Papaya Fruit | ఆకర్షణీయమైన రంగుతో నోరూరించే బొప్పాయి పండులో పోషకాలు మోతాదు ఎక్కువే. బొప్పాయిలో ఉండే పాపైన్ ఎంజైమ్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ పండులో అధికంగా లభించే పీచు, నీటి శాతం మలబద్ధకాన్ని నివారిస్తాయి. దీనిలో లభించే యాంటీ ఆక్సిండెంట్ Zeaxanthin హానికారక కిరణాల నుంచి కంటిని కాపాడుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరో పోషకం విటమిన్ ఎ సీబమ్ ఉత్పత్తిలో కీలకంగా ఉపయోగపడుతుంది. జట్టును తేమగా ఉంచుతుంది. Beta-carotene పుష్కలంగా లభించే బొప్పాయిని తరుచూ తీసుకోవడం వల్ల Asthma ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
మహిళలకు పచ్చి boppaya ఉపయోగాలు!
పండిన Papaya కంటే పచ్చి బొప్పాయితోనే పోషకాలుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బొప్పాయిలోని పోషకాలు, ఎంజైములు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ప్రతి 100 గ్రాముల పచ్చి బొప్పాయిలో 39 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. దీన్ని తినడం ద్వారా కొవ్వు చేరే అవకాశం లేదు. రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్టు చూడటం ద్వారా రక్తపోటు స్థాయిని బొప్పాయి సరైన స్థితిలో ఉంచుతుంది. Green Papayaలో విటమిన్ సి, విటమిన్ ఈ, Vitamin A ఉంటాయి. దీన్ని సలాడ్ల రూపంలోనూ Juiceగానూ తీసుకోవచ్చు.
బొప్పాయి ఆకులను చింతపండు, ఉప్పుతో కలిపి తీసుకుంటే మహిళల్లో బహిష్టు కారక నొప్పులు తగ్గుముఖం పడతాయి. సౌందర్యంలోనూ బొప్పాయి సూపర్‌గా పనిచేస్తుంది. ముఖంపై Acne, మచ్చలతో పాటు పలు రకాల చర్మ వ్యాధులను నయం చేసే శక్తి పచ్చి బొప్పాయికి(Papaya Fruit) ఉంది. పచ్చి బొప్పాయితో Amoebiasin, నులి పురుగుల బెడద తప్పుతుంది. తద్వారా అజీర్ణం, పుల్లని తేన్పులు వంటి బాధలు నెమ్మదిస్తాయిని Health నిపుణులు అంటున్నారు.


Papaya Fruit | BP తగ్గించే బొప్పాయి
మనుసులో ఏదో ఆందోళన. ఎందుకని? బహుశా రక్త ప్రసరణ లోపాల వల్ల కావొచ్చు. అలాంటప్పుడు ఈ సమస్యను చక్కదిద్దే పొటాషియం అధికంగా ఉండే బొప్పాయి తిని చూడండి. మనసుకీ, శరీరానికి కూడా హాయిగా ఉంటుంది. కంటి చూపు తగ్గుతోంది అన్న ఆలోచన వచ్చినప్పుడు తరచూ బొప్పాయి తింటే ఫలితం ఉంటుంది. చూపు మెరుగుపడుతుంది. చెవిలో వచ్చే Infectionsను తగ్గించడానికి, దగ్గూ జలుబూ రాకుండా ఉండటానికి కూడా బొప్పాయి భలేగా మేలు చేస్తుంది. తక్కువ కెలోరీలు, ఎక్కువ పీచు పోషకాలూ ఉండే బొప్పాయిని తినడం వల్ల జీర్ణశక్తి బాగుంటుంది. మలబద్ధకం సమస్య బారినపడం. శరీరానికి తగినంత శక్తి అందుతూ, బరువు తగ్గాలి అనుకునే వారికి బొప్పాయి పండు చక్కని ఆహారం.

