obesity meaning in telugu : మన శరీరంలో కొవ్వు పేరుకు పోవడాన్నే ఒబెసిటీ అని అంటారు. దీనిని ఆయుర్వేదంలో మేదో రోగ అని తెలుగులో స్థూలకాయం అని కూడా అంటారు. దీని వల్ల మనిషి శరీరంలో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోవడం సమస్యగా చెప్పవచ్చు. ముఖ్యంగా పొట్ట, రొమ్ము, పిరుదులు, నడుము మొదలైన భాగాల్లో అధిక శాతం కొవ్వు పేరుకుపోతుంది.
obesity meaning in telugu: ఒబెసిటీ అంటే?
ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల కొలెస్ట్రాల్ ఏర్పడి రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీంతో అధిక రక్తపోటు వస్తుంది. మనిషికి ప్రధానమైన గుండె, కాలేయం, మూత్ర పిండాల పనితీరును ఆటకంపరుస్తుంది. తద్వారా గుండె జబ్బులు, మూత్ర పిండాల వ్యాధి, మధుమేహం లాంటి ప్రాణాంతక జబ్బులు తోడవుతాయి. ఈ సమస్యతో బాధపడే వారు ఏమాత్రమూ పని చేయలేరు. కొద్దిగా నడిచినా ఆయాసం వస్తుంది. ఊపిరి పీల్చుకోవడం కష్టతరంగా మారుతుంది. దీని వల్ల ఆస్తమా, గుండె జబ్బులు వస్తాయి. ఎప్పుడూ ఇబ్బంది పడుతూ యాక్టివ్‌గా లేకపోవడం వీరి లక్షణాలు.
ఈ ఊపకాయంతో బాధపడేవారికి వారి శరీరాకృతి అందహీనంగా కనిపిస్తుంది. దీని వల్ల నలుగురు వింతగా చూస్తుంటారు. నలుగురితో కలిసి మాట్లాడటం క్రమ క్రమంగా తగ్గిపోతుంది. డిప్రెషన్ తోడై మరింత లావుగా మారుతుంటారు. ఇక పెళ్లి అయ్యే ఆడవారు ఈ సమస్యతో బాధపడుతుంటే వారికి పెళ్లి సంబంధాలు వచ్చినా పెద్దగా నచ్చకపోగా తిరస్కరిస్తుంటారు. దూర ప్రయాణాలు చేయాలన్నా, ఆఫీసులకు వెళ్లాలన్నా ఇబ్బందిగా మారుతుంది. పనిలో చురుకుదనం తగ్గితే కంపెనీ వారు వారిని తిరస్కరిస్తారు.
ప్రస్తుతం ఉన్న ఆధునిక వైద్య రంగంలో ఈ సమస్య గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. మొన్న లావుగా కనిపించిన వారు నేడు స్లిమ్‌గా కనిపిస్తున్న వారిని మనం చూస్తూనే ఉంటున్నాం. కాలక్రమంలో బీజీ లైఫ్‌లో సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల, లేదా అధిక ఆహారం (food) తీసుకోవడం వల్ల వచ్చే ఈ ఊబకాయం సమస్యను మనకు మనం నిపుణుల సలహాతో తగ్గించుకోవచ్చు.
స్థూలకాయులకు వచ్చే సమస్యలు ఇవే!
ఈ సమస్యల (obesity meaning in telugu) తో బాధపడేవారికి ఎక్కువగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు, స్త్రీలలో సంతానలేమి సమస్య, పీసీఓడీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో అధికంగా పెరగడం వల్ల పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అదే విదంగా ఈ సమస్యతో బాధపడే వారికి ఉబ్బసం కూడా వస్తుందట. ఒబెసిటీ ఉన్న వారు రాత్రిళ్లు బాగా గురక పెడుతుంటారు.
ఈ obesity సమస్యకు కారణం పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఐస్‌క్రీములు, వెన్న, నెయ్యి, ఫాస్ట్‌ఫుడ్ లాంటివి అధికంగా తీసుకోవడం, శారీరక, మానసిక శ్రమ లేకపోవడం, విలాసవంతమైన జీవితం గడపడం, సరైన వ్యాయామం (jogging) చేయకపోవడం ప్రధాన సమస్యలుగా చెప్పవచ్చు. ఈ సమస్యలతో బాధపడేవారు మీకు అందుబాటులో ఉన్న డాక్టర్లను సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవాలి. బరువు తగ్గడం కోసం ఒక్కసారే భోజనం మానేయకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మంచినీరు ఎక్కువగా తాగాలి. నిమ్మరసం, తేనె కలిపిన గోరు వెచ్చని నీటిని ప్రతిరోజూ ఉదయం తాగుతూ ఉండాలి.