Pandagoww Uncle | హే! బాయ్స్ How are You అంటూ యూట్యూబ్‌లో పండగో అంకుల్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పుట్టపర్తి ప్రాంతానికి చెందిన Puttaparthi Arrow Naresh అనే వ్యక్తి వీడియోలు చూస్తే నవ్వు ఆగదు. అంతకన్నా ఇంగ్లీష్ అంటే భయం కూడా పోతుంది. అంత భాగా వచ్చీ రాని ఇంగ్లీష్ ను తెలుగు లో మిక్సింగ్ చేసి అతనికి ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీసి పెడుతుంటాడు. ఇప్పుడు ఆ వీడియోలు చాలా వైరల్(Pandagoww Uncle) అయ్యాయి.
పండగో అంకుల్ చేస్తున్న వీడియోలను ప్రజలు తెగ చూసేస్తున్నారు. అతన్ని చూస్తే చాలా సాధారణ మాములు వ్యక్తిలా కనిపిస్తారు. కానీ అతనికి ఉన్న టాలెంట్‌ను ఇప్పుడు వీడియో రూపంలో యూట్యూబ్‌లో పెడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ వద్ద కామెంట్రీ చెబితూ అక్కడ ఉన్నవారందర్నీ నవ్విస్తుంటాడు. రియల్‌గా కామెంట్రీ చెప్పే వారు ఎలా చెబుతారో అచ్చుగుద్ది నట్టు అలానే కామెంట్రీ చెబుతున్నారు. చేపలు పట్టినప్పుడు దాని గురించి, డ్యూటీకి వెళ్లినప్పుడు రోడ్డు మీద ఏం జరుగుతుంది. ఇంటిలో ఉన్నప్పుడు ఏం కూర వండుకున్నారో, ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు కబుర్లు ఇలా ప్రతిదీ సెల్ఫీ వీడియో ద్వారా తెలుగు ఇంగ్లీష్ మిక్సింగ్ చేసి మాట్లాడుతున్నాడు.
పండగో అంకుల్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు ట్రోలింగ్ కూడా అవుతున్నాయి. పండగో అనే పదం ఇప్పుడు ట్రెడింగ్ అవుతుంది. పండగో అని యూట్యూబ్‌లో కొట్టగానే అతని వీడియోలు అన్నీ వస్తున్నాయి. అతని మాట్లాడే విధానం అందరికీ నచ్చడంతో ఇప్పుడు తెలుగులో పాపులర్ అవుతున్నారు. తెలుగు ఇంగ్లీష్ స్లాగ్ కలిపి మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు. మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రాకపోయినా కవర్ చేస్తున్నాడు. మీరు ఊడా ఈ వీడియోలు చూడాలంటే ఒక లుక్ వేయండి.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ