Limca

Old Limca Ad(1986): గుర్తుందా మీ మొద‌టి బ‌హుమానం?

Products

Old Limca Ad(1986) | టివి ఆన్ చేయ‌గానే సీరియ‌ల్ 5 నిమిషాలు అయితే యాడ్స్ మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లిపి 3 నిమిషాలు వ‌స్తున్నాయి. ఈ యాడ్స్‌ను చూడ‌లేక ఒక్కొక్క‌సారి చిరాకు ప‌డుతుంటాం. కానీ త‌ప్ప‌దు కాబ‌ట్టి బెల్లం కొట్టిన రాయిలా అలానే సీరియ‌ల్ కోసం ఈ Ads అయిపోయే వ‌ర‌కూ చూస్తూనే ఉంటాం. ఈ కాలంలో ఒకొక్క యాడ్ ను చూస్తుంటే ఒక సినిమా రేంజ్‌లో స‌న్నివేశాల‌ను త‌ల‌పిస్తుంటాయి. వ్యాపార రంగంలో మొట్ట‌మొద‌టిగా సేల్స్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించేది అడ్వ‌టేజ్ మెంట్ అని తెలుసు క‌దా! అందుకే పెద్ద పెద్ద కంపెనీలు కోట్లు దార పోసి త‌మ వ‌స్తువుకు సంబంధించి యాడ్స్‌ను ప‌బ్లిక్‌లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ముందు వ‌రుస‌లో ఉంటాయి.

ఇప్పుడు ఏ ప్రొడ‌క్ట్ యాడ్ అయినా స‌రే డిజిట‌ల్ టెక్నాల‌జీలో టివిలు, సినిమాలు, యూట్యూబ్‌, వెబ్‌సైట్స్‌, సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫ్లామ్స్‌పై ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ద‌ర్శ‌నం ఇస్తుంటాయి. కానీ 40 సంవ‌త్స‌రాల వెన‌క్కు వెళ్లి చూస్తే అస‌లు ప్ర‌క‌ట‌న‌లు ఎలా ఉండేవి? వ‌స్తువును అమ్మ‌డం కోసం వారు యాడ్‌ను ఎలా ఇచ్చేవారు? అప్ప‌డి సంభాష‌ణ ఎలా ఉంటుంది? ఇవ‌న్నీ కాస్త ఈ కాలంలో మ‌న‌కు తెలియ‌క‌పోవ‌చ్చు. గూగుల్ త‌ల్లిని ఆశ్ర‌యించి సెర్చ్ ఇంజ‌న్‌లో వెతికిన‌ప్ప‌టికీ వాటి ప్ర‌స్తావ‌న పెద్ద‌గా క‌నిపించ‌దు.

ఓల్డ్ లిమ్కా యాడ్ | Old Limca Ad(1986) గురించి!

ఈ కంటెంట్‌కు హెడ్డింగ్ గుర్తుందా మీ మొద‌టి బ‌హుమానం? అని పెట్టాము క‌దా!. ఇదే పాత రోజుల్లో స‌రిగ్గా 1980 – 1986 సంవ‌త్స‌రాల్లో లిమ్కా డ్రింక్ వారి యాడ్ ప్ర‌క‌ట‌న హెడ్డింగ్‌. అప్ప‌ట్లో సామాన్య ప్ర‌జ‌ల వ‌ద్ద ఎలాంటి ఫోన్లు కానీ, టివీలు, ప్ర‌సార మాద్య‌మాలు ఏమీ అందుబాటులో లేవు కాబట్టి..వారు ఏ స‌మాచారం తెలుసుకోవాల‌న్నా 24 గంట‌ల త‌ర్వాత తెల్ల‌వారు జామున వ‌చ్చే న్యూస్ పేప‌ర్‌తోనే. ఒక వ్య‌క్తి మ‌ర‌ణించాడ‌న్నా, ప‌క్క మండ‌లంలోనో, ప‌క్క ఊరులోనో ఏదైనా అగ్ని ప్ర‌మాదం సంభ‌వించినా, పెద్ద పెద్ద రాజ‌కీయ నాయ‌కులు ఊరిలోకి వ‌చ్చినా రేప‌టి పేప‌ర్‌లో వివ‌రాలు చూస్తే గాని తెలుస్తుంది.

ఓల్డ్ లిమ్కా యాడ్ ప్ర‌క‌ట‌న ఎలా ఉంటుందంటే?

ప‌ట్ట‌లేని ఆనందంతో గుండె ఎలా వేగంగా కొట్టుకుందో గుర్తుందా? ఊత్సాహంతో బిగ్గ‌ర‌గా న‌వ్విన ఆ రోజు గుర్తిందిగా లిమ్కా త్రాగి ఎలా దాహం తీర్చు కొన్నారో గుర్తుందా? జిల్ల‌నిపించే ఆ లిమ్కా(Limca taste) రుచి? ఐసొటానిక్ ల‌వ‌ణాల‌తో నిజంగా దాహం తీర్చే పానీయం నిమ్మ‌కాయ నీరులా మ‌జానిచ్చే ఆ లిమ్కా రుచి మాధుర్యం. ప్ర‌తిమారూ లిమ్కా త్రాగిన‌ప్పుడు వ‌స్తుంది క‌దూ జ్ఞాపకం?. లిమ్కా నిమ్మ‌రుచి స‌దా ఆనందం అనుభూతి…

ఈ యాడ్ 1986లో అప్ప‌టి జ్యోతి పేప‌ర్‌లో ప్ర‌చురిత‌మైన‌ది. ఎటువంటి క‌ల‌ర్ లేకుండా ఉండే బొమ్మ‌ల‌ను, క‌నిపించీ క‌నిపించ‌ని అక్ష‌రాల‌ను ముద్ర‌ణ చేసి లిమ్కా డ్రింక్ కంపెనీ అడ్వ‌టేజ్ మెంట్ ఇచ్చింది. ఏదేమైనా పాత కాల‌పు జ్ఞాప‌కాల‌ను ఒక్కాసారి చూస్తే మ‌న తాత‌లు, ముత్తాలు ఎలా ఉండేవారో, ఎలాంటివి చూశారో అర్థ‌మ‌వుతుంది క‌దా!. గూగుల్‌లో వెతికినా దొర‌క‌ని ఆ కాలం నాటి స‌మాచారం, వింత‌లు, విశేషాలు ఇక నుంచి ఖ‌మ్మం మీకోసం.కామ్‌ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నుంది. త‌ప్ప‌కుండా ఫాలో కండి!.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *