omicron health insurance: కోవిడ్ చికిత్సకు ఉపయోగపడుతున్న ఆరోగ్యబీమా పాలసీలు ఒమిక్రాన్ వ్యాధిగ్రస్తులకూ ఉపయోగపడతాయని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డిఎఐ)స్పష్టం చేసింది. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు జారీ చేసిన అన్ని రకాల ఆరోగ్య బీమా పాలసీల్లో (omicron health insurance)కోవిడ్-19 చికిత్సకు పరిహారం ఇవ్వాలని ఐఆర్డిఏఐ ఏప్రిల్ 1,2020 న ఆదేశాలిచ్చింది.
ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్న వేళ మరోసారి తన ఆదేశాలను గుర్తు చేస్తూ కొత్త వేరియంట్ చికిత్సకూ బీమా పరిహారం చెల్లించాల్సిందేనని సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. నగదు రహిద చికిత్సలకు సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. బీమా సంస్థలతో ఉన్న ఒప్పందాల మేరకు పాలసీదారులకు నగదు రహిత చికిత్స అందించడంలో ఆసుపత్రులు సైతం తగిన సహకారం అందించాలని కోరింది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!