Nuts: ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యకరమైన ఆహారాల్లో నట్స్‌తో ఒంటికి చాలా మేలు జరుగుతుంది. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, మినరల్స్ పొందవచ్చు.
బాదాం, వాల్‌నట్స్(Nuts), బ్రెజిల్ నట్స్, పైన్, పిస్తా పప్పులు మన శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు, ప్రొటీన్స్ వంటి పోషకాలను అందిస్తాయి. వీటిల్లో ఫైబర్, విటమిన్ బి, ఇ, మినరల్స్, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గించుకునేందుకు నట్స్ తినడం శ్రేయస్కరం.
ఇవి తినడం వల్ల భోజనం చేసినంత సంతృప్తి కలుగుతుంది. ఇవి ఒంటిలోని చెడుకొవ్వులను నియంత్రిస్తాయి. నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించేందుకు ఈ Nuts గొప్పగా పని చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఒమెగా-3 ఫ్యాట్స్ కావాలి. అవి Wallనట్స్‌లో ఉంటాయి. వీటిల్లో ఏఎల్ఏ యాసిడ్ గుండె సంబంధిత అరిథ్మియాస్‌కు ఉపయోగపడుతుందని స్పానిస్ నిపుణుల అధ్యయనం చెబుతున్నది. బాదాంలో తక్కువ స్థాయిలో కేలరీలు, ఎక్కువ క్యాల్షియం ఉంటుంది.


వీటితో పాటుగా అధిక ఫైబర్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు గుండెల్లో మంట, ఊపిరితిత్తుల క్యాన్సర్, వయసు పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. పిస్తా పప్పులు యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఇవి గానూ-టోకోఫేరోల్ రూపంలో ఒంటికి శక్తిని అందిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ E క్యాన్సర్ కారక కణాలపై పోరాటం చేస్తుంది. పిస్తా పప్పులో ఉండే పొటాషియం, మినరల్స్ నాడీ, కండర వ్యవస్థలు మంచిగా పని చేసేందుకు సహాయపడుతుంది. వీటిల్లో ఉండే విటమిన్ B6 రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మనసు ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.
బాదం పప్పును నీటిలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. బాదంపప్పును కనీసం 8 గంటల పాటు నీటిలో నానబెట్టి అనంతరం పొట్టు తీసుకుని తింటే ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పొట్టుతో సహా బాదంపప్పు తింటే సరిగ్గా జీర్ణం కాదని, పప్పులో ఉండే పోషకాలు శరీరంలోకి చేరవని తెలిపారు. సరిగ్గా జీర్ణం కాకపోతే గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని నీటిలో నానబెట్టి పొట్టు తీసుకుని తింటే సులభంగా జీర్ణం కావడమే కాకుండా మిక్కిలి పోషకాలు లభిస్తాయన్నారు.
Almond, పిస్తా వంటివి తింటే బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు. కానీ ఇది అవాస్తవమని లిండా యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. వీటితో బరువు తగ్గడంతో పాటు భవిష్యత్తులో ఊబకాయం వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని వీరి అధ్యనంలో వెల్లడైంది. ఇందులో మంచి ఫ్యాట్స్, విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్‌తో పాటు మనకు అధిక శక్తి లభిస్తుందని వారు తెలిపారు. ఫలితంగా ఇతర ఆహారం తినాలనే కోరిక అంతగా ఉండదట.


Nuts: భావప్రాప్తి పొందాలంటే ఇవి తినాల్సిందే!
బాదం, జీడిపప్పు, అక్రోట్ల వంటి గింజపప్పులు(Nuts) చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు అదుపులో ఉండటం దగ్గర్నుంచి ఉత్సాహం, మేధోశక్తి, మూడ్ పుంజుకోవడం వరకూ ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. ఇవి శృంగార జీవిత మెరుగుపడటానికీ తోడ్సడుతున్నట్టు తాజాగా బయటపడింది. రోజుకు 60 గ్రాముల గింజపప్పులు తినేవారిలో శృంగార ఆసక్తి పెరగటంతో పాటు మెరుగైన భావప్రాప్తిని పొందుతుండటం గమనార్హం.
తాజా పండ్లు, కూరగాయలు తక్కువుగా ఉండే పాశ్చత్య ఆహార అలవాట్లు గల కొందరిపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరికి తమ మామూలు ఆహారం, మరికొందరికి బాదం, అక్రోట్లు, హేజెల్ నట్స్ కూడా తినమని సూచించారు. ఇలా 14 వారాలు చేసిన తర్వాత పరిశీలించగా, గింజపప్పులు జత చేసినవారిలో శృంగారాసక్తి, భావప్రాప్తి మెరుగుపడినట్టు తేలింది. గింజపప్పుల్లో ప్రొటీన్, పీచు, అత్యవసర విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడేవే.
వీటిల్లో ఫాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి స్తంభనలోపం తగ్గడానికే కాకుండా గుండె రక్తనాళ వ్యవస్థ మేలు చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారానికి గింజపప్పులనూ జోడించినట్లయితే అంగస్థంభన, శృంగారాసక్తి మెరుగయ్యే అవకాశమున్నట్టు అధ్యయన ఫలితాలు రుజువు చేస్తున్నాయని వివరిస్తున్నారు.