NRI Marriage Fraud

NRI Marriage Fraud: అమెరికా నుంచి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా పెళ్లిళ్లు చేసుకుంటున్న మోస‌గాడు..ఐదో పెళ్లి వ‌ద్ద బాబుగారి బాగోతం బ‌య‌ట‌ప‌డింది!

Spread the love

NRI Marriage Fraud: గుంటూరు: అమెరికా నుంచి వ‌చ్చి పెళ్లి చేసుకోవ‌డం, కొద్ది రోజులు కాపురం ఉండ‌టం.. ఇలా న‌లుగురు యువ‌తుల జీవితాల‌ను బ‌లి తీసుకున్నాడు. గుంటూరు జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాల్ప‌డ్డాడు. చివ‌ర‌కు నాల్గో భార్య ఫిర్యాదుతో ఐదో పెళ్లి కుదిరే స‌మ‌యంలో మోస‌గాడి అస‌లు రంగు బ‌య‌ట ప‌డింది.

గుంటూరు జిల్లాలోని నిత్య పెళ్లి కొడుకు వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. అమెరికాలో (NRI Marriage Fraud)ఉంటున్న వ్య‌క్తి సెల‌వుల‌పై ఇండియా వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఒక‌రిని పెళ్లి చేసుకుంటున్నాడు. వారితో కొద్ది రోజులు కాపురం చేస్తూ మొహం చాటేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగుర్ని ఇలాగే మోసం చేసి ఐదో పెళ్లికి సిద్ధం కాగా ఈ నిత్య పెళ్లికొడుకు వ్య‌వ‌హారాన్ని ఓ బాధిత యువ‌తి బ‌య‌ట‌పెట్టారు.

త‌న‌ను పెళ్లి చేసుకుని మోసం చేసిన‌ట్టు గుంటూరు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండ‌లానికి చెందిన క‌ర్నాటి వీర భ‌ద్ర‌రావు కుమారుడు క‌ర్నాటి స‌తీష్ అనే వ్య‌క్తి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అత‌డి త‌ల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగ‌మ‌ని చెబుతారు. సెల‌వుపై అత‌డు ఊరికి వ‌చ్చిన స‌మ‌యంలో ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తారు.

నెల రోజులు కాపురం చేశాక‌.. మ‌ళ్లీ వ‌చ్చి అమెరికా తీసుకెళ్తాన‌ని చెప్పి వెళ్లిపోతాడు. ఇలా గుంటూరుకు చెందిన ఎంబీఏ చ‌దివిన యువ‌తితో సంబంధం కుదుర్చుకుని భారీగా క‌ట్నం తీసుకున్నాడు. 2019లో పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నాడు. నెల‌పాటు ఇక్క‌డే అమెతో కాపురం చేశాడు. కొద్ది రోజుల‌య్యాక అమెరికా తీసుకెళ్తానంటూ న‌మ్మించి వెళ్లిపోయాడు.

ఇక వ్య‌క్తి నెల‌లు గ‌డుస్తున్నా రాక‌పోగా.. ఫోన్ చేసినా స్పంద‌న లేదు. అత్త‌మామ‌ల‌ను అడిగితే పొంత‌న లేని స‌మాధానాలు చెప్ప‌డంతో అనుమానం వ‌చ్చింది. అత‌డి గురించి ఆరా తీస్తే గ‌తంలో కూడా ఇలాగే పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసిన‌ట్టు కేసులున్నాయ‌ని తెలిసింది. త‌నని నాలుగో పెళ్లి చేసుకున్నాడ‌ని తెలుసుకున్నారు. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి 24న పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌గా పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని ఆమె ఆరోపించారు.

ఈ ఏడాది మార్చి 26న కేసు న‌మోదు చేశారు. వారాని ఏప్రిల్‌లో దిశ పోలీస్ స్టేష‌న్ కు పిలించారు. ఐదు నెల‌లైనా నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆరోపిస్తున్నారు.

గ‌త డిసెంబ‌రులో అత‌డు ఇండియాకు వ‌చ్చి త‌ల్లిదండ్రుల‌ను క‌లిసి విజ‌య‌వాడ‌కు చెందిన యువ‌తితో ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు. త్వ‌ర‌లో ముహూర్తాలు పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విష‌యం నాలుగో భార్య‌కు తెలియ‌డంతో ఐదో పెళ్లి వారికి చెప్పారు. దీంతో వారు పెళ్లి ర‌ద్దు చేసుకోగా, అత‌డు అమెరికా వెళ్లిపోయాడు. అత‌డ్ని ఇండియాకు ర‌ప్పించి, చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధితురాలు కోరారు.

13 ఏళ్ల కింద‌ట విశాఖ‌కు చెందిన యువ‌తిని అత‌డు వివాహ‌మాడి విడిచిపెట్టాడు. మూడేళ్ల త‌ర్వాత ఆమె బంధువును పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల త‌ర్వాత న‌ర‌స‌రావుపేట‌కు చెందిన మ‌రొక‌రిని పెళ్లి చేసుకున్నాడు. అత‌ని నిర్వాకం గురించి తెలిసిన ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడుని అరెస్టు చేసి అత‌ని పాస్‌పోర్ట్ సీజ్ చేశారు. ఆమెతో రాజీ చేసుకుని మ‌ళ్లీ అమెరికా వెళ్లాడు. 2019లో గుంటూరుకు చెందిన యువ‌తిని నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అలా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఐదో పెళ్లి వ్య‌వ‌హారం వ‌ద్ద దొరికిపోయాడు. ప్ర‌స్తుతం పోలీసులు ఆ మోస‌గాడిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాలి మ‌రి!.

ATM card change: ముస‌లివారిని టార్గెట్ ..ఏటీఎంలో డ‌బ్బులు మాయం!

ATM card change గుంటూరు: అత‌ను ఏటిఎం వ‌ద్ద‌నే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. ఎవ‌రు ఏటిఎంలోకి వెళితే వారి వెనుకాలే ఉంటాడు. ఏటిఎంలో డ‌బ్బులు తీయ‌డానికి వ‌చ్చిన వ్య‌క్తి మాట‌ల్లో Read more

fake currency:దారి బాట‌లో న‌కిలీ క‌రెన్సీ క‌ట్ట!

fake currencyవినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఈపూరు మండ‌లంలోని న‌కిలీ క‌రెన్సీ వెలుగు చూసింది. ఓ రైతు పొలంకు వెళుతుండ‌గా క‌వ‌ర్లో న‌కిలీ క‌రెన్సీ ఉండ‌టాన్ని Read more

state bank of india: కోటి స్వాహా అంట‌? స్టేట్ బ్యాంక్ లో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన భారీ స్కాం?

state bank of indiaగుంటూరు: జిల్లాలోని కారంపూడి మండ‌లంలోని కారంపూడి గ్రామంలో భారతీయ స్టేట్ బ్యాంక్ లో భారీగా స్కాం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. న‌కిలీ బంగారం తాక‌ట్టు, Read more

Guntur news: గుంటూరులో ఘ‌రానా మోసం పెళ్లి పేరుతో కోటి స్వాహా!

Guntur news గుంటూరు: social media లో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి వ‌ల‌వేసిన స‌త్తెన‌ప‌ల్లి కి చెందిన దంప‌తులు అత‌ని వ‌ద్ద నుంచి పెళ్లి పేరుతో కోటి Read more

Leave a Comment

Your email address will not be published.