50 Sheep killed

50 Sheep killed : రోడ్డు ప్ర‌మాదంలో 50 గొర్రెలు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

50 Sheep killed :Nuzividu: రోడ్డు ప్ర‌మాదంలో 50 గొర్రెలు అక్క‌డికక్క‌డే మృతి చెందిన సంఘ‌ట‌న కృష్ణా జిల్లా నూజివీడు మండ‌లం మీర్జాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. నూజివీడు మండ‌లం సుంకొల్లు గ్రామానికి చెందిన మాగంటి నారాయ‌ణ‌, ఆర్ల వెంక‌టేశ్వ‌ర‌రావు, మాగంటి శ్రీ‌నివాస‌రావు ల‌కు చెందిన 200 గొర్రెల‌ను గుడివాడ వైపు తోలుకు వెళుతున్నారు. ఈ క్ర‌మంలో హ‌నుమాన్ జంక్ష‌న్ నుండి వేగంగా వ‌స్తున్న లారీ గొర్రెల‌పై కి దూసుకెళ్లింది. ఇది గ‌మ‌నించిన గొర్రెల కాప‌రులు లారీని ఆపే ప్ర‌య‌త్నం చేయ‌గా, లారీ త‌మ మీద‌కె వ‌స్తుంటంతో భ‌యాందోళ‌న‌కు గురై ప్ర‌క్క‌కు పారిపోయిన‌ట్టు కాప‌రులు చెబుతున్నారు. గొర్రెల మృతితో రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు న‌ష్టం వాటిల్లింద‌ని, త‌మ‌కు న్యాయం చేయాల‌ని కాప‌రులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై బాధితులు నూజివీడు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. రూర‌ల్ ఎస్ఐ సిహెచ్ రంజిత్ కుమార్ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇది చ‌ద‌వండి:మిస్సైన బంగారం దొంగ‌లు దొరికారు!

ఇది చ‌ద‌వండి: 26న దేశ‌వ్యాప్తంగా బంద్‌కు పిలుపు!

ఇది చ‌ద‌వండి:కిడ్నాప్ నాట‌క‌మాడిన యువ‌తి ఆత్మ‌హ‌త్య

ఇది చ‌ద‌వండి:దెయ్యం భ‌య్యం..కాల‌నీ ఖాళీ చేసిన ప్ర‌జ‌లు

ఇది చ‌ద‌వండి:ష‌ర‌తుల‌పై విర‌సం నేత‌కు బెయిల్ మంజూరు

ఇది చ‌ద‌వండి:కోవిడ్ వ‌ల్లే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుద‌ల

ఇది చ‌ద‌వండి:ఖాకీ మాటున మాన‌వ‌త్వాన్ని చూపిన ప్ర‌తి పోలీసుకు సెల్యూట్: డీజీపీ

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *