Papaya farmer vs RTC

Papaya farmer vs RTC: బొబ్బాయి పండు ఇవ్వ‌నందుకు బ‌స్సు ఆప‌ని డ్రైవ‌ర్..త‌ర్వాత రైతు ఏం చేశాడంటే?

Viral News

Papaya farmer vs RTC క‌ర్నూలు: క‌ష్ట‌ప‌డి దేశానికి అన్నంపెట్టే రైత‌న్న‌ల‌పైనే అంద‌రూ అజ‌మాయిషీ చెలాయించేది. రైత‌న్న‌లు ఈ ఏడాది అస‌లు పంట‌లు పండించ‌కోకూడ‌దూ అనుకొని పెద్ద ఉద్య‌మంగా దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న తెలిపి పంట‌లు వేయ‌క‌పోతే మ‌న ప‌రిస్థితి ఏమిటి? త‌లుచుకుంటేనే భ‌యంగా ఉంది. అన్నం లేనిది, ఆహారం లేనిది ఏ జీవీ బ‌త‌క‌లేదు. అలా క‌ష్ట‌ప‌డుతున్న రైతున్న‌ల‌కు క‌నీసం గిట్టుబాటు ధ‌ర కూడా ఇవ్వ‌లేక‌పోతున్నాం. ప్ర‌భుత్వ తీరు రోజురోజుకూ రైతుల‌పై క‌ప‌ట ప్రేమ‌ను కుమ్మ‌రిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ఆఖ‌రికి రైతుల‌ను బ‌స్సులు ఎక్కించుకోవ‌డానికి ఇబ్బందులకు గురిచేస్తున్న ప‌రిస్థితి వెలుగులోకి ఒక‌టి(Papaya farmer vs RTC) వ‌చ్చింది.

బొబ్బాయి పండు ఇవ్వ‌లేదుగా..అయితే నువ్వు బ‌స్ ఎక్క‌వ‌ద్దు..అంటూ రైతును బ‌స్ ఎక్క‌నివ్వ‌కుండా చేసిన సంఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..క‌ర్నూలు జిల్లాలోని పెద్ద కొత్త‌ప‌ల్లి మండ‌లం మారేడు మాన్ దిన్నె గ్రామం న‌ల్ల‌మల్ల అడ‌వి స‌మీపంలో ఉన్న ఒక మారుమూల గ్రామం. అయితే ఈ గ్రామానికి చెందిన గోప‌య్య అనే రైతు త‌న వ్య‌వ‌సాయ పొలంలో బ‌ప్పాయి పండ్ల‌ను పండిస్తారు. అలా పండించిన బొబ్బాయి పండ్ల‌ను ప్ర‌తిరోజూ కొల్లాపూర్ పట్ట‌ణానికి బ‌స్సులో తీసుకువెళ్లి అమ్ముకుని జీవనం కొన‌సాగిస్తున్నారు.

ఇలా రోజువారీలో భాగంగా శుక్ర‌వారం కూడా బొప్పాయి పండ్ల‌ను ఆర్టిసీ బ‌స్స్‌లో తీసుకెళ్లేందుకు రోడ్డుపై పెట్ట‌కున్నాడు రైతు. కానీ ఆర్‌టీసీ డ్రైవ‌ర్కు ఉచితంగా పండ్లు ఇవ్వ‌లేద‌నే కోపాన్ని మ‌న‌సులో పెట్టుకుని బ‌స్సును ఆప‌లేదు. దీంతో ఆవేద‌నకు గురైన స‌ద‌రు గోప‌య్య అనే రైతు బ‌స్సు కొల్లాపూర్ నుండి తిరిగి గ్రామానికి వ‌చ్చే స‌మ‌యంలో కాపుకాచాడు. రోడ్డుపై అడ్డ‌గంగా బొప్పాయి పండ్ల‌తో గంట పాటు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అస‌లే గ్రామానికి ర‌వాణా సౌక‌ర్యం కోసం కేవ‌లం ఒక బ‌స్సు మాత్ర‌మే ఉంది. అదీ కూడా ఆ డ్రైవ‌ర్ ఎక్కించుకోక‌పోవ‌డంతో తాను ఈ రోజు పండ్ల‌ను కొల్లాపూర్ తీసుకెళ్ల‌లేక‌పోయాన‌ని రైతు ఆవేద‌న‌కు గురయ్యాడు.

ఆర్టీసీ సంస్థ‌పై త‌న‌కు ఎంతో ప్రేమ‌, అభిమానం ఉన్నాయ‌ని, కానీ ఇలాంటి ఆర్టీసీ డ్రైవ‌ర్ల వ‌ల్ల సంస్థ‌కు చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని ఆర్టీసీ ఉన్న‌తాధికారులు స్పందించి డ్రైవ‌ర్‌పై చ్య‌లు తీసుకోవాల‌ని రైతు గోప‌య్య విన‌యంగా కోరారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *