Oxpeckers Help Rhiones | మీరు ఎప్పుడైనా ఖడ్గ మృగాలను చూశారా? తల ముందు భాగంలో ఒక కొమ్ముతో ఉండి భారీ ఆకారం కలిగి ఉంటుంది. ఈ ఖడ్గ మృగం ఎక్కువుగా భారత దేశంలో పాటు, నేపాల్ ప్రాంతాల్లో ఎక్కువుగా ఉన్నాయట. దీనిని పెద్ద క్షీరదం అని చెప్పవచ్చు. ఇది మంద మైన వెండి రంగు చర్మంతో ఉండటంతో పాటు వెంట్రుకలు తక్కువ కలిగి ఉంటాయి. ఇవి గంటకు 25 కిలోమీటర్లు పరుగెత్తగలవు. నీటి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువుగా ఉండి ఈత లో ప్రావీణ్యం కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువుగా పులులు, సింహాలు(Oxpeckers Help Rhiones) వేటాడతాయి.
రెడ్ ఆక్స్పెకర్ పక్షి సాయం!
అయితే ఖడ్గ మృగాలతో పాటు ఇతర పెద్ద జంతువులకు రెడ్ ఆక్స్పెకర్ అనే పక్షి సాయ పడతాయట. ఎలా అంటే సాధారణంగా జంతువులు చెవుల్లో ఉన్న పేలు, ఇతర కీటకాలు, చర్మం మీద ఉన్న మలినాలు తోకతో దులపుకునేందుకు ప్రయత్నం చేస్తాయి. కొన్ని జంతువులు మాత్రం ఏదైనా గోడకో, పెద్ద చెట్టుకో రుద్దు కుంటూ కాస్త ఉపశమనం పొందుతాయి. కొన్ని సార్లు ఈ పేలు, ఇతర వైరస్ల వల్ల పెద్ద పెద్ద మానని గాయాలు కూడా అవుతుంటాయి.
అయితే ఖడ్గ మృగాలు సహజంగా నినాదంగా స్పందిస్తాయి. శత్రువు ఎదురొస్తే మాత్రం చాలా స్పీడ్‌గా స్పందిస్తాయి. ఈ క్రమంలో నీళ్లల్లో ఎక్కువ సమయం ఉండటంతో పాటు బురదలో కూడా పడుకుంటాయి. దీంతో ఖడ్గ మృగాల చర్మం అంతా మట్టితో నిండిపోతుంటాయి. చెవుల్లో ఏదైనా పురుగులు, కీటకాలు కూడా చేరతాయి. దీంతో రెడ్ ఆక్స్ పెకర్ పక్షులు పడుకొని ఉన్న ఖడ్గ మృగం వద్దకు వచ్చి వాలి చెవుల్లో ఉన్న కీటకాలు, మట్టిని తొలగించి చెవులను శుభ్రం చేస్తాయి. అంతే కాకుండా జంతువు కింది భాగాల్లో కూడా పురుగులు ఉంటే ఈ పక్షులు పట్టేస్తాయి. ఈ పక్షులు తన శరీరంపై వాలినప్పుడు ఖడ్గ మృగం కూడా సహకరిస్తుందట.

ఇలా రెడ్ ఆక్స్ పెకర్ పక్షులు జంతువులకు చిన్నపాటి వైద్యుల్లాగా కూడా పని చేస్తుంటాయి. ఎంత పెద్ద జంతువైనా వాటి చెవుల్లోకి అమాతం దూరి శుభ్రం చేస్తుంటాయి. ఈ పక్షులను పరాన్న జీవులు అని కూడా పిలుస్తారు. వీటి ఆహారం కోసం పెద్ద జంతువులు సహకరిస్తుంటాయి. ఈ ఆక్స్ పెకర్లు జంతువుల చెవిలో ఉండే గులిమిర, చుండ్రును కూడా తింటాయి. ఇవి జంతువు మీద వాలగానే ఒక సిగ్నల్ తెలియజేస్తుంది. దీంతో జంతువులు స్పందించి ఏమీ అనకుండా ఉంటాయి.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ