Panchayat Election Phase -2 Polling in Inumella Village: ఇనిమెళ్ల గ్రామంలో ఉద్రిక్తత!
Guntur: గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుడు స్వగ్రామమైన ఇనిమెళ్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇనిమెళ్ల గ్రామంలో వైసీపీ వర్గీయులు ఒకరికి బదులు మరొకరు ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలతో ఎస్సీ కాలనీ బూత్ నెంబర్ 7 వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. టిడిపి ఓటర్ల నుండి వైసీపీ ఏజెంట్లు స్లిప్పులు లాక్కొని దౌర్జన్యంగా ఓటు వేస్తున్నారని ఆరోపిస్తూ అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు నెట్టుకుంటూ పోలింగ్ బూత్ వద్ద వాదనకు దిగారు. తమ వద్ద నుండి వైసీపీ ఏజెంట్లు స్లిప్పులు లాక్కున్నారని టిడిపి కి చెందిన కొందరు ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనతో ఇనిమెళ్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇది చదవండి:ఎస్సైలనే బెదిరించిన కిలాడీ లేడి..చివరకు!
ఇది చదవండి:కొత్త పార్టీపై షర్మిల బిజీ! ఖమ్మం నేతలపై ఫోకస్!
ఇది చదవండి: ఆ చేప మహా డేంజర్! తగిలితే అంతే సంగతులు!
ఇది చదవండి: అన్నపై ఎంత అభిమానమో!
ఇది చదవండి: family health optima insurance plan: తెలుగులో తెలుసుకోండి!
ఇది చదవండి:అటవీ శాఖకు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జరిమానా!