Pakistan Taliban: ఆఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఆక్రమించుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కోపంతో రగిలిపోతుంటే, శత్రు దేశమైన పాకిస్తాన్ మాత్రం చాలా ఉత్సాహంగా కనిపిస్తోందట. అయితే అది మూడ్నాళ్ల ముచ్చటలాగే మిగిలిపోయిందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆందోళన మొదలైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ తాలిబాన్ (Pakistan Taliban)దాడులకు సిద్ధమవుతోందట.
అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఆఫ్గాన్ తాలిబాన్ నేతలతో మొరపెట్టుకుని తహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్(టిటిపి) మిలిటెంట్లు దాడులు చేయకుండా ఆపాలని విన్నవించుకుంటున్నాయి.
టిటిపి మిలిటెంట్లు పాకిస్తాన్లో ఎన్నోదాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ సంస్థ ను ప్రస్తుతం పాకిస్తాన్ తాలిబాన్ అని కూడా పిలుస్తున్నారు. అయితే వారి కార్యకలాపాలు పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో చురుగ్గా కొనసాగిస్తున్నారట.


ఈ క్రమంలో ఆఫ్గాన్ నేలను టిటిపి మిలిటెంట్లు వాడుకొని పాకిస్తాన్‌పై ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉన్నట్టు ఆ దేశ ప్రభుత్వం పసిగట్టిందట.
పాక్‌కు ఆందోళన ఎందుకు?
ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పాకిస్తాన్ ఆఫ్గానిస్తాన్‌ను ఎప్పుడైతే తాలిబాన్లు ఆక్రమించుకున్నారో అక్కడ జైళ్లలో ఉన్న తహ్రీక్ – ఎ- తాలిబాన్ పాకిస్తాన్ మిలిటెంట్లను చాలా మందిని విడుదల చేశారు. ఈ వార్త తెలుసుకున్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వెంటనే ఆఫ్గాన్ తాలిబాన్‌ను సంప్రదించింది.
అయితే టిటిపి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆఫ్గానిస్తాన్ భూమిగా ఉపయోగించకుండా చూస్తామని ఆఫ్గాన్ తాలిబాన్ అధినేతలు తమకు భరోసా ఇచ్చారని పాకిస్తాన్ హోంమంత్రి షేఖ్ రషీద్ అహ్మద్ చెప్పారు.
అయితే టిటిడి మోస్ట్ వాండెట్ మిలిటెంట్ల జాబితాను పాకిస్తాన్ ప్రభుత్వం ఆఫ్గానిస్తాన్ తాలిబాన్‌కు అందించినట్టు పాక్ హోంమంత్రి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్గాన్ తాలిబాన్ చీఫ్ హీబాతుల్లా అఖుంద్జాదా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారని, ఇది పాకిస్తాన్ ఫిర్యాదులను పరిశీలిస్తుందని, సరిహద్దుకు అవతల దాడులకు టిటిపి ఆఫ్గానిస్తాన్ నేలను ఉపయోగిస్తోందా లేదా అనేది తెలుసుకుంటుందని మరికొన్ని వార్తల్లో చెప్పారు.
పాకిస్తాన్ తాలిబాన్ ఎప్పుడు ఏర్పడింది?


తహ్రీక్ – ఎ- తాలిబాన్ అంటే, పాకిస్తాన్ తాలిబాన్ సంస్థను 2007 డిసెంబర్లో 13 మిలిటెంట్ గ్రూపులను కలిపి ఏర్పాటు చేశారు. పాకిస్తాన్లో షరియా ఆధారిత సనాతన ఇస్లాం పాలనను తీసుకురావడమే దాని లక్ష్యం.
పాకిస్తాన్‌కు ఈ టిటిపి సంస్థకు నిత్యం ఎప్పుడూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కొంత కాలం క్రితం టిటిపి ప్రభావం ఉన్న ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న ఒక పోలీసును దారుణంగా కొట్టిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.
2004లో పెషావర్‌లోని ఒక స్కూల్ మీద జరిగిన కాల్పుల్లో దాదాపు 200 మంది చనిపోయారు. వారితో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ఈ ఘటనకు టిటిపినే కారణం అని అక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం టిటిపి మిలిటెంట్లు ఎక్కువుగా ఆఫ్గానిస్తాన్‌లో ఉన్నారని, అక్కడ నుంచే సరిహద్దుకు అవతల దాడులకు పథకాలు వేస్తున్నారేమోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!