Core Web Vitals Assessment: Papad making: అప్ప‌డాలు త‌యారు చేయు విధానం కావాల్సిన ప‌దార్థాలు

Papad making: అప్ప‌డాలు త‌యారు చేయు విధానం కావాల్సిన ప‌దార్థాలు ఇవే!

Papad making అప్ప‌డాలు అంటే ఇష్టం లేనివారు ఉండ‌రేమో! అదీ ప‌ప్పుతో భోజ‌నం అయితే మాత్రం క‌చ్చితంగా అప్ప‌డం ప‌క్క‌న ఉండాల్సిందే. అప్ప‌డం సాంప్ర‌దాయ‌క భోజ‌నంలో ఒక స్పెష‌ల్ గుర్తింపు పొందింది. పెళ్లిళ్లో, ఫంక్ష‌న్ల‌లో అప్ప‌డాల శ‌బ్ధం వినిపిస్తూనే ఉంటుంది క‌దా!. అయితే ఇప్పుడు అప్ప‌డాల‌ను ఇంటిలోనే మ‌నం ఎలా త‌యారు చేసుకోవాలో (Papad making)తెలుసుకుందాం!.

కావాల్సిన ప‌దార్థాలు: బియ్యం – 1 గ్లాసు, ఉప్పు – త‌గినంత , జీల‌క‌ర్ర‌- 2 చెంచాలు, ప‌చ్చిమిర్చి -12, ఎండుకొబ్బ‌రి పొడి -1/2 క‌ప్పు.

త‌యారు చేయువిధానం: బియ్యం క‌డిగి నీళ్ళు పోసి గంట‌సేపు నాన‌బెట్టాలి. ఈ బియ్యం మిక్సీలో వేసి మ‌ళ్ళీ రుబ్బుకొని దోశ‌ల పిండిలా చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో స‌గం వ‌ర‌కు నీళ్లు పోసి స్టౌవ్ మీద పెట్టి నీరు మ‌ర‌గించాలి. దీనిమీద ఒక ప్లేటు పెట్టి దానిపై రుబ్బుకున్న పిండితో త‌గిన మందంలో చిన్న చిన్న అట్లు పోసుకోవాలి. ఆవిరికి అప్ప‌డాలు ఉడికి పైకి లేస్తాయి. వాటిని ఎండ‌లో ఆర‌బెట్టుకోవాలి. క‌ర‌క‌ర‌లాడేలా ఎండిన త‌ర్వాత నిలువ చేసుకోవాలి.

ఉప్మార‌వ్వ అప్ప‌డాలు

కావాల్సిన ప‌దార్థాలు: ఉప్మార‌వ్వ – పావుకిలో, ఉప్పు – త‌గినంత‌, నువ్వులు – చెంచాడు, వాము- చెంచాడు

త‌యారు చేయు విధానం: ముందుగా ఉప్మా ర‌వ్వ‌ను ఒక గ్లాసుతో కొలిచి పెట్టుకోవాలి. ఒక గ్లాసు ఉప్మాకు ఎనిమిది గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ల‌ను ఒక గిన్నెలో తీసుకొని బాగా మ‌సిలేదాకా వేడిచేసి, దాంట్లో త‌గినంత ఉప్పు, నువ్వులు, వాము వేసి త‌ర్వాత ఉప్మార‌వ్వ‌ను వేస్తూ ముద్ద‌లు అవ‌కుండా క‌లుపుతూ ఉండాలి. ఆ పిండిని గ‌రిటెతో తీసుకొని క‌వ‌ర్‌పై స‌న్న‌గా, గుండ్రంగా ఒక్కొక్క‌టిగా వేయాలి. అలా ఒక‌రోజు ఎండ‌లో ఉంచాక క‌వ‌ర్‌పై తీస్తే స‌రి. వేయించ‌డానికి సిద్ధంగా ఉన్న అప్ప‌డాలు త‌యార్‌!

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *