Panasakaya Biryani: హాయ్! మరో అద్భుతమైన వంటతో ముందుకు వచ్చాం. అదేమిటంటే నోరూరించే పనసకాయ బిర్యానీ. ఇప్పటి వరకు బిర్యానీలో కొన్ని వందల రకాల ఐటమ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు పరిచయం చేయబోతున్న పనసకాయ బిర్యానీ (Panasakaya Biryani) వినడానికి కొంత వింతగా ఉంది. కానీ తయారీ చేయడం మాత్రం చాలా సులభం. మీరు కూడా కింద తెలిపిన విధంగా చూసి నేర్చుకొని ఎంచక్కా మీ ఇంటిలో కుటుంబ సభ్యులకు తినిపించండి.
Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ
కావాల్సిన పదార్థాలు
బియ్యం – అరకేజీ
రెండు అంగుళాల పరిమాణంలో తగిరిగిన పనసముక్కలు – పది
లవంగాలు – ఆరు
యాలకులు – నాలుగు
దాల్చినచెక్క – చిన్న ముక్క
అనాసపువ్వు – రెండు
జాపత్రి – నాలుగు
జాజికాయ – చిన్నముక్క
సోంపు – చెంచా
ఉల్లిపాయ – ఒకటి (రెండు ముక్కలుగా కోయాలి.
ఒకదాన్ని మెత్తగా చేసుకోవాలి)
ఉప్పు – తగినంత
నూనె – అరకప్పు
వెల్లుల్లి అల్లం మిశ్రమం – చెంచా చొప్పున
కారం – కొద్దిగా
నెయ్యి – అరచెంచా
ఎండు మిర్చి- రెండు
కరివేపాకు – రెండు రెబ్బలు
Panasakaya Biryani తయారీ విధానం
ముందుగా లవంగాలు, సోంపు, యాలకులు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, జాపత్రి, జాజికాయ తీసుకుని మెత్తని పొడి చేసుకోవాలి. పొయ్యిమీద వెడల్పాటి పాత్ర పెట్టి నాలుగు చెంచాల Oil వేడిచేసి పనస ముక్కలు దోరగా వేయించాలి. అందులోనే ఉల్లిపాయల మిశ్రమం, అరచెంచా వెల్లుల్లి మిశ్రమం వేసి తగినంత ఉప్పు, కారం, కొద్దిగా మసాలాపొడి (Masala Powder) వేడి బాగా వేయించాలి. అవసరం అనుకుంటే కాసిని నీళ్లు చేర్చుకోవచ్చు. ముక్కలు మెత్తగా ఉడికించి దింపేయాలి.
బియ్యాన్ని తడి వస్త్రంతో తుడిచి అల్లంవెల్లుల్లి మిశ్రమం, అరచెంచా నెయ్యి మిగిలిన మసాలా పొడి కలిపి పెట్టుకోవాలి. బియ్యం ఉడికేందుకు సరిపడా పాత్రను తీసుకుని అందులో మిగిలిన నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు రెబ్బలు, ఎండు మిర్చి(Mirchi) వేయించి మసాలా పట్టించిన బియ్యాన్ని చేర్చాలి.
బియ్యం కొద్దిగా ఉడికాక ముందుగా వేయించి పెట్టుకున్న పనస ముక్కల్ని వేసేయాలి. నీళ్లన్నీ ఆవిరై అన్నం ఉడికాక దింపేస్తే సరిపోతుంది. వర్షాకాలంలో దీన్ని వేడివేడిగా తీసుకుంటే ఆ రుచే వేరు.
పనసకాయ ఉపయోగాలు
పనసకాయ ను ఆంగ్లంలో Jackfruit అని అంటారు. దీనిని మన ఇండియాలో ఇష్టంగా తింటుంటారు. రోడ్ల వెంబడి బండ్ల మీద కూడా పనసకాయలను అమ్ముతుంటారు. అదే విధంగా కూరలు చేసుకొని తింటుంటారు. తెలుగు రాష్ట్రాల్లో పనసకాయ ఒక స్పెషల్‌గా ఇష్టపడుతుంటారు. పెద్ద పెద్ద శుభకార్యాలకు Panasakaya తో వండిన ఐటమ్స్, బిర్యానీలను ఇష్టంగా తింటుంటారు.
పనసకాయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుది. జీర్ణశక్తిని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. మలబద్దకంతో బాధపడేవారు దీనిని తింటే చాలా మంచిది. అధిక రక్తపోటు ఉన్నవారు, సి విటమిన్ లోపం ఉన్నవారు తప్పకుండా Panasakaya Pandu ను తినాలి. పనసలో క్యాన్సర్ వ్యాధిని నిరోధించే పోషకాలు ఎక్కువగా ఉన్నాయట. అజీర్తి, అల్సర్లను కూడా ఈ పండు నయం చేస్తుంది.
పనస పండే కాదు, ఆకులు, వేర్లు కూడా ఉపయోగపడతాయి. పనస ఆకులను వేడి చేసి గాయాల మీద పెట్టుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. చర్మవ్యాధులు, ఆస్తమా, జ్వరం, డయేరియా నివారణకు పనస వేర్లు ఉపయోగపడతాయి. అధిక బరువు, టెన్షన్‌తో బాధపడేవారు ఈ పండు తినవచ్చు. మగవారిలో సెక్స్ సమస్యలను అధిగమించడానికి ఈ పండు దోహదపడుతుంది.