Pallavi raju | టిడిపిలోకి ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆడపడుచు పల్లవిరాజు జాయిన్ అవ్వబోతున్నారు. పుష్ఫ శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజుకు పల్లవి స్వయాన చెల్లెలు. టిడిపిలో చేరిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని ఆమె పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ఇంట్లో రాజకీయ పోరు చర్చనీయాంశంగా మారింది. పుష్ఫ శ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, ఆయన కుమార్తె పల్లవి రాజు(Pallavi raju) టిడిపిలో చేరుతున్నట్టు ప్రకటించారు.
పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, మన్యం ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడమే పార్టీ మార్పుకు కారణమని శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు(handra shekar raju) తెలిపారు. కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరక్కపోవడం బాధించిందన్నారు. గౌరవం లేని పార్టీలో ఇక కొనసాగబోమని అందుకే వైసీపీ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
మన్యం ప్రజల కోసమే!
విజయనగరం జిల్లాలో పార్వతీపురం రామానంద నగర్లోని బెలగాంలో తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లవిరాజు మాట్లాడారు. లాబేసు-పూర్ణపాడు వంతెన, నాగావళి వంతెన కురుపాం గిరిజనుల చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ వంతెనలు నిర్మాణం పూర్తి కాలేదని, వర్షాకాలంలో కురుపాం నియోజకవర్గం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పాము కాటుకు గురై విద్యార్థి మరణిస్తే కనీసం ఎక్స్గ్రేషియా ప్రకటించలేదన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం బిల్లు ఇప్పటికీ పార్లమెంట్లో పాస్ అవ్వలేదన్నారు. ఇలా చాలా అంశాల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు నాయుడుతోనే అమరావతైనా, గిరిజన ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని పల్లవి అభిప్రాయం వ్యక్తం చేశారు. కురుపాం(kurupam) నియోజకవర్గం అభివృద్ధే తన ధ్యేయమని పల్లవిరాజు మీడియా ఎదుట తెలిపారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!