pakodi making: అందరికీ ఇష్టమైన స్నాక్ పకోడి. రుచిలో కొత్తదనం కోసం ఉల్లిపాయ, పాలకూర, బంగాళదుంప కూరగాయలతో కూడా పకోడీ చేస్తుంటారు కొందరు. అయితే ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా రుచిగా, కరకరలాడేలా రావు. అప్పుడు ఏం చేయాలంటే?.
pakodi making :పకోడీ తయారు చేసే పద్ధతి!
పకోడి కోసం పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా బియ్యం పిండి బేయాలి. దాంతో పకోడీలు కరకరలాడతాయి. అంతే కాదు నూనె కూడా తక్కువ పీల్చుకుంటాయి. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కూరగాయలను సన్నగా తరగాలి. అప్పుడు పకోడీలు తేలికగా ఉండి కరకరలాడతాయి.అలానే పిండిలో నీళ్లు సరిపోను పోయాలి. నీళ్లు ఎక్కువైతే నూనెలో వేగించేటప్పుడు బయటికొచ్చేస్తాయి. పకోడీలు సరిగ్గా రావు. బేకింగ్ సోడా కలిపితే పిండి తేలికగా ఉంటుంది.


pakodi making: పకోడీ పిండి మరింత తేలికగా ఉండేందుకు స్పూన్‌తో కాకుండా విస్క్‌తో కలపాలి. పకోడీలను మీడియం మంట మీద వేగిస్తే కూరగాయ ముక్కలు సరిగ్గా ఉడుకుతాయి. టేస్టీగా ఉంటాయి. నూనె బాగా వేడెక్కాక పకోడీలను వేగించాలి. లేదంటే అవి ఎక్కవ నూనెను పీల్చుకుంటాయి. లేత గోధుమ రంగులోకి వచ్చేంత వరకూ పకోడీలను వేగించాలి. ఒక చిన్న పాత్రలో నీళ్లు కిచెన్ టవల్ అందుబాటులో ఉంచుకోవాలి. కూరగాయ ముక్కలు, ఉల్లిపాయలు వంటివి పిండిలో ముంచి పకోడీలు వేగించే ముందు నీళ్లతో చేతిని తడుపుతూ ఉంచాలి. ఇలా చేస్తే చేతులకు పిండి అంటుకోదు.