Pan card New Rules: మీకు తెలుసా? పాన్ కార్డు రూల్స్ మారాయ్‌!

Pan card New Rules | పాన్ కార్డు రూల్స్ మే 26 2022 నుంచి మారాయి. మారిన రూల్స్ గురువారం నుండి అమల్లోకి రానున్నాయి. ఇప్ప‌టికే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని 114బీ రూల్ ప్రకారం బ్యాంకులో ఒక రోజులో రూ.50,000 క‌న్నా ఎక్కువ డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు వివ‌రాలు వెల్ల‌డించ‌డం త‌ప్ప‌నిస‌రి అనే రూల్ అమ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. కానీ ఈ Ruleలో యాన్యువ‌ల్ లిమిట్ క‌వ‌ర్ కాదు. దీంతో CBDT కొత్త రూల్ అమ‌లు చేస్తోంది. ఇవాళిటి నుంచి భారీగా ఆర్థిక లావాదేవీలు జ‌రిపేవారికి కొత్త రూల్ అమల్లోకి వ‌స్తుంది.

Pan card New Rules : పాన్ కార్డు రూల్స్

ఈ రూల్ ప్ర‌కారం ఒక వ్య‌క్తి ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.20 ల‌క్ష‌ల క‌న్నా ఎక్కువ Withdraw చేసినా, డిపాజిట్ చేసినా త‌న పాన్ నెంబ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా వెల్ల‌డించాలి. ప్ర‌భుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల్లో మాత్ర‌మే కాదు కోఆప‌రేటివ్ Bankల్లో రూ.20 ల‌క్ష‌ల క‌న్నా ఎక్కువ Deposits, విత్ డ్రాయ‌ల్స్ చేసినా ఈ రూల్ వ‌ర్తిస్తుంది. అయితే లావాదేవీలు జ‌రిపే ప్ర‌తీ ఒక్క‌రికీ పాన్ కార్డు లేదు. మ‌రి అలాంటివారి ప‌రిస్థితి ఏంట‌న్న సందేహాలు ఉన్నాయి.

పాన్ కార్డు లేనివారు త‌మ ఆధార్ నెంబ‌ర్ వెల్ల‌డించాలి. ఒకేసారి రూ.20 ల‌క్ష‌ల ట్రాన్సాక్ష‌న్ చేసినా, వేరువేరు సంద‌ర్భాల్లో మొత్తం క‌లిపి రూ.20 ల‌క్ష‌ల లావాదేవీలు జ‌రిపినా ఈ రూల్ వర్తిస్తుంది. అయితే లావాదేవీలు జ‌రిపే సంద‌ర్భంలో పాన్ నెంబ‌ర్‌, Aadhaar నెంబ‌ర్ల‌ను తీసుకునే వ్య‌క్తులు అవి స‌రైన వివ‌రాలేనా కాదా? అని నిర్థారించుకోవాల‌ని సీబీడీటీ వెల్ల‌డించింది. ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఇప్ప‌టికే ఆధార్ నెంబ‌ర్ ద్వారా Pan కార్డుల్ని జ‌న‌రేట్ చేస్తోంది. పాన్‌కార్డు, ఆధార్ నెంబ‌ర్ లింక్ చేయాల‌ని కోరుతోంది.

ఒక వేళ భారీ మొత్తంలో లావాదేవీలు ప్లాన్ చేసిన‌వాళ్లు త‌మ ద‌గ్గ‌ర పాన్ కార్డు లేక‌పోతే లావాదేవీ చేసే తేదీకి క‌నీసం ఏడు రోజుల ముందు పాన్‌కార్డు కోసం ద‌రఖాస్తు చేసుకోవాల‌ని సిబిడిటి నోటిఫికేష‌న్ చెబుతోంది.

ఖాతాదారులు బ్యాంకుల్లో లేదా పోస్టు ఆఫీసుల్లో క‌రెంట్ అకౌంట్‌, క్యాష్ Credit Account ఓపెన్ చేసినా పాన్ నెంబ‌ర్ లేదా ఆధార్ నెంబ‌ర్ వివ‌రాలు ఇవ్వ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది. ఈ Pan card New Rulesని అమ‌లు చేసేందుకు సిబిడిటి ఆదాయ‌పు ప‌న్ను నిబంధ‌న‌లు -1962 లో ప‌లు స‌వ‌ర‌ణ‌లు చేసింది.

అంద‌రికీ వ‌ర్తిస్తుందా?

ఈ లావాదేవీల్లో ఇచ్చే పాన్ కార్డు లేదా ఆధార్ కార్డులోని Demographic, బ‌యోమెట్రిక్ స‌మాచారాన్ని ప్రిన్సిపాల్ డైరెక్ట‌ర్ ఆఫ్ ఇన్‌క‌మ్ ట్యాక్స్ (సిస్ట‌మ్‌), డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇన్‌క‌మ్ ట్యాక్స్ (సిస్ట‌మ్‌), సెక్ష‌న్ 139ఏ ప్ర‌కారం ధృవీక‌రిస్తోంది.

సెక్ష‌న్ 139A వ్య‌క్తులు పాన్ కార్డు (Pan card New Rules) కోసం అప్లై చేయాలో, ఎవ‌రు PAN card వివ‌రాల‌ను వెల్ల‌డించాలో తెలుపుతుంద‌ని, ఈ సెక్ష‌న్ అంద‌రు వ్య‌క్తుల్ని క‌వ‌ర్ చేయ‌ద‌ని, అందుకే సిబిడిటి రూ.20 ల‌క్ష‌ల క‌న్నా ఎక్కువ లావాదేవీల‌కు పాన్ కార్డు లేదా ఆధార్ నెంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి చేసింద‌ని Taxibuddy.com ఫౌండ‌ర్ సుజిత్ బంగార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *