Ongole, Travel buses, fire,

Ongole Travel buses fire: ఒంగోలులో ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సులు ద‌గ్ధం

Andhra Pradesh

Ongole Travel buses fire | ఏపీలోని ఘోర అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌కాశం జిల్లా ఒంగోలు ప‌ట్ట‌ణం బైపాస్లోని ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సులు ద‌గ్థ‌మైన సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. పార్కు చేసి ఉన్న ట్రావెల్ బ‌స్సుల్లో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో తొమ్మి బ‌స్సులు అక్క‌డిక్క‌డే పూర్తిగా బూడిద‌య్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను ఆర్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌మాదానికి షార్ట్ స‌ర్య్కూట్ కార‌ణంగా తెలుస్తోంది.

Ongole Travel buses fire | పార్కింగ్ స్థ‌లంలో వాహ‌నాల‌న్నీ ప‌క్క‌ప‌క్క‌నే నిలిచి ఉంచ‌డంతో ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువుగా ఉంది. అంతే కాకుండా వాహ‌నాల్లో డీజిల్ పూర్తి స్థాయిలో ఉండ‌టం కూడా మంట‌లు త్వ‌ర‌గా వ్యాప్తి చెందేందుకు కార‌ణ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఘ‌ట‌నా స్థ‌లానికి 6 ఫైరింజ‌న్లు చేరి మంట‌ల‌ను ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. అస‌లే వేస‌వి కాలం కావ‌డంతో వాహ‌నాల చుట్టూ పార్కింగ్ వ‌ద్ద గ‌డ్డి, చెత్త ఉండ‌టంతో మంట‌లు పెద్ద‌గా వ్యాప్తి చెందాయ‌ని సిబ్బంది తెలుపుతున్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *