Remdesivir Injection

Covid పేషెంట్ల ప్రాణాల‌తో చెల‌గాటం! Remdesivir Injection రూ.10వేల‌కు బ్లాక్ మార్కెట్‌లో!

Spread the love

Covid పేషెంట్ల ప్రాణాల‌తో చెల‌గాటం! Remdesivir Injection రూ.10వేల‌కు బ్లాక్ మార్కెట్‌లో!

Remdesivir Injection : దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరిగి ప్ర‌భుత్వాలు అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటే మ‌రో ప్ర‌క్క కోవిడ్ సోకిన పేషెంట్ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు కొందరు. కోవిడ్ సోకిన వారంద‌రికీ ఇచ్చ రెమిడిసియ‌ర్ వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌లిపోతుంది. అందుకు స్వ‌యంగా న‌ర్సులు, అవుటు సోర్సింగ్ ఉద్యోగులు స‌హ‌క‌రించ‌డం వ్యాక్సిన్ ను రూ.10 వేలు బ్లాక్ మార్కెట్లో అమ్మ‌డంతో విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్ట‌కున్నారు.

తాజాగా విశాఖప‌ట్ట‌ణం ఆర్‌.కె హామీని హాస్ప‌ట‌ల్ లో న‌ర్సులు చేతివాటం వ‌ల్ల కోవిడ్ పేషెంట్ల‌కు అందించాల్సిన రెమిడిసియ‌ర్ వ్యాక్సిన్ బ‌య‌ట మార్కెట్‌లోకి వెళ్లిపోతుంది. ఈ క్ర‌మంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అద‌న‌పు ఎస్పీ జి.స్వ‌రూప‌రాణి రెడ్ హ్యాండ్‌గా ప‌ట్టుకున్నారు. విశాఖ రామ్‌న‌గ‌ర్‌, ల‌య‌న్స్ క్ల‌బ్ స‌మీపంలో ఆర్‌.కే హామీని ఆస్ప‌త్రిలో కోవిడ్ పేషెంట్ల‌కు అందించాల్సిన రెమిడిసియ‌ర్ వ్యాక్సిన్ బ‌య‌ట బ్లాక్ మార్కెట్‌లో విక్ర‌యిస్తున్నార‌న్న ప‌క్కా స‌మాచారం మేర‌కు సోమ‌వారం సాయంత్రం పేషెంట్ల బంధువుల్లా ఆస్ప‌త్రికి వెళ్లారు.

తొలుత ఆస్ప‌త్రిలో విధులు నిర్వ‌హిస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని త‌మ‌కు రెమిడిసియ‌ర్ వ్యాక్సిన్ కావాల‌ని కోరారు. దీంతో ఒక్కొక్క ఇంజ‌క్ష‌న్ రూ.10 వేలు ఖ‌ర్చ‌వుతుంద‌ని అవుట్ సోర్సింగ్ సిబ్బంది సూచించారు. అయితే త‌మ‌కు ఆరు రెమిడిసియ‌ర్ వ్యాక్సిన్‌లు కావాల‌ని ఆర్డ‌ర్ చేశారు. దీంతో అవుట్ సోర్సింగ్ సిబ్బంది వ్యాక్సిన్ తీసుకుని వాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. త‌క్ష‌ణం వారిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారుల‌కు విస్తుపోయిన విష‌యాలు వారి నుండి రాబ‌ట్టారు. ఆస్ప‌త్రిలో కోవిడ్ పేషెంట్ల‌కు అందించాల్సిన రెమిడిసియ‌ర్ వ్యాక్సిన్ రూ.5400 ఉంటుంద‌ని అయితే వీరు అదే వ్యాక్సిన్‌ను పేషెంట్ కు ఇవ్వ‌కుండా ఇచ్చిన‌ట్టు చూపి బ‌య‌ట‌కు రూ.10 వేల‌కు విక్ర‌యిస్తున్నార‌ని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ అద‌న‌పు ఎస్పీ జి. స్వ‌రూపారాణి వెల్ల‌డించారు. రెమిడిసియ‌ర్ బ‌య‌ట విక్ర‌యిస్తున్న ఇద్ద‌రు హౌస్ కీపింగ్ సిబ్బందితో పాటుగా వారికి స‌హ‌క‌రిస్తున్న ముగ్గురు న‌ర్సుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

adult vaccination india: పెద్ద‌వాళ్లు వేసుకునే టీకాల గురించి తెలుసా?

adult vaccination india సాధార‌ణంగా టీకాలు చిన్న పిల్ల‌ల‌కే వేస్తార‌నుకుంటాం. కానీ పెద్ద‌వాళ్ల‌కూ టీకాలుంటాయి. అది ప్ర‌స్తుత కాలంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల తెలిసింది. అంద‌రూ టీకాలు Read more

vaccination: క‌రోనా వైర‌స్ పోరులో మ‌రో మైలు రాయిని అధిగ‌మించిన భార‌త్

vaccination న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిపై జ‌రుగుతున్న పోరులో భార‌త్ మ‌రో మైలు రాయిని అధిగ‌మిం చింది. క‌రోనా వైర‌స్‌ను నివారించే టీకాల పంపిణీలో అత్యంత వేగంగా Read more

Covid Vaccine : ఇక గ‌ర్భిణీల‌కు కూడా! రాష్ట్రాల‌కు కేంద్రం సూచ‌న‌!

Covid Vaccine : దేశంలో క‌రోనా ముప్పును త‌గ్గించేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా వ్యాక్సిన్ ప్ర‌ధాన‌మైన‌ది. ఈ నేప‌థ్యంలో 18 సంవ‌త్స‌రాలు నిండిన Read more

Third wave of Corona : థ‌ర్డ్‌వేవ్ ముంచుకొస్తుందా? సెకండ్‌వేవ్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మా?

Third wave of Corona : భార‌త్‌లో క‌రోనా మ‌హమ్మారి విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే సెకండ్ వేవ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌జ‌ల‌కు థ‌ర్డ్‌వేవ్ భ‌యం ప‌ట్టుకోంది. సెకండ్‌వేవ్ తీవ్ర‌త Read more

Leave a Comment

Your email address will not be published.