Core Web Vitals Assessment: Omicron Update News:మెల్ల‌మెల్ల‌గా పాకుతున్న ఓమిక్రాన్..సెంచ‌రీకి కొంచ

Omicron Update News:మెల్ల‌మెల్ల‌గా పాకుతున్న ఓమిక్రాన్..సెంచ‌రీకి కొంచెం ద‌గ్గ‌ర‌లో కేసుల సంఖ్య‌!

Omicron Update News ఢిల్లీ: భార‌తదేశంలో ఓమిక్రాన్ మెల్ల‌మెల్ల‌గా పాకుతోంది. గ‌త కొద్ది రోజులుగా ఇత‌ర రాష్ట్రాల్లో క‌నిపించిన ఓమిక్రాన్ ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట‌ర్ అయ్యింది. ద‌క్ష‌ణాఫ్రికాలో మొద‌లైన ఈ వైర‌స్ విజృంభ‌ణ అన‌తికాలంలోనే ప్ర‌పంచంలోని మిగ‌తా దేశాల‌కు కూడా పాకుతోంది. అత్యంత వేగంగా మ‌హ‌మ్మారి వ్యాపించ‌డంతో ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. భార‌త్‌లో కొత్త‌గా మ‌హారాష్ట్ర‌లో 4, కేర‌ళ‌లో 4, త‌మిళ‌నాడు(చెన్నై) న‌గ‌రంలో 1 కేసు న‌మోదైంది. దీంతో దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 73కు చేరింది. కేసుల సంఖ్య పెర‌గ‌డంతో దేశంలో ఆందోళ‌నక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. గ‌త రోజు కింద‌ట తెలంగాణ‌లో కూడా కొత్త‌గా 02 కేసులు న‌మోద కావ‌డంతో ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు(Omicron Update News) ఉలిక్కిప‌డుతున్నారు.

మహారాష్ట్ర‌లోని ఓమిక్రాన్ తీవ్ర‌త ఎక్కువుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అత్య‌ధిక కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో ఓమిక్రాన్ కేసుల‌ను గ‌మ‌నిస్తే మ‌హారాష్ట్ర‌లో 32, రాజస్థాన్ 17, ఢిల్లీలో 06, కేర‌ళ 5, త‌మిళ‌నాడు 01, చంఢీగ‌ఢ్ 01, ఏపీ 01 ఓమీక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *