Overuse of Antibiotics Effectsయాంటీ బయోటిక్ ఔషధాలకు పెరుగుతున్న నిరోధకత(సూపర్ బగ్స్) కారణంగా 2050 కల్లా ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటి మంది మృత్యువాతపడే అవకాశముందట. అంటే దాదాపుగా ప్రతి మూడు సెకన్లకు ఓ మరణం సంభవించబోతోందన్నమాట. ప్రస్తుతమున్న ఔషధాలపై నిరోధకత పెరుగుతున్నప్పటికీ నూతన యాంటీ బయోటిక్ల అభివృద్ధి దిశగా జరుగుతున్న పరిశోధనలు అంతంత(Overuse of Antibiotics Effects) మాత్రమే నట.
యాంటీబయోటిక్ల అతి వినియోగం మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించబోతోందని ఓ బ్రిటన్ నివేదిక ఒకటి హెచ్చరించింది. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రతిచిన్న అనారోగ్యానికి యాంటీబయోటిక్లను వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ ఔషధాల పట్ల నిరోదకత పెరుగుతోందని సూచించింది. తద్వారా భవిష్యత్తులో అత్యంత సాధారణ అనారోగ్యాలూ మందులకు తలవంచక ప్రాణాలకు ముప్పు కలిగించే సూచనలున్నాయంటూ అప్రమత్తం చేసింది.


యాంటీ బయోటిక్ల పట్ల పెరుగుతున్న నిరోధకతపై బ్రిటన్ లో ప్రముఖ ఆర్థిక వేత్త లార్డ్ జిమ్ ఓనీల్ ప్రభుత్వానిక నివేదిక సమర్పించారట. యాంటీ బయోటిక్ల అతి వినియోగానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా మహా విప్లవాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకతను ప్రపంచ నిధి ఏర్పాటు అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పింది. దేశాల ఆరోగ్య బడ్జెట్లలో స్వల్ప కోత విధించడం, యాంటీబయోటిక్ పరిశోధనలపై పెట్టుబడులు పెట్టకుండా నిరోధించాలనే వాదన కొనసాగుతోంది.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!