Over Dieting | ప్రతి ఒక్కరూ అందంగా, నాజుగ్గా ఉండాలని అనుకోవడం సహజం. లావుగా అవుతున్నామని భావించి శరీరానికి అవసరమైన ఆహారాన్ని తీసుకోవడం మానేయకూడదు. తగినంతగా ఆహారం లేకపోతే, శరీరానికి కావాల్సిన పోషకాలు లభించకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. Slimగా ఉండాలంటే డైటింగ్ (Over Dieting)చేయకూడదు. ఆహారపు అలవాట్లలో చిన్న పాటి మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా Weight కూడా కంట్రోల్ అవుతుంది.
అతిగా డైటింగ్ మానేయండి!
ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గిస్తే శరీరంలో నిల్వ ఉన్న Fat కండరాల శక్తిని వినియోగించకొని స్లిమ్‌గా తయారువుతారు. ఒకేసారి అధికంగా తినడం కంటే, నాలుగు సార్లు కొద్దికొద్దిగా తినడం మంచిది. భోజనం చేస్తూ మధ్యలో అతిగా నీళ్లు తాగకూడదు. దాని వల్ల Stomach పెరుగుతుంది. వయసు వచ్చిన తరువాత Proteins ఎక్కువ పరిమాణంలో ఉన్న ఆహార పదార్థాల కంటే Carbohydrates ఉన్న పదార్థాలను తీసుకోవడం మంచిది. ఆకుకూరలు, పాలు, క్యారెట్, నిమ్మ, ఉసిరి, టమాటా మొదలైన విటమిన్స్ లభించే అన్నింటిని ఆహారంలో తీసుకోవాలి.
ఆహారంలో ఉప్పు, పులుపు, నూనెల వాడకం బాగా తగ్గించాలి. సాధ్యమైనంత వరకు స్వీట్లు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. మజ్జిగ, పళ్ల రసాల వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా సేవించాలి. రోజూ పరగడపున గ్లాసుడు Waterలో నిమ్మరసం, ఉప్పు, Honey కలిపి తాగితే బరువు తగ్గుతారు. అందరూ తినగా మిగిలిపోతే వృథా చేయకూడదని బలవంతంగా తింటారు. ఇటువంటి ఆలోచనలు మానుకోవాలి. నెలకోసారి బరువు చూసుకోవాలి. దీంతో ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.