omicron variant powerప్రపంచ దేశాలను ప్రశాంతంగా ఉండనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొత్త వైరస్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెరగడంతో ఆయా దేశాల్లో ఆందోళన మొదలవుతుంది. గడచిన రెండు సంవత్సరాలు కరోనా వైరస్ మనుషులను గడగడలాడిస్తే, ఒమిక్రాన్ ప్రారంభ దశలోనే భయాందోళన చెందే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే 4.2 రెట్లు వేగంతో వాతావరణంలోకి వ్యాప్తి చెందుతుందని జపాన్‌కు చెందిన శాస్త్రవేత్త ఇటీవల అధ్యయనంలో కనుగొన్నారంట. జపాన్‌లోని క్యోటో యూనివర్శిటీలో ఆరోగ్య, పర్యావరణ శాస్త్రాల ప్రొఫెసర్‌గా హిరోషి నిషియురా అనే ఇతను పనిచేస్తున్నారు. అయితే దక్షిణాఫ్రికా దేశం గౌటెంగ్ ప్రావిన్స్‌లో ఈ ఏడాది నవంబర్ వరకు అందుబాటులో ఉన్న సమాచారన్ని (omicron variant power)విశ్లేషించారంట.
తాజా సమాచారం మేరకు ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి జరుగుతున్నాయి. సహజ, వ్యాక్సిన్ల ద్వారా మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తిని కూడా ఇది తప్పించుకుంటుందంటే ఎంత బలమైన వేరియంటో అర్థం చేసుకోవచ్చు. దక్షిణాఫ్రికాలో టీకా రేటు 30 శాతం కంటే తక్కువుగా ఉందట. దీంతో అక్కడ ప్రజల్లో చాలా మందికి వైరస్ సహజంగానే సోకి ఉంటుంది. అధిక వ్యాక్సినేషన్ రేటు ఉన్న ప్రపంచ దేశాల్లోనూ ఇలాగే కొనసాగనుందా? లేదా? అని తేలేందుకు మరికొంత సమయం పట్టనుందని జపాన్ శాస్త్రవేత్త తెలిపారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!