Padilame Dilip Devagan Song Mp3 | సింగర్ దిలీప్ దేవగన్ పాటలు వింటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. పాటకు ప్రాణం పోసి పాడతాడు కాబట్టి ప్రతి పాట సూపర్ హిట్ అవుతాయి. తెలంగాణ ఫోక్ సాంగ్స్ పాడే పురుషులలో టాప్ ఉన్నాడు దిలీప్ దేవగన్. కారణం అతను పాడే తీరు, ఎంచుకునే పాట నేపథ్యం అని చెప్పవచ్చు. అంచెలంచెలుగా తన కెరీర్లో మంచి సింగర్‌గా నిలదొక్కుకున్న ఇతను పాటలు పాడటమే కాదు అద్భుతంగా నటిస్తున్నాడు. ఒక ప్రక్క పాట పాడటం, మరో ప్రక్క ఆ పాటలో నటించడం ఇప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్స్‌లో కనిపిస్తున్నట్రెండ్.
అద్భుతమైన పాట!
ఇక kadali Music యూట్యూబ్ ఛానెల్ నుంచి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైన పాటను పాడారు, నటించారు Dilip Devagan. ఆ పాట పేరు పదిలమే ఓ సిలకా(Padilame Dilip Devagan Song Mp3). ఈ పాట ఎంత అద్భుతంగా ఉందంటే..వీడియో చూసిన ప్రతి విఫల ప్రేమికుడు కన్నీరు పెట్టుకునేంతలా ఉంది మరి. ఈ పాటను ఇప్పటికే కొన్ని లక్షల మంది చూశారు. ప్రతి ఒక్క భగ్న ప్రేమికుడు తన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఈ పాటను వింటూ కామెంట్లు పెడుతున్నారు. 5 నిమిషాలు కొనసాగిన ఈ పాట ఎక్కడా కూడా బోరు కొట్టకుండా జాగ్రత్త పడ్డారు కడలి మ్యూజిక్ నిర్వాహకులు.
ఈ పాట ప్రారంభంలో ముందుగా సింగర్ దిలీప్ సింగర్ గుండెలు నిండా బాధను పెట్టుకుని ఆ బాధను పాట రూపంలో పాడటానికి కొన్ని చిల్లర రూపాయలను చేతిలో పట్టుకుని ఒక పట్టుచీరను చేత పట్టుకుని మ్యూజిక్ స్టూడియో వద్ద ధీనంగా కూర్చుంటాడు. ఎప్పటి నుంచో పాడటానికి బ్రతిమిలాడినట్టు చిరాకు మొహంతో మ్యూజిక్ డైరెక్టర్ చేసేది ఏమీలేక స్టూడియో లోపలికి అనుమతిస్తాడు. అప్పుడు దిలీప్ సింగర్ గొంతు బిక్కటిల్లేలా పాట పాడటం ప్రారంభిస్తాడు. ఈ పాట మామూలు పాటే అనుకున్న స్టూడియో బృందం క్యాజువల్‌గా తీసుకుంటారు. కానీ దిలీప్ పాడుతున్న తీరుతో ఒక్కసారిగా మౌనం వహిస్తారు.
దిలీప్ దేవగన్ నటనకు కన్నీళ్లు ఆగవు!
జీతమంతా చేతబట్టి నేగొన్న పట్టుచీర..ఇయ్యాల నా ఊపిరే ఆపేందుకే మెడచుట్టూ చేరిందిగా..అంటూ ప్రారంభిస్తాడు. ఈ ఒక్క పదంతో పాటలో తను ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసుకుంటూ పాట కన్నీరు పెట్టుకుంటూ పాడటం ప్రారంభిస్తాడు. ఈ పాటకు సంగీతం హృదయాన్ని తాకినట్టు ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి కులం అడ్డు తగలడంతో దూరమవ్వడంతో ఈ పాట ద్వారా తన ప్రియురాలికి ప్రేమను వ్యక్త పరుస్తాడు. ఈ పాటలో దిలీప్ దేవగన్ నటించాడు అనడం కంటే నిజ జీవితంలో తనకు నిజంగా జరిగినట్టులా జీవించాడు.
పదిలమే సిలకా లిరిక్స్‌ను రాసింది కూడా దిలీప్ దేవగన్. పాట రాసి, పాడి, నటించి ప్రేక్షకులు, అభిమానుల గుండెల్లో కన్నీళ్లు తెప్పించాడు. నిజంగా ఈ పాటను మీరు ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమికులు ఈ పాటను చూసినా, విన్నా మళ్లీ మళ్లీ తప్పకుండా వింటారు. ఇంతటి గొప్ప పాటను అందించిన కడలి మ్యూజిక్ నిర్వాహులకు నిజంగా హ్యట్సాఫ్.
Vocal , lyrics & direction: Dilipdevagan
Music: Bharath Kumar mekala
DOP , Editing & Di: Sandeep king [TRTFStudio]
Mixing: Qmulya Studios
Poster designe: Prem G
Rhythms: Chiru
Voilen: Pawan
shannai: mallikarjun
Special thanks: Bharath Kumar mekala, gajwel venu, Sandeep devagan, gaddam raju, sravan life failure, siddhu j star,sk chandu, Pawan.
ఈ పాట వీడియో కోసం క్లిక్ చేయండి!
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?