OYO Rooms | ఒకప్పటి లార్జీలు ఇప్పుడు ఓయో రూమ్స్‌గా మారాయి. చాలా మంది యువ జంటలకు అవి ఫేవరెట్ ప్లేస్‌గా పేరు పడింది. కేవలం ID Proof ఉంటే చాలు, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఎవరితోనైనా ఉండొచ్చు. జస్ట్ రూం బుక్ చేసుకుంటే చాలు, ఇక ఏదొక అమ్మాయితో ఎన్ని గంటలైనా ఉండొచ్చు. ఎలా ఎంజాయ్ చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. కొందరు యువకులు ఓయో రూమ్స్‌లో 5 గంటల వరకు ఉంటున్నారు. వారు డ్రగ్స్ తీసుకొని ఆ రూమ్‌ల్లో మత్తులో మునిగిపోతున్నారు. కొందరు అయితే హత్యలు చేయడానికి ఈ స్థలాన్ని అడ్డగా చేసుకుంటున్నారు. ఎవరూ చూడరు. ఎవరూ అడగరు. అయితే సరిగ్గా ఇప్పుడు పోలీసుల దృష్టి ఓయో రూమ్స్(OYO Rooms)పై పడింది. అసలు అక్కడేం జరుగుందని దృష్టి పెట్టారు కమిషనర్ ఆనంద్.
ఓయో రూమ్స్‌లో అసలేం జరుగుతుంది?
పెద్ద పెద్ద అక్షరాలతో ఓయో బోర్డులు కనిపిస్తుంటాయి. ఓయో..ఇదేం మాయో..! అన్నట్టుగా ఉంది వాటి వ్యవహారం. నగరాలలో ఉన్న చిన్న లాడ్జీలన్నింటితోనూ ఓయో Tie-UP అయి ఉంటుంది. ఓయో వెబ్సైట్లో ఎక్కడా కూడా స్టార్ హోటళ్ళు కనిపించవు. కేవలం మీడియం లాడ్జీలతోనే లింక్ అయి ఉంటుంది. ఓయో రూమ్స్(OYO Rooms) లవర్స్‌కు ప్రత్యేక హాట్‌స్పాట్‌గా చెప్పవచ్చు. ఒకప్పటి లాడ్జీలు ఇప్పుడు మోడరన్ ఓయో రూమ్స్‌గా మారాయి. లవర్స్‌కు ఈ రూమ్‌లు అంటే ఇష్టం. తిన్నగా ఐడితో లాగిన్ అయి రూమ్ బుక్ చేసుకుంటున్నారు. రూమ్‌కు వచ్చి 4 గంటలకు పైగా ఏకాంతంగా గడుపుతున్నారు. అంతటితో ఆగకుండా హత్యలకు తెరదీస్తున్నారు.
ఎవరుతో వస్తున్నారో తెలియదు!
నగరంలో ఓయో రూమ్స్‌కు ఎంతో మంది జంటలు వచ్చి వెళుతుంటారు. వారు లవర్స్ కాకుండానే మరేఇతర అక్రమ సంబంధం ఉన్నవారు సైతం ఈ రూమ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఇలా అయితే కష్టమని కమిషనర్ ఆనంద్ రంగంలోకి దిగారు. ఓయో రూమ్స్ లాంటివి ఆన్లైన్లో(Online) మరెన్నో ఉన్నాయని, వాటి మీద ఫోకస్ పెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. వ్యాపారం చేసుకోవడానికి తాము అడ్డుపడబోమని, కానీ మినిమం ప్రొటోకాల్ పాటించాలని అంటున్నారు.
ఓయేలకు దేశవ్యాప్తంగా వ్యాపార రంగం ఉంది. ఎక్కువుగా పర్యాటక రంగాల వద్ద ఉన్న లాడ్జీలను తక్కువ ధరకే రూమ్స్‌ను అందిస్తుంది. ఓయో కస్టమర్లలో 60 శాతం మంది యువతే ఉన్నారు. వారు కూడా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలలోపు వారేనంట. దీనికోసం సంస్థ వినూత్నంగా ఆలోచన చేసిందంట. ఓయో రూమ్స్ 300 సిటీల్లో హోటళ్లు టైఆప్ అయినవి. లక్ష గదులు అందుబాటులో ఉంటాయి. పెళ్లి కాని జంటలకు గదులు ఇవ్వొద్దని భారత దేశంలో చట్టం లేకపోవడంతో ఇలా హోటల్స్ విచ్ఛలవిడిగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రెండు గంటలు ఎంజాయ్ చేసి వెళ్లిపోయేవారు ఉంటే, మరికొంత మంది గంటల తరబడి ఎంజాయ్ చేస్తూ అవసరం తీరిన తర్వాత ఘర్షణ చెలరేగి హత్యలకు పాల్పడుతున్నారు. దీంతో ఓయో రూమ్స్ అంటేనే ఆ టైపు రూమ్స్ అంటూ పేరు సంపాదించుకుంది. మరో విషయం ఏమిటంటే ఓయో రూమ్స్‌ను అడ్డగా పెట్టుకొని ఆ రూముల్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు కొందరు. వివిధ రాష్ట్రాల నుంచి సెక్స్ వర్కర్లను తీసుకొచ్చి ఓయో రూముల్లో దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సిటీ పోలీసులు నిఘా పెట్టారు. నగరంలోని ఓయో రూమ్స్ ఉన్న హోటళ్లను వెళ్లి పరిశీలిస్తున్నారు. అక్కడ రూమ్స్ కోసం ఏ ఏ ఫ్రూప్‌లు తీసుకుంటున్నారు. ఎలా నిర్వహిస్తున్నారనే వాటిని పరిశీలిస్తోంది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!