Old Words Meaning | తెలుగులో పాత కాలం పెద్దలు కొన్ని పదాలు వాడేవారు. అవి సూటిగా ఆ సందర్భానికి అనుగుణంగా ఇమిడిపోతుంటాయి. అవి సూక్తులు కావొచ్చు, సామెతలు కావొచ్చు. ఒక మాట అన్నారంటే దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. పెద్దలు చెప్పే మాటలు అప్పుడప్పుడు గమ్మత్తుగా ఉంటుంటాయి. ప్రస్తుత కాలంలో Cellఫోన్లు వచ్చిన తర్వాత అలాంటి మాటలు మాట్లాడే వారు కరువయ్యారు. వాటి గురించి అర్థం చెప్పేవారు కూడా లేరు. కానీ ఇక్కడ అలాంటి కొన్ని పాత కాలం Padaalu, సామెతలు వివరంగా పొందు పరిచాము. మీరు కూడా ఒకసారి Old Words Meaning చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.
Old Words Meaning
లోకులు: ఒరిజనల్ కాకులు
ఆశ: పుట్టడం తేలిక..చావడం కష్టం
రెస్టారెంటు: రెస్టు తక్కువ..రెంటు ఎక్కువ
కెమెరా: అందరికీ నిర్భయంగా కన్నుకొట్టేది
నిజమైన స్నేహం: వెల కట్టలేనిది..వేలలో ఒకరిది
విందు: ఇచ్చేవారికి Cashట్రబుల్ ..పుచ్చుకొనే వారికి Gas ట్రబుల్
అప్పు: తీసుకున్న వారికి Happy..ఇచ్చిన వారికి BP
నిజమైన క్రికెటర్: తినమని ఏ కాయ ఇచ్చినా దానిని ప్యాంటుకు రుద్దుకొని తినేవాడు.
సమాజం: ధనమున్నప్పుడు మనలోని లోపాల్ని కప్పిపుచ్చేది. లేనప్పుడు మనలోని లోపాల్ని విప్పిచెప్పేది.
టి.వి: తలనొప్పి తెప్పించి, తగ్గడానికి ఏ మాత్రలు వేసుకోవాలో ప్రకటనలలో చూపించేది.
ప్రభుత్వ Office: మామూలుగా జరగాల్సిన పనులు మామూలుతో జరిగే చోటు
మోటారు సైకిల్: కొన్నప్పుడు షోరూం ఓనరును, ఎక్కించుకున్నప్పుడు భార్యని, పడ్డప్పుడు వైద్యుడ్ని సంతోషపెట్టేది.
తల: తాకట్టు పెట్టుకోవాడానికి
గడ్డం: పట్టుకుని బతిమాలాడటానికి
ముక్కు: పిండి వసూలు చేయడానికి
వీపు: విమానం మోత మోగించడానికి
కాలు: బలపం కట్టుకుతిరగడానికి
కాళ్లు: పట్టుకుని బతిమాలాడటానికి
అరికాలు: దానిమంట తలకెక్కించుకోవడానికి
కళ్లు: నిప్పులు పోసుకోవడానికి
భుజాలు: గుమ్మడి కాయ దొంగెవరంటే తడుముకోవడానికి
చెంప: చెల్లుమనిపించడానికి
వేలు: ఎత్తి చూడటానికి
చేతులు: జోడించి నమస్కరించడానికి
అరచేయి: వైకుంఠం చూపించడానికి
పొట్ట: తిప్పలకోసం
నడుము: వంచి పనిచేయడానికి
నొసలు: చిట్లించడానికి
టోటల్‌గా దేహం: తనువు చాలించడానికి..
ఆరేండ్లు వెంట పడితే ఏ అమ్మాయికైనా పాలేరవుతాడు.
తిరగనేర్చిన కాలు…ప్రేమను పొందని హృదయం ఊరుకోదు.
ప్రేమికులను ఏడిపించిన పాపం ఊరికే పోదు.
పొడిచే ఎద్దు…కుండల కొద్దీ తిని కొండలైనా కరిగించే కొడుకు ఇంట్లో ఉండొద్దు.