగ్ధం నెలకొనగా గతంలో మాదిరిగానే పార్లమెంట్ నిర్వహించాలని నిర్ణయించారు. లోక్‌సభ, రాజ్యసభ రెండు వేర్వేరు సమయాల్లో నడిపేందుకు సిద్ధం అవుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్ధేశించి రాష్ట్రపతి ప్రసంగం జనవరి 31వ తేదీన ఉంటుందని వెల్లడించింది కేంద్ర(Parliament meetings 2022) ప్రభుత్వం.
ఫిబ్రవరి 1వ తేదీ నుండి లోక్‌సభ, రాజ్యసభ రోజుకు 5 గంటల పాటు, వేర్వేరు సమయాల్లో నడుస్తాయి. కోవిడ్ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు నుంచి 11వ తేదీ వరకూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సభ నడుస్తుంది. రాజ్యసభ సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. ఇక మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 8 వరకూ రెండో దశ సేష్టన్లను నిర్వహించనున్నారు.
కరోనా కారణంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను ఉభయ సభలు వేర్వేరు సమయాల్లో నిర్వహించాయి. అయితే థర్డ్ వేవ్‌తో పార్లమెంట్ సమావేశాల సమయం కుదించారు. పార్లమెంట్ పనివేళలపై బులిటెన్ విడుదల చేసింది లోకసభ సచివాలయం. జనవరి 31వ తేదీ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 11 గంటలకు 2022-23 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులు, భౌతిక దూరం పాటించేలా రాజ్యసభ, లోక్‌సభ సెంట్రల్ హాల్లలో సీట్లు ఏర్పాటు చేశారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!