Palle Yadikochena: తెలంగాణ కళాకారుల్లో గిద్దె రామ నర్సయ్య ఒకరు. పాటలు రాయడం ద్వారా, పాడటం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాటపై తనకు ఉన్న మమకారం, ఆశ, పట్టుదల, కృషి రామ నర్సయ్య అన్నను రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకునేలా చేసింది. పాడిన పాటలు పదుల సంఖ్యల్లో ఉన్నప్పటికీ అంత్యత ప్రాధాన్యతత కూడిన తెలంగాణ సామాజిక సాంస్కృతికత ఉట్టిపడేలా తన పాటలు ఉంటాయి.
గిద్దె రామ నర్సయ్య సొంతగా పెట్టిన Gidde Galam Channel అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు, పాటల అభిమానులకు అత్యంత దగ్గరయ్యారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన Palle Yadikochena (పల్లె యాదికొచ్చెనా..) అనే సాంగ్ ఇప్పుడు అంత్యంత ప్రజాదారణ, అభిమానాన్ని పెంచింది. సెప్టెంబర్ 24, 2020 సంవత్సరంలో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పాటను విడుదల చేశారు. గిద్దె రామ నర్సయ్య. విశ్లేషిత విజ్ఞానిత సమర్పించు గిద్దె గళం ద్వారా వచ్చినీ పాట రామ నర్సయ్య జీవితంలో మరిచి పోని పాటగా స్థిర స్థాయిలో నిలిచిపోయేలా ఉంది.
పల్లె యాదికొచ్చెనా..మల్ల పాట మొదలు పెట్టినా..!
ఊరు గుర్తుకు వచ్చెనా.. ఉద్యమ పాట యాదికొచ్చెనా!
అంటూ పాట ప్రారంభం ఎంతో బాగుంది. ఈ పాటలో తెలంగాణ కవులను, కళాకారులను, రచయితలను, సింగర్లను అందర్నీ యాది చేసుకుంటూ తెలంగాణలో వారి గొప్పతన్నాన్ని మరలా ఒకసారి ఈ పాట ద్వారా యాది చేశారు గిద్దె రామ నర్సయ్య. గద్దరన్న, గొరేటి వెంకన్న, డప్పు రమేష్, సంజీవ్, అంజన్న, అందెశ్రీ, సుద్ధాల అశోక్‌తేజ్, జయరాజు, అరుణోదయ నాగన్న, రామారావు, వందేమాతరం శ్రీనివాస్, ఆర్.నారాయణమూర్తి, శంకరన్న, సారంగపాణి, వరంగల్ శ్రీన్నన్న, మారోజు వీరన్న, కలకూరి, రసమయ బాలకృష్ణ,సుక్క సత్తయ్య,మిద్దె రాములు,మిట్టపల్లి, నేర్నాల కిషోర్,బిక్షం,వేముకంటి,
వండ్లకొండ,శంకర్‌బాబు, ఆకునూరి దేవన్న,తిరుపతి, నామ్దేవన్న, సాయిచందు,బెల్లి లలితక్క,చైతన్యక్క, ఏపూరి సోమన్న, రామక్క, అశ్విని, విమలక్క,విజయక్క ఇలా అమరవీరులను స్మరించుకుంటూ పాట అద్బుతంగా పాడరు గిద్దె రామ నర్సయ్య అన్న. సారా..సారమ్మ.. అంటూ పాట పాడి ప్రజలందరికీ తెలిసిన రామనర్సయ్య అన్న ఇప్పుడు తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పాటలు ప్రజలకు అందిస్తున్నారు. మీరు కూడా రామనర్సయ్య అన్న పాటలు వినాలంటే యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాము. ప్రతి ఒక్కరూ చూడగలరు.
Song: | Palle Yadikochena |
Lyrics & Singer : | Gidde Ramnarsaiah |
Music: | GL Namdev |
Dop & Editing: | Harish Patel |
Acting & Direction: | Gidde Ramnarasaiah |
Sound: | Umesh Chilukumari, Md Ravi |
Youtube Channel: | Gidde Galam |
People also Search Links:
Palle Yadikochena Full song 2020 mp3 download|Palle Yadikochena|Palle Yadikochena full song lyrics| Palle yadikochena Ringtone download| Palle Yadikochena Mp4 & mp3 free download | Gidde Ramnarasaiah Songs | ram narasaiah telangana songs | పల్లె యాదికొచ్చెనా..మల్ల పాట మొదలు పెట్టినా! | పల్లె పాటలు | పల్లె యాదికొచ్చెన | తెలంగాణ ఫోక్ సాంగ్స్.